ఫిఫా వరల్డ్ కప్ 2022: యువతులు అలాంటి బట్టలు వేసుకుని స్టేడియానికి వస్తే, జైలుకే...

శరీర భాగాలు కనిపించేలా వస్త్రాలు ధరించడంపై ఖతర్‌లో నిషేధం... హద్దుమీరితే జైలు శిక్ష! అయితే నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని చెబుతున్న ఫిఫా వరల్డ్ కప్ మేనేజ్‌మెంట్...

FIFA World cup 2022: Strick restrictions on Women Football fans dressing in Qatar

ఫుట్‌బాల్ ఓ ఆట మాత్రమే కాదు, అంతకుమించి! కొన్ని కోట్ల మంది వెంటాడే ఎమోషన్... ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కనిపించే ఎమోషన్స్, సినిమాల్లో కూడా కనిపించవు. గోల్ చేసినప్పుడు అరుస్తూ సెలబ్రేట్ చేసుకునే అభిమానులు, తమ అభిమాన టీమ్ ఓడిపోతే గుక్కపెట్టి చిన్నపిల్లల్లా ఏడ్చేస్తారు. ఫిఫా వరల్డ్ కప్‌లోనూ ఇలాంటి సీన్స్ బోలెడు చూడొచ్చు... 

క్రికెట్ ఫ్యాన్స్‌లాగే ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కూడా వివిధ రకాల వేషాల్లో, చిత్రవిచిత్ర డ్రెస్సుల్లో ముస్తాబై స్టేడియానికి వస్తుంటారు. అయితే ఖతర్ వేదికగా జరగబోతున్న ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో మాత్రం ఇలాంటి వేషాలు కుదరవు. ఖతర్‌ పూర్తిగా ఇస్లామిక్ దేశం. ఇక్కడ ఇస్లాం మత సంప్రదాయాలను పక్కాగా పాటిస్తారు. ఫిఫా ఆరంభ వేడుకల్లోనూ ఖురాన్ ఫఠనం వినిపించనుంది...

ఖతర్‌లో యువతులు ధరించే వస్త్రాల విషయంలో కఠినమైన ఆంక్షలు అమలులో ఉన్నాయి. బయటికి వచ్చే యువతులు కచ్ఛితంగా బురఖా ధరించాల్సి ఉంటుంది. ముఖం, కాళ్లు, చేతులు కూడా కనిపించడానికి వీల్లేదు. తమ దేశం వారికి మాత్రమే కాదు.. విదేశాల నుంచి ఫుట్‌బాల్ మ్యాచులు చూసేందుకు వచ్చే యువతులకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయని స్ఫష్టం చేసింది ఖతర్ ఫ్రభుత్వం...

ఫిఫా వరల్డ్ కప్ 2022 టైటిల్ ఫెవరెట్ టీమ్స్ బ్రెజిల్, ఫ్రాన్స్, అర్జెంటీనా, జర్మనీ వంటి దేశాల్లో మహిళల వస్త్రధారణపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. కొన్ని దేశాల్లో అయితే బికినీలు ధరించి, చేతిలో బీరు గ్లాసుతో మ్యాచులు చూసేందుకు వస్తారు మహిళలు... అయితే ఖతర్‌లో ఇవన్నీ కుదరవు.

ఫిఫా వరల్డ్ కప్ 2022 మ్యాచులు చూసేందుకు స్టేడియాలకు వచ్చే యువతులు, అందాలు కనిపించేలా కురచ దుస్తులు ధరించే... జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఖతర్‌లో బిగువైన జీన్స్ వేయడంపై కూడా నిషేధం ఉంది. అలా ధరించిన వారు చట్టప్రకారం శిక్షించబడతారు...

అయితే ఫిఫా వరల్డ్ కప్ మాత్రం ఈ విషయంలో యువతులకు భరోసా ఇస్తోంది. మహిళలు ఏ వస్త్రాలైనా ధరించవచ్చని, అయితే ఖతర్‌లో ఉన్న రూల్స్‌ని కాస్త దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలని ప్రకటించింది ఫిఫా వరల్డ్ కప్ మేనేజ్‌మెంట్. 

‘మ్యాచులు చూడడానికి వచ్చే వాళ్లు వారికి నచ్చిన వస్త్రాలు వేసుకోవచ్చు. అయితే పబ్లిక్ ప్లేసుల్లో పర్యటించేటప్పుడు అంటే మ్యూజియం, మిగిలిన ప్రభుత్వ కట్టడాలకు వెళ్లేటప్పుడు మాత్రం భుజాలు కనిపించకుండా పూర్తిగా కప్పుకోవాల్సి ఉంటుంది...’ అంటూ తెలియచేసింది ఫిఫా వరల్డ్ కప్ వెబ్‌సైట్...

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios