విశ్రాంతి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి చేరనున్నారు. త్వరలో జరగున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ పలువురు కోహ్లీ, బుమ్రాకు న్యూజిలాండ్ ‌తో జరిగిన వన్డే సిరీస్‌లో నాలుగు, ఐదు వన్డేలు, ఆ తర్వాత టీ20 సిరీస్‌కు విశ్రాంతి నిచ్చింది.

విశ్రాంతి అనంతరం ఈ నెల 24 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు. మరోవైపు ఓపెనర్, వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ‌ ఫిట్‌నెస్ దృష్ట్యా సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.