Asianet News TeluguAsianet News Telugu

దినేష్ కార్తీక్ కి బీసీసీఐ నోటీసులు

ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కి, సీపీఎల్ లోని ట్రిన్ బాగో నైట్ రైడర్స్ కు బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ యజమాని గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కాగా.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో సెయింట్ కిట్స్ తో జరిగిన  ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తొలి మ్యాచ్ కి దినేష్ కార్తీక్ హాజరయ్యాడు.
 
BCCI issues notice to Dinesh Karthik over CPL appearance
Author
Hyderabad, First Published Sep 7, 2019, 1:10 PM IST

ఇండియన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ కి బీసీసీఐ షాక్ ఇచ్చింది.  కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు ప్రమోషనల్ ఈవెంట్ లో ఇటీవల దినేష్ కార్తీక్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతనికి బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 

ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కి, సీపీఎల్ లోని ట్రిన్ బాగో నైట్ రైడర్స్ కు బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ యజమాని గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కాగా.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో సెయింట్ కిట్స్ తో జరిగిన  ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తొలి మ్యాచ్ కి దినేష్ కార్తీక్ హాజరయ్యాడు.

ట్రిన్ బాగో జట్టు జెర్సీ ధరించి డ్రెస్సింగ్ రూమ్ లో కనిపించాడు. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘణ చర్యల కింద తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ కార్తీక్ కి బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. బోర్డు కాంట్రాక్ట్ ఆటగాడైన కార్తీక్ ఇతర లీగుల్లో ఆడే అనుమతి లేదు.  బీసీసీఐ నిబంధనల ప్రకారం ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు ఐపీఎల్ లో కాకుండా మరే ఇతర ప్రైవేటు లీగుల్లో ఆడటానికి వీలు లేదు.దానిని అతిక్రమించినందుకు గాను దినేష్ కార్తీక్ కి నోటీసులు జారీ చేశారు. మరి ఈ నోటీసులపై కార్తీక్ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios