Asianet News TeluguAsianet News Telugu

దానికి ఒప్పుకుంటే ఐపీఎల్ ఆడుతా.. నీరజ్ చోప్రా

తాజా విజయంతో వచ్చే ఏడాది పారిస్ లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించాడు. డైమండ్ లీగ్ లో నీరజ్ ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత జాకుబ్ వాల్డెజ్‌ సహా పలువురిని ఓడించి ట్రోఫీని గెలుచుకున్నాడు. 

Can Join Cricket Neeraj Chopra's Witty Reply On IPL Query On The Sidelines Of Diamond League ram
Author
First Published May 6, 2023, 12:12 PM IST


భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ సంవత్సరాన్ని  అద్భుతమైన విజయంతో ప్రారంభించాడు. అంతర్జాతీయ వేదికపై  మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఒలింపిక్ ఛాంపియన్ తాజాగా దోహా డైమండ్ లీగ్ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు. తన బల్లెంను 88.67 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. తాజా విజయంతో వచ్చే ఏడాది పారిస్ లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించాడు. డైమండ్ లీగ్ లో నీరజ్ ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత జాకుబ్ వాల్డెజ్‌ సహా పలువురిని ఓడించి ట్రోఫీని గెలుచుకున్నాడు. 

కాగా, ఈ పోటీకి ముందు ఆయనను మీడియా క్రికెట్ లో జాయిన్ అవుతారా అంటూ ప్రశ్నించారు. దానికి ఆయన చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది. "భారత్‌లో క్రికెట్‌కు చాలా ఆదరణ ఉంది.  భారత బౌలర్లు కూడా చాలా మంచివారు. వారికి చాలా ఫాస్ట్ ఆర్మ్ ఉంది. జావెలిన్‌లో కూడా మీకు చాలా ఫాస్ట్ ఆర్మ్ అవసరం. కాబట్టి, ఇది భారతదేశంలో సహజమైన ప్రతిభ. కాబట్టి, ఇది మాకు ప్లస్ పాయింట్. కాబట్టి, భవిష్యత్తులో మీరు మరింత మంది జావెలిన్ త్రోయర్లను చూస్తారు. జావెలిన్ మాత్రమే కాదు, అథ్లెటిక్స్‌లో మనకు ఇప్పుడు మంచి జంపర్లు ఉన్నారు, నేను సంతోషంగా ఉన్నాను. మన దేశం అథ్లెటిక్స్‌లో ఎదుగుతోంది" అని నీరజ్ భారత క్రీడాకారులపై అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

అయితే, జావెలిన్ తర్వాత ఐపీఎల్ లో జాయిన్ అవుతారా అని ఆయనను ప్రశ్నించారు. జావెలిన్ ని షోల్డర్ తో త్రో చేస్తారు. బౌలింగ్ కూడా అలా చేయవచ్చు అంటే, నేను కూడా ఐపీఎల్ లో జాయిన్ అవుతాను అంటూ సరదాగా పేర్కొనడం విశేషం.

 

కాగా, రెండేండ్ల క్రితం  టోక్యో (జపాన్) వేదికగా ముగిసిన  ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన  జావెలిన్ త్రోయర్  నీరజ్ చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదిక మీద సత్తా చాటాడు.  దోహా వేదికగా శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) ముగిసిన  దోహా డైమండ్ లీగ్ -2023లో టైటిల్ కొట్టాడు.  గత డైమండ్ లీగ్ లో విజేతగా నిలిచిన  నీరజ్..  తొలి అంచె పోటీలలో టైటిల్ నెగ్గాడు.  

శుక్రవారం రాత్రి  నీరజ్ చోప్రా.. ఫస్ట్ అటెంప్ట్ లోనే  88.67 మీటర్ల దూరం విసిరి  తన విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.  తన సమీప  ప్రత్యర్థి జాకబ్ వాద్లిచ్  కూడా నీరజ్ కు దగ్గరగా వచ్చాడు.  వాద్లిచ్  88.63 మీటర్ల దూరంతో రెండో స్థానంలో నిలిచాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios