‘వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు..మనిషా, మాక్స్ వెల్ ఆ?’.. వెర్రెత్తిపోతున్న ఇంటర్నెట్..

ఆఫ్ఘనిస్తాన్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ ఇంటర్నెట్ క్రేజీగా మారిపోయాడు. బ్యాట్ ను ఝళిపిస్తూ రెండు శతకాలతో రెచ్చిపోయాడు. 

Australia Vs Afghanistan : Internet is going crazy on Glenn Maxwell.. he is not human comments goes viral - bsb

ముంబై : ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ దాడిలో గ్లెన్ మాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించడంతో ప్రపంచం అంతా అతని  అసాధారణ ఆటతీరుపై వెర్రెత్తిపోతోంది. ఆటలో మాక్స్ వెల్ ను ఏ బౌలర్ కూడా ఆపలేకపోయాడు. దీంతో ఇన్నింగ్స్ లో అతని ఆట చూసిన అందరూ.. ‘వీడేంట్రా బాబు.. ఎవడైనా కసితో కొడతాడు, కోపంతో కొడతాడు.. కానీ పూలమొక్కలకు అంట్లు నాటినట్టు ఓ పద్ధతిలో రెచ్చిపోతున్నాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మాక్స్‌వెల్, కమిన్స్ భాగస్వామ్యం ప్రారంభమైనప్పుడు ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. కానీ ఆ తరువాత కేవలం ఒకే ఒక వ్యక్తి  గ్లెన్ మాక్స్వెల్ కారణంగా ఆట అధ్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఐసీసీ వ‌న్డే ప్రపంచ కప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్‌పై గ్లెన్ మాక్స్‌వెల్ త‌న అద్భుతమైన ఇన్నింగ్స్ తో క్రికెట్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డులు సృష్టించాడు. డ‌బుల్ సెంచ‌రీ (128 బంతుల్లో 201*)  ఇన్నింగ్స్ రాబోయే సంవత్సరాల్లో గుర్తిండిపోయే అద్భుతమైన క్షణాలలో ఒకటిగా నిలిచింది. 

డబుల్ సెంచరీతో క్రికెట్ చరిత్రలో రికార్డుల మోత మోగించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్

ఆస్ట్రేలియా 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోప‌డ్డ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన గ్లెన్ మ్యాక్స్ వెల్ త‌న వీరోచిత పోరాటంతో జ‌ట్టుకు విజ‌యం అందించాడు. త‌న డ‌బుల్ సెంచ‌రీ ఇన్నింగ్స్ తో అనేక రికార్డులు నెల‌కొల్పాడు. 128 బంతుల్లో 157.03 స్ట్రైక్ రేట్‌తో 201 పరుగులతో ముగించాడు.  ఆసీస్ బ్యాటర్ 10 సిక్సర్లు, 21 ఫోర్లు కొట్టాడు. 292 పరుగుల లక్ష్యంలో ఆస్ట్రేలియా 100 పరుగులు కూడా చేయకుండానే ఏడు వికెట్లు కోల్పోయింది.

దీంతో ఆట పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ వైపుకు మారిపోయింది. కానీ.. ముంబైలోని ఆఫ్ఘనిస్తాన్ అభిమానులను, క్రికెటర్లను మ్యాక్స్‌వెల్ అక్షరాలా ఏడిపించాడు. గ్లెన్ మాక్స్‌వెల్ అద్భుతమైన నాక్‌తో, 128 బంతుల్లో 201 పరుగులతో అజేయంగా ముగించడంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. అంతకుముందు, ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సోమవారం చరిత్ర సృష్టించాడు, 

ICC క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో దేశం నుంచి మొట్టమొదటి సెంచరీ సాధించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో జద్రాన్ ఈ రికార్డును సాధించాడు. జద్రాన్ 143 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 129 పరుగులు చేశాడు. అతను 90 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో పరుగులను సాధించాడు.

ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది, ఈ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ చేసిన మొదటి డబుల్ సెంచరీని కూడా నమోదు చేసింది. ప్రపంచకప్ చరిత్రలో డబుల్ సెంచరీలు సాధించిన మూడో హిట్టర్‌గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. అతని జట్టు కేవలం 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి చేరువకు చేరుకోగా.. మాక్స్‌వెల్ తన అద్భుతమైన స్ట్రైక్‌ తో 128 బంతుల్లో డబుల్ సెంచరీని సాధించాడు. వన్డే ఇంటర్నేషనల్స్‌లో, పాట్ కమిన్స్‌తో కలిసి అతని 202 పరుగుల అత్యధిక భాగస్వామ్యం సాధించాడు. 

ఇంటర్నెట్ రియాక్షన్స్ ఇక్కడ చూడండి...

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios