Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్ 2023: స్వర్ణం గెలిచిన రోహన్ బోపన్న- రుతుజా భోసలే.. షాట్ పుట్‌లో కిరణ్‌కి కాంస్యం..

టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో  రోహన్ బోపన్న, రుతురాజ్ భోసలేకి స్వర్ణం.... మహిళల బాక్సింగ్‌లో సెమీస్‌కి భారత స్టార్ బాక్సర్ లోవ్‌లినా బోర్గోహైన్...

Asian Games 2023: Rohan Bopanna and Rutuja Bhosale win Gold medal in Mixed Doubles CRA
Author
First Published Sep 30, 2023, 1:49 PM IST

ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో 43 ఏళ్ల భారత టెన్నిస్ వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న సంచలనం క్రియేట్ చేశాడు. మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో ఫైనల్ చేరిన భారత జోడి రోహన్ బోపన్న, రుతురాజ్ భోసలే స్వర్ణం కైవసం చేసుకుంది. చైనీస్ తైపాయ్ జోడితో జరిగిన ఫైనల్‌లో 2-6, 6-3, 10-4 తేడాతో విజయం అందుకున్నారు రోహన్ బోపన్న - రుతురాజ్ భోసలే..

టేబుల్ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన భారత టీటీ ప్లేయర్ మానికా బత్రా, వరల్డ్ నెం.4 వాంగ్ యిదీతో జరిగిన మ్యాచ్‌లో 2-4 తేడాతో ఓడిపోయింది. మహిళల బాక్సింగ్‌లో 75 కిలోల విభాగంతో భారత స్టార్ బాక్సర్ లోవ్‌లినా బోర్గోహైన్, సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది. కొరియన్‌ బాక్సర్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-0 తేడాతో విజయాన్ని అందుకుంది లోవ్‌లినా బోర్గోహైన్.సెమీ ఫైనల్‌లో గెలిస్తే ఏషియన్ గేమ్స్ పతకంతో పాటు ఒలింపిక్స్‌కి కూడా అర్హత సాధిస్తుంది బోర్గోహైన్... 

టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఈవెంట్‌లో మాత్రం భారత్‌కి కలిసి రాలేదు. శరత్ కమల్, సాథియన్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడగా, భారత మహిళా టీటీ ప్లేయర్లు శ్రీజ రెండో రౌండ్ నుంచే నిష్కమించింది. క్వార్టర్ ఫైనల్ చేరి రికార్డు సృష్టించిన మానికా బత్రా, పతకానికి అడుగు దూరంలో ఆగిపోయింది. 

మహిళల షాట్ పుట్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ కిరణ్ బలియన్, కాంస్యం సాధించింది. ఏషియన్ గేమ్స్‌లో షార్ట్ పుట్ ఈవెంట్‌లో భారత్‌కి పతకం రావడం ఇదే తొలిసారి. 

ఇప్పటిదాకా 9 స్వర్ణాలు, 13 రజతాలు, 13 కాంస్య పతకాలు సాధించింది భారత్. ఇందులో సూటింగ్ నుంచే ఏకంగా 19 మెడల్స్ రావడం విశేషం. భారత షూటర్లు 6 స్వర్ణాలు, 8 రజతాలు, 5 కాంస్య పతకాలు సాధించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios