Asianet News TeluguAsianet News Telugu

ఇద్దరు ప్రియురాళ్లనీ.. ఒకేసారి పెళ్లి చేసుకుంటున్న ఆటగాడు

నెట్టింట హీరోగా మారిన రొనాల్డిన్హో 

Brazil football legend Ronaldinho to marry two women at same time, say reports

ప్రముఖ బ్రెజిల్ ఫుట్ బాల్ ప్లేయర్ రొనాల్డిన్హో  గురించి ఎప్పుడైనా విన్నారా..? ఆయన ఫుట్ బాల్ క్రీడాకారుడిగా ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితం. అయితే.. ప్లేయర్ గా కాకుండా మరో విషయంలో ఆయన ఇప్పుడు నెట్టింట హీరోగా మారాడు. ఇంతకీ ఏ విషయంలో తెలుసా..? ఆయన పెళ్లి విషయంలో. ఆయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. అందులో వింతేమి ఉంది అనుకోకుండా. ఆయన చేసుకునేది లవ్ మ్యారేజ్. అది కూడా ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి. 

38 ఏళ్ల రొనాల్డిన్హో గత ఏడాది డిసెంబరు నుంచి రియోడిజనారియాలో తన ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. 2016 నుంచి బిట్రిజ్‌ సౌజాతో డేటింగ్‌లో ఉంటూనే రొనాల్డిన్హో ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రిస్కల్లాకి ప్రపోజ్‌ చేసి తన రిలేషన్‌షిప్‌ను కొనసాగించాడు.

తన ఇద్దరి ప్రియురాళ్లను ఆటగాడు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. గత ఏడాది జనవరిలో ఇరువురి ముందు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా వారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత వారికి ఎంగేజ్‌మెంట్‌ రింగ్స్‌ కూడా తొడిగాడు. అంతేకాదు ఇద్దరికి ప్రతి నెల రొనాల్డిన్హో కొంత పాకెట్‌ మనీ కూడా ఇస్తుంటాడట. అలాగే తాను ఎక్కడికి వెళ్లినా ఇద్దరికి ఒకేలాంటి కానుకలు తెస్తుంటాడు. గత ఏడాది రొనాల్డిన్హో తన ఇద్దరి ప్రియురాళ్లతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీనిపై అప్పుడు అతడ్ని వివరణ అడగ్గా.. ఎంగేజ్‌మెంట్‌ జరిగితే తప్పక చెబుతానని చెప్పాడు.

బ్రెజిల్‌లో ఒక నియమం ఉంది. ఒకసారి పెళ్లి అయిన వ్యక్తి మరోసారి పెళ్లి చేసుకుంటే అక్కడ చట్ట విరుద్ధం. దీన్ని అతిక్రమించిన వారికి సుమారు ఆరేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. ఈ కారణంగానే రొనాల్డిన్హో ఒకేసారి ఇద్దరు ప్రియురాళ్లను పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో.. నెట్టింట ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇద్దరు అమ్మాయిలను ఒప్పించి ఒకేసారి
పెళ్లి చేసుకోవడం చాలా గ్రేట్ అంటూ కొందరు రొనాల్డిన్హో పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios