టాక్ ఆఫ్ ది బ్రెజిల్: నేమర్ హెయిర్‌కట్‌

ఈ ఏడాది ఫిఫా వరల్డ్‌కప్‌లో అన్ని జట్లులలోనూ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.. వారిలో లియోనాల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, నేమర్‌కు ఉన్న క్రేజే వేరు.. వీరిని పిచ్చిగా ఆరాధించే అభిమానుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉంటుంది. ముఖ్యంగా బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నేమర్‌కు ఫాలోవర్స్ ఓ రేంజ్‌లో ఉంటారు.. అతని స్టైల్, మైదానంలో దూకుడు, ఆటపట్ల అతనికున్న అంకితభావానికి అభిమానులు ఫిదా అవుతారు.

తాజాగా 2018 వరల్డ్‌కప్‌లో అతని హెయిర్ స్టైల్ టాక్ ఆఫ్ ది ఫిఫాగా మారింది. ఏ నలుగురు కలుసుకున్నా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అతను హెయిర్ స్టైల్ మారుస్తాడని నాకు తెలుసని కొందరు.. నేమర్ ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా మార్చుకోనీయండి.. కానీ పిచ్‌లో ఆట మాత్రం ఇరగదీయాలని కోరారు..అయితే ఆ హెయిర్‌కట్‌తో ఆడటం బాగొలేదని మరికొందరు అభిమానులు అన్నారు. ఇది ఆటలో అతన్ని గెలిపించడానికి ఏ మాత్రం సహకరించదని మరో అభిమాని అన్నాడు.

"