బ్రెజిల్.. బెల్జియం ఎవరి సత్తా ఎంత..
ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇవాళ్టీ నుంచి క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు జరగున్నాయి.. మాజీ ఛాంపియన్ బ్రెజిల్... డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియంలు ఇవాళ తలపడున్నాయి.
ఫిఫా ప్రపంచకప్‌లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న క్వార్టర్ ఫైనల్స్ ఇవాళ్టీ నుంచే ప్రారంభంకానున్నాయి. ఆరోసారి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోవాలని చూస్తోన్న బ్రెజిల్‌కు... భారీ అంచనాలున్న బెల్జియంకు ఇవాళ పోరు జరగనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల బలాబలాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. స్టార్ ఆటగాడు నెయ్‌మార్ ఫాంలోకి రావడంతో పాటు ఫిర్మినో గోల్స్ చాకచక్యంగా మెరుస్తూ ఉండటంతో బ్రెజిల్ దూకుడుగా ఉంది.
ఇక దుర్భేద్యమైన ఆ జట్టు రక్షణ శ్రేణిని చేధించడం అసాధ్యం..మిరిండా, తియాగో ద్వయం అడ్డుగోడగా నిలుస్తూ ప్రత్యర్థులకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు.. ఈ టోర్నీలో బ్రెజిల్ ఒక్క గోల్ మాత్రమే ఇచ్చిందంటే.. ఆ జట్టు రక్షణశ్రేణి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..కాకపోతే ఇప్పటి వరకు ఆడిన అన్ని జట్లు హాట్ ఫేవరేట్లు కాదు.. తొలిసారిగా ఓ అగ్రశ్రేణి జట్టుతో పోరాటానికి రెడీ అయ్యింది బ్రెజిల్.
అటు బెల్జియం విషానికి వస్తే.. మ్యాచ్ మ్యాచ్‌కు ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా ఫ్రిక్వార్టర్స్‌లో ఓడిపోయే స్థితిలో జపాన్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. లుకాకు, డిబ్రుయిన్ వంటి ఎటాకింగ్ ఆటగాళ్లతో బెల్జియం ఏ మాత్రం తగ్గడం లేదు. టోర్నీలో ఇరు జట్లు నాలుగు మ్యాచ్‌లు అడగా, బ్రెజిల్ 3 సార్లు, బెల్జియం 4 సార్లు గెలిచాయి. బ్రెజిల్ 7 గోల్స్ కొట్టి ..1 గోల్ ఇవ్వగా, బెల్జియం 12 గోల్స్ కొట్టింది 4 గోల్స్ ఇచ్చింది.
ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ను కనుక ఓడిస్తే. 1986 తర్వాత బెల్జియం సెమీస్‌కు చేరినట్లే.. అన్ని గణాంకాలను విశ్లేషిస్తే. బ్రెజిల్‌కు 64.1శాతం, బెల్జియంకు 35.9శాతం విజయావకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.
"