కరోనా దెబ్బకు ప్రపంచమంతా గడగడలాడిపోతుంది. ఆ పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. ప్రపంచ దేశాలు సైతం దీనికి ఇంకా పూర్తిస్థాయిలో మందు లభ్యమవ్వని నేపథ్యంలో నివారణోక్కటే మార్గమని ఆ దిశగా చర్యలను చేపడుతున్నాయి. 

కఠినమైన ఆంక్షలను విధిస్తు... జనసమ్మర్ధమైన ప్రాంతాలను మూసివేస్తున్నారు. షాపింగ్ మాల్స్ నుంచి సినిమాహాల్స్ వరకు అన్నిటిని మూసివేస్తున్నారు. క్రీడా ఈవెంట్లను సైతం అన్ని దేశాలు అయితేనా వాయిదావేశాయి లేదా ఏకంగా రద్దు చేసాయి. 2020 టోక్యో ఒలింపిక్స్ పై కూడా ఈ వైరస్ నేపథ్యంలో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 

ఈ నేపథ్యంలో కరోనా దెబ్బకు వాయిదాపడ్డ క్రీడా ఈవెంట్లను ఒకసారి చూద్దాం....

క్రికెట్‌ : 

- భారత్‌, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను రద్దు చేశారు. ఈ సిరీస్‌ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ పేర్కొంది. 

- ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 15కు వాయిదా పడింది. ఏప్రిల్‌ 16 నుంచి మొదలవుతుందని అంటున్నప్పటికీ.... జరుగుతుందా అనేది డౌటే!

- ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ 2, 3వ వన్డేలు, టీ20 సిరీస్‌లు రద్దయ్యాయి.  

ఆర్చరీ:

- షాంఘైలో జరగాల్సిన ఆర్చరీ ప్రపంచకప్‌ రద్దు/వాయిదా 

బ్యాడ్మింటన్‌ : 

- చైనా మాస్టర్స్‌ వాయిదా పడింది. 

- ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్స్‌ నుంచి చైనా, హాంగ్‌కాంగ్‌లు తప్పుకున్నాయి. 

- కీలక జర్మనీ ఓపెన్‌ రద్దు చేయబడింది. 

- ఆసియా చాంపియన్‌షిప్స్‌ చైనా నుంచి మనీలాకు మార్చబడింది. 

- ఇండియా ఓపెన్‌, స్విస్‌ ఓపెన్‌, మలేషియా ఓపెన్‌, సింగపూర్‌ ఓపెన్‌ రద్దు 

టెన్నిస్‌ : 

- అన్ని ఐటా (అఖిల భారత టెన్నిస్‌ సంఘం) టోర్నీలు రద్దు 

- బిఎన్‌పీ పారిబస్‌ ఓపెన్‌ రద్దు 

- మియామి ఓపెన్‌, మోంటో కార్లో మాస్టర్స్‌ రద్దు 

అథ్లెటిక్స్‌ : 

- నాన్జింగ్‌లో జరగాల్సిన ప్రపంచ ఇండోర్‌ చాంపియన్‌షిప్స్‌ మార్చి 2021కు వాయిదా. 

ఫీల్డ్‌ హాకీ : 

- భారత జట్టు జపాన్‌ పర్యటన రద్దు (జూనియర్‌ మహిళల ఆసియా కప్‌) 

 ఎఫ్‌ఐహెచ్‌ ప్రో లీగ్‌ మ్యాచులను ఏప్రిల్‌ 15 వరకు వాయిదా 

బాస్కెట్‌బాల్‌ : 

- మార్చి 11 నుంచి ఎన్‌బిఎ (నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌) మ్యాచులు రద్దు 

షూటింగ్‌ : 

- మే 5-12, జూన్‌ 2-9న జరగాల్సిన షూటింగ్‌ ప్రపంచకప్‌ రద్దు 

- టోక్యో ఒలింపిక్‌ టెస్టు ఈవెంట్‌ రద్దు 

బాక్సింగ్‌ : 

- ఆసియా  ఓషియేనియా ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ చైనా నుంచి జోర్డాన్‌కు మార్పు 

- జర్మనీలో జరగాల్సిన బాక్సింగ్‌ వరల్డ్‌కప్‌ రద్దు 

ఫార్ములా వన్‌ :

 - ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రీ రద్దు 

- బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రీ వాయిదా 

- వియత్నాం గ్రాండ్‌ప్రీ వాయిదా 

- చైనీస్‌ గ్రాండ్‌ ప్రీ వాయిదా 

ఫుట్‌బాల్‌ : 

- ఈ వారం జరగాల్సిన చాంపియన్స్‌ లీగ్‌, యూరో లీగ్‌ మ్యాచులు వాయిదా 

- ఈపీఎల్‌, ఎఫ్‌ఏ కప్‌ ఏప్రిల్‌ 4కు వాయిదా