Asianet News TeluguAsianet News Telugu

శ్రీశాంత్ పై నిషేధం ఎత్తివేత

ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ కు సుప్రీం కోర్టులో పెద్ద ఊరట లభించింది. శ్రీశాంత్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. 

Breaking: SC Sets Aside Life Ban Imposed On Cricketer Sreesanth; Asks BCCI To Take Fresh Decision On Punishment
Author
Hyderabad, First Published Mar 15, 2019, 11:23 AM IST


ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ కు సుప్రీం కోర్టులో పెద్ద ఊరట లభించింది. శ్రీశాంత్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. స్పాట్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడనే ఆరోపణలతో అతనిపై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

కాగా... జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో ఈ కేసును విచారించి బెంచీ అతనిపై నిషేధం విషయంలో మూడు నెలల్లోగా తాజాగా మరో నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐని ఆదేశించింది. శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం చాలా కఠినమైన శిక్షగా బెంచీ అభివర్ణించింది.
 
కాగా, 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడుతూ పట్టుబడ్డాడు. దీంతో బీసీసీఐ అతనిపై జీవితకాల నిషేధాన్ని విధించింది. టీం ఇండియా తరఫున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ-20 మ్యాచులు ఆడాడు. అంతేకాక.. ఇటీవల హిందీ బిగ్‌బాస్‌లో పాల్గొన్న శ్రీశాంత్ ఆ సీజన్ రన్నర్ అప్‌గా నిలిచాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios