BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్స్: కిడాంబి శ్రీకాంత్‌కి ఊహించని షాక్... రెండో రౌండ్ నుంచే అవుట్...
రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన కిడాంబి శ్రీకాంత్... 9-21, 17-21 తేడాతో చిత్తుగా ఓడిన 2021 సీజన్ సిల్వర్ మెడలిస్ట్...
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ 2022 టోర్నీలో భారత జట్టుకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. తొలి రౌండ్‌లోనే చాలామంది భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఇంటిదారి పట్టగా... రెండో రౌండ్‌లో మరికొందరు నిష్కమించారు... 2021 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఫైనల్ చేరి, రజతం గెలిచిన కిడాంబి శ్రీకాంత్, వరల్డ్ నెంబర్ 23వ ప్లేయర్ జావో జున్ పెంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడకుండానే చేతులు ఎత్తేశాడు....
9-21 తేడాతో తొలి సెట్‌ను కోల్పోయిన కిడాంబి శ్రీకాంత్, ఆ తర్వాత రెండో సెట్‌లో 17-21 తేడాతో కాస్త పోరాటం చూపించినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. స్వర్ణం పతకం తెస్తాడనే భారీ అంచనాలతో బరిలో దిగిన కిడాంబి శ్రీకాంత్, రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టడం.. టీమిండియాకి ఊహించని పరిణామమే...
కామన్వెల్త్ గేమ్స్ 2022 గోల్డ్ మెడల్‌తో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో అడుగుపెట్టిన లక్ష్యసేన్, ప్రీ క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్‌లో వరల్డ్ 74వ ప్లేయర్ల, స్పానిషన్ షెట్లర్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-17, 21-10 తేడాతో సునాయాస విజయం అందుకున్నాడు లక్ష్యసేన్...
టోర్నీలో భారీ అంచనాలతో బరిలో దిగిన భారత స్టార్ సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాగ్, ప్రీ క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. తొలిరౌండ్‌లో వరల్డ్ 50వ ర్యాంకర్ చెంగ్ యాన్ యీతో జరిగిన మ్యాచ్‌లో 21-19, 21-9 తేడాతో ఘన విజయం అందుకుంది సైనా నెహ్వాల్. రెండో రౌండ్‌లో నొజోమీ ఒకుహరాతో తలబడాల్సి ఉంది సైనా నెహ్వాల్. అయితే ఒకుహారా గాయంతో టోర్నీ నుంచి తప్పుకోవడంతో సైనా నెహ్వాల్, రౌండ్ 16లోకి దూసుకెళ్లింది...
అయితే లక్ష్యసేన్, ప్రీక్వార్టర్ ఫైనల్‌లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రణయ్‌ని ఫేస్ చేసే అవకాశం ఉంది. రౌండ్ 16లో మోమోటతో తలబడుతున్న ప్రణయ్, విజయం సాధిస్తే రౌండ్ 8లో లక్ష్యసేన్‌తో తలబడాల్సి ఉంటుంది...
వుమెన్స్ డబుల్స్‌లోనూ భారత జట్టుకి ఆశించిన ఫలితాలు రాలేదు. రెండో రౌండ్‌లో వరల్డ్ 11 ర్యాంక్ మలేషియా జోడితో జరిగిన మ్యాచ్‌లో 8-21, 17-21 తేడాతో ఓటమి పాలయ్యారు గాయత్రి గోపిచంద్- త్రీషా జాలీ...
మరో భారత జోడి అశ్విని పొన్నప్ప- సిక్కీ రెడ్డి, వరల్డ్ నెం.1 జోడీతో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో 15-21, 10-21 తేడాతో పోరాడి ఓడారు. అలాగే పూజా దండు- సంజన సంతోష్ పోరాటం కూడా రెండో రౌండ్‌లోనే ముగిసింది. వరల్డ్ నెం.3 ర్యాంక్ జోడీ జరిగిన మ్యాచ్‌లో 15-21, 7-21 తేడాతో ఓటమి పాలయ్యారు పూజా- సంజన..
మెన్స్ డబుల్స్‌లో అర్జున్- ద్రువ్ కపిల జోడి సంచలన విజయం అందుకుంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ కాంస్య పతక విజేతలు, వరల్డ్ నెం.8 డానిష్ జోడీ కిమ్ అస్రప్ - అండర్స్ రస్మెసన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-17, 21-16 తేడాతో సంచలన విజయం అందుకున్నారు అర్జున్ - ద్రువ్...