హైదరాబాద్‌లోని ఎన్‌-కన్వెన్షన్ హాల్‌లో జరిగిన వీరి వివాహానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వేదపండితుల మంత్రోచ్చాణ మధ్య ఆదివారం రాత్రి 10:57 గంటలకు హారిక మెడలో మూడుముళ్లు వేశాడు కార్తీక్ చంద్ర.

భారత గ్రాండ్ మాష్టర్ ద్రోణవల్లి హారిక వివాహం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సివిల్ ఇంజినీర్ కార్తీక్‌‌చంద్ర, హారికను పెళ్లాడారు. హైదరాబాద్‌లోని ఎన్‌-కన్వెన్షన్ హాల్‌లో జరిగిన వీరి వివాహానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

వేదపండితుల మంత్రోచ్చాణ మధ్య ఆదివారం రాత్రి 10:57 గంటలకు హారిక మెడలో మూడుముళ్లు వేశాడు కార్తీక్ చంద్ర. వీరి వివాహానికి వచ్చిన వారిలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి సహా జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు, నటులు, రాజకీయ నాయకులు ఉన్నారు.