Gareth Southgate : యూరో కప్ 2024 ఫైనల్స్‌లో ఇంగ్లండ్ ఘోర ఓటమి తర్వాత గారెత్ సౌత్‌గేట్ మాట్లాడుతూ.. యూరో కప్ 2024 సందర్భంగా హ్యారీ కేన్ సరైన అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడని అన్నారు. ఆయ‌న చేసిన కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.  

Gareth Southgate : యూరో 2024 ఫైనల్‌లో స్పెయిన్ చేతిలో ఇంగ్లండ్  ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓట‌మి త‌ర్వాత త్రీ లయన్స్‌కు ఎనిమిదేళ్లుగా బాధ్యతలు నిర్వహించిన తర్వాత గారెత్ సౌత్‌గేట్ మంగళవారం తన ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నాడు. 53 ఏళ్ల మాజీ డిఫెండర్ ఇంగ్లండ్‌ను వరుసగా యూరో ఫైనల్స్‌కు నడిపించడంతో పాటు తన పదవీ కాలంలో ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, క్వార్టర్-ఫైనల్ అద్భుత విజ‌యాల‌తో జ‌ట్టును ముందుకు న‌డిపించాడు. యూఎస్ఏ, కెనడా, మెక్సికోలో జరిగే 2026 ప్రపంచ కప్ వరకు అతను కొనసాగాలని ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆశించినప్పటికీ, టోర్నమెంట్ సమయంలో కొనసాగుతున్న ఊహాగానాలు సౌత్‌గేట్ వైదొలగాలనే ఉద్దేశ్యాన్ని సూచించాయి. తాజాగా అధికారికంగా త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు.

 

Scroll to load tweet…

 

Scroll to load tweet…

 

"ఒక గర్వించదగిన ఆంగ్లేయుడిగా.. ఇంగ్లండ్‌కు ఆడటం.. జట్టును ముందుకు నడిపించడం, నిర్వహించడం నా జీవితంలో గొప్ప గౌరవం. నా అన్ని విషయాలను అర్థం చేసుకుంది. నేను నా పూర్తి శక్తితో జట్టుకోసం పనిచేశాను. అయితే ఇది మార్పు కోసం.. కొత్త అధ్యాయానికి వచ్చిన సమయం. ఆదివారం స్పెయిన్‌తో బెర్లిన్‌లో జరిగిన ఫైనల్ ఇంగ్లండ్ మేనేజర్‌గా నా చివరి గేమ్" అంటూ గారెత్ సౌత్‌గేట్ పేర్కొన్నాడు. అలాగే, "గత ఎనిమిదేళ్లుగా ఆటగాళ్లకు, నాకు నిరంతర సహాయాన్ని అందించిన బ్యాక్‌రూమ్ సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. వారి కృషి, నిబద్ధత నాకు ప్రతిరోజూ స్ఫూర్తినిచ్చాయి. నేను వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. వీరు ఇంగ్లండ్ జట్టు వెనుక ఉన్న అద్భుతమైన మ‌రో జట్టు అని గారెత్ సౌత్‌గేట్" పేర్కొన్నాడు.

టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన టాప్-5 బౌల‌ర్లు వీరే