Asianet News TeluguAsianet News Telugu

ఇంజూరీ టైమ్‌ విన్.. బోణి చేసిన బ్రెజిల్

ఇంజూరీ టైమ్‌ విన్.. బోణి చేసిన బ్రెజిల్

Brazil beat Costa Rica

హైదరాబాద్: సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేడియంలో బ్రెజిల్, కోస్టారికా మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ చూస్తే 90 నిముషాల రూల్‌ను ఫిఫా సవరించాలేమో అనిపిస్తుంది. అసలు గాయాల సమయం(ఇంజూరీ టైమ్) అనే వెసులుబాటు లేకపోతే, కేవలం ఏడు నిముషాల వ్యవధిలో ఫిలిప్పే, నెయ్‌మార్ చేసిన చెరో ఒక గోల్‌తో 2-0 ఆధిక్యంతో బ్రెజిల్ కోస్టారికాపై గెలిచి ఉండేది కాదేమో. వరల్డ్ కప్ బరిలో బోణి కొట్టిదే కాదేమో. మొత్తానికి ఆటంతా బంతి తన అదుపులో ఉన్నాకానీ కోస్టారికా టీమ్ అడుగడుగునా అడ్డుకుంటుకున్నప్పటికీ బ్రెజిల్ విజయ బావుటా ఎగరేసింది. ఇంజూరీ టైమ్ తొలి నిముషంలో గోల్ చేసి జట్టుకు ఊపిరి పోసిన ఫిలిప్పే కౌంటినో మ్యాన్ ఆఫ్ ది మ్యాన్‌గా నిలిచాడు. తాజా గెలుపుతో బ్రెజిల్ నాకౌట్ చేరుకునే అవకాశాన్ని మరింతగా మెరుగుపరుచుకుంది. 


ఆరంభం నుంచి ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆ క్రమంలో బ్రెజిల్‌కు కోస్టారికా గట్టి పోటీ ఇచ్చింది. ఆల్ టైమ్ ఫేవరేట్ టీమ్ ప్లేయర్స్ అదే పనిగా గోల్ కోసం ట్రయ్ చేసినప్పటికీ కోస్టారికా గోల్ కీపర్ నవాస్ ఏ మాత్రం చాన్సు ఇవ్వకుండా బ్రహ్మాండంగా అడ్డుకున్నాడు. అలా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తరహాలో ఒక్క గోల్ కూడా చేయకుండానే ఫస్టాఫ్ ముగిసింది. సెకాండా‌ఫ్‌లోనూ సేమ్ సీన్ రిపీటయ్యింది. ఇంకేముంది మ్యాచ్ డ్రా అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అప్పటిదాకా నడిచిన 90 నిముషాల ఆట ఒకెత్తు అయితే ఆఖర్లో వచ్చిన అదనపు ఇంజూరీ టైమ్ బ్రెజిల్ పాలిట వరమైంది. తొలి నిముషంలో మిడ్ ఫీల్డర్ ఫిలిప్పే చేసిన గోల్‌తో బ్రెజిల్ 1-0తో గేమ్‌ను డామినేట్ చేసింది. ఆ తర్వాత ఏడవ నిముషంలో స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ చేసిన గోల్ దెబ్బకు 2-0తో మ్యాచ్ బ్రెజిల్ పరమైంది. అద్భుతమైన విజయాన్ని అందించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios