Commonwealth Games 2022: భారత్ కు ఊహించని షాక్.. డోప్ టెస్టులో పట్టుబడ్డ ఇద్దరు మహిళా అథ్లెట్లు

CWG 2022: ఈనెల 28 నుంచి ప్రారంభం కాబోయే  కామన్వెల్త్ క్రీడలకు వెళ్లబోతున్న భారత బృందానికి ఊహించిన షాక్ తగిలింది. దేశానికి చెందిన ఇద్దరు మహిళా అథ్లెట్లు డోప్ టెస్టులో పట్టుబడ్డారు. 

Dhanalakshmi and Aishwarya Babu Failed in Dope Test, Ruled Out From commonwealth games

కామన్వెల్త్ గేమ్స్ లో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్న భారత బృందానికి ఊహించిన షాక్ తగిలింది. భారత స్టార్ స్ప్రింటర్ ధనలక్ష్మీతో పాటు  ట్రిపుల్ జంపర్ ఐశ్యర్య బాబులు డోప్ టెస్టులో పట్టుబడ్డారు. వాళ్లు ప్రాతినిథ్యం వహిస్తున్న పతకం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఈ ఇద్దరూ డోప్ టెస్టులో దొరకడం గమనార్హం. దీంతో ఈ ఇద్దరూ కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకున్నారు. 

ధనలక్ష్మీకి విదేశాల్లో అథ్లెటిక్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) లో  నిర్వహించిన డోపింగ్ టెస్టులో పాజిటివ్ అని తేలింది. ఇక గత నెలలో చెన్నైలో జరిగిన ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్స్ లో భాగంగా సేకరించిన శాంపిల్స్ లో ఐశ్వర్య డోపింగ్ కు పాల్పడిందని తేలింది. ఈ ఇద్దరూ  నిషేధిత స్టెరాయిడ్స్ వాడినట్టు  తేలడంతో ధనలక్ష్మీ, ఐశ్వర్య బాబు లు ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకున్నారు. 

24 ఏండ్ల ధనలక్ష్మీ..  బర్మింగ్హోమ్ కు బయల్దేరబోయే 36 మంది అథ్లెట్లలో ఒకరు. ఆమె వంద మీటర్ల రేస్ తో పాటు 4×100 మీటర్ల రిలే రేస్‌లో సైతం పోటీ పడాల్సి ఉంది. ద్యుతీ చంద్, హిమా దాస్, స్రబని నందలతో పాటు  స్ప్రింటర్ల  జాబితాలో ధనలక్ష్మీ కూడా ఉంది. కామన్వెల్త్ తో పాటు ఆమె  ప్రస్తుతం అమెరికా వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ష్ లో కూడా పాల్గొనాల్సి ఉంది. కానీ వీసా కారణాల వల్ల ఆమె వెళ్లలేకపోయింది. 

 

ఇక ఐశ్వర్య విషయానికొస్తే..  ట్రిపుల్ జంప్ లో ఆమె గతనెలలో జరిగిన ఇంట్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ లో జాతీయ రికార్డు నెలకొల్పింది. కానీ అదే క్రీడల్లో భాగంగా ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్ లో ఐశ్వర్య నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలింది. దీంతో ఈ ఇద్దరూ కామన్వెల్త్ క్రీడలకు దూరమయ్యారు. 

ఇదిలాఉండగా.. కామన్వెల్త్ క్రీడలలో పాల్గొనబోయే క్రీడాకారులతో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా సమావేశమయ్యారు. క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.అథ్లెట్ల  పోరాటం,  పట్టుదల, వారి సంకల్పాన్ని హైలైట్ చేసిన  మోడీ.. కామన్వెల్త్ క్రీడలలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘ఒత్తిడి లేకుండా మీ బలాన్ని నమ్మి ఆడండి.  ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగండి..’అని క్రీడాకారులలో స్ఫూర్తిని నింపారు.ఈ సందర్భంగా మోడీ.. పలువురు క్రీడాకారులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో  3000 మీటర్ల స్టీఫుల్ ఛేజర్ అవినాష్ సేబుల్, వెయిట్ లిఫ్టర్ అచింత షెయులీ,  మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి  సలీమా టెటె, సైక్లిస్ట్ డేవిడ్ బెక్ హమ్, పారా షాట్ పుటర్ షర్మిలతో మోడీ ముచ్చటించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios