Asianet News TeluguAsianet News Telugu

‘‘ఇంగ్లాండ్‌కు టెస్టులు అవసరం లేదు’’: పీటర్సన్‌ ట్వీట్‌పై ఫ్యాన్స్ ఫైర్

వెస్టిండీస్‌ చేతిలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న ఇంగ్లాండ్‌కు మద్ధతు ప్రకటిస్తూ... ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్‌ వివాదానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే.. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లీష్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. 

fans trolled against former england captain kevin pietersen tweet
Author
England, First Published Feb 4, 2019, 1:07 PM IST

వెస్టిండీస్‌ చేతిలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న ఇంగ్లాండ్‌కు మద్ధతు ప్రకటిస్తూ... ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్‌ వివాదానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే.. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లీష్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది.

పేలవ ప్రదర్శన కారణంగా సిరీస్‌ను 2-0తో కోల్పోయింది. త్వరలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో ఇంగ్లాండ్ జట్టుపై ఇంటా బయటా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జట్టుకు మద్ధతు తెలుపుతూ.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు.

‘‘ప్రస్తుతం ఇంగ్లాండ్‌కు టెస్ట్ క్రికెట్ అంత ప్రాధాన్యత కాదు.. వారి చూపంతా వన్డే ప్రపంచకప్‌ గెలవడమే.. దానిపైనే వారు కసరత్తులు చేస్తున్నారంటూ ట్వీట్ చేశాడు. దీనిపై క్రికెట్ అభిమానులు పీటర్సన్‌ను ట్రోల్ చేశారు.

జట్టుకు మద్ధతుగా నిలిస్తే తప్పేం లేదు కానీ.. ఇక్కడ టెస్ట్ ఫార్మాట్‌నే తక్కువ చేసేలా స్టేట్‌మెంట్ ఇవ్వడం సబబు కాదని సూచించారు. ‘‘ ఇంగ్లాండ్ యాషెస్‌ సిరీస్‌లో ఓడిపోతుంది.. అప్పుడు తెలుస్తోంది నొప్పి .. వరల్డ్‌కప్‌ల లీగ్ దశ నుంచి ఇంటికి వెళ్లిపోతుంది’’ అని ఒకరు.. ‘‘90లలో టెస్ట్ ఫార్మాట్‌లో నెంబర్ వన్‌గా ఆసీస్ ప్రపంచకప్‌లు గెలవలేదా అని గుర్తుచేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios