Asianet News TeluguAsianet News Telugu

BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్స్: లక్ష్యసేన్‌కి ఈజీ విజయం.. తొలి రౌండ్‌లోనే ఓడిన మాళవిక..

తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన బి సాయి ప్రణీత్... బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో తొలి భారత్‌కి మిశ్రమ ఫలితాలు.. 

BWF World Championship: Lakshya Sen easy win in first Round, Mixed result for team India in Day 1
Author
India, First Published Aug 22, 2022, 4:53 PM IST

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ 2022 టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. టోర్నీలో తొలి రోజు టీమిండియాకి మిశ్రమ ఫలితాలు దక్కాయి. 2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం నెగ్గిన బి సాయి ప్రణీత్... వరల్డ్ నెం.4 బ్యాడ్మింటన్ ప్లేయర్ చో టెన్ చెన్‌తో జరిగిన తొలి రౌండ్‌లో పోరాడి ఓడాడు...

15-21, 21-15, 15-21 తేడాతో సాయి ప్రణీత్‌పై విజయం అందుకున్న తైపాయ్ షెట్లర్ చో టెన్ చెన్ తర్వాతి రౌండ్‌కి దూసుకెళ్లాడు. రెండో రౌండ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చిన సాయి ప్రణీత్, మూడో రౌండ్‌లో తైపాయ్ ప్లేయర్ దూకుడుకి ఎదురు నిలవలేకపోయాడు. చో టెన్ చెన్‌ చేతుల్లో సాయి ప్రణీత్ ఓడిపోవడం ఇది ఐదో సారి...

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో తొలిసారి పాల్గొంటున్న 20 ఏళ్ల మాళవిక బన్సోద్, తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్కమించింది. వరల్డ్ 21 ర్యాంకర్ లిన్ క్రిస్టో‌ఫెర్సెన్‌తో జరిగిన మ్యాచ్‌లో 14-21, 12-21 తేడాతో వరుస సెట్లలో ఓడింది మాళవిక బన్సోద్...

డబుల్స్‌లోనూ భారత జట్టుకి మిశ్రమ ఫలితాలే వచ్చాయి. వుమెన్స్ డబుల్స్‌లో భారత జోడి అశ్విని పొన్నప్ప-సిక్కీ రెడ్డి తొలి రౌండ్‌లో విజయం సాధించి, రౌండ్ 32కి అర్హత సాధించారు. అలాగే మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ భారత జోడికి శుభారంభమే దక్కింది...

ఇషాన్ భత్‌నగర్- తనీశా క్రాస్టో తొలి రౌండ్‌లో గెలిచి రౌండ్ 32కి అర్హత సాధించగా మెన్స్ డబుల్స్‌లో మాత్రం ఆశించిన ఫలితం రాలేదు. మను అట్రీ- సుమీత్ రెడ్డి మొదటి మ్యాచ్‌లో ఓడి తొలి రౌండ్ నుంచే ఇంటిదారి పట్టారు...

మరో జోడి అర్జున్ - ద్రువ్ కపిల తొలి రౌండ్‌లో విజయాలు అందుకున్నారు. వరల్డ్ 33 తైపాయ్ జోడీతో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 21-17, 17-21, 22-20 తేడాతో పోరాడి గెలిచింది అర్జున్- ద్రువ్ జోడి. తర్వాతి రౌండ్‌లో వరల్డ్ నెం.8 ర్యాంకర్స్ కిమ్ అస్ర్టప్ - అండర్స్ రస్ముసేన్‌లతో తలబడునున్నారు అర్జున్, ద్రువ్.. 

మెన్స్ సింగిల్స్‌లో టీమిండియా మెడల్ ఆశలు మోస్తున్న టాస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్... మొదటి రౌండ్‌లో మంచి విజయాన్ని అందుకున్నాడు. తొలి రౌండ్‌లో వరల్డ్ 19వ ర్యాంకర్ హాన్స్ క్రిస్టియన్ విట్టింగస్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-12, 21-11 తేడాతో సునాయాస విజయం అందుకున్నాడు లక్ష్యసేన్..  గత వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం గెలిచిన లక్ష్యసేన్, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం పతకం నెగ్గిన తర్వాత ఈసారి పోటీలో దిగుతుండడంతో అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios