ఏషియన్ గేమ్స్ 2023: జావెలిన్ త్రోలో అన్నూ రాణికి స్వర్ణం.. బాక్సింగ్‌లో బోణీ కొట్టిన నరేందర్...

మహిళల జావెలిన్ త్రో ఈవెంట్‌లో అన్నూ రాణికి స్వర్ణం... ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన మొట్టమొదటి భారత మహిళా జావెలిన్ త్రోయర్‌గా సరికొత్త రికార్డు...

Asian Games 2023: Annu Rani becomes first Women Javelin thrower to win gold in Asian Games CRA

ఏషియన్ గేమ్స్ 2023 టోర్నీలో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. తాజాగా మహిళల జావెలిన్ త్రో ఈవెంట్‌లో అన్నూ రాణికి స్వర్ణం దక్కింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచిన అన్నూ రాణి, ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన మొట్టమొదటి భారత మహిళా జావెలిన్ త్రోయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది..

భారత బాక్సర్ నరేందర్ బెర్వాల్, పురుషుల బాక్సింగ్ 92 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఈ ఆసియా కప్ పోటీల్లో పతకం గెలిచిన మొట్టమొదటి, ఏకైక భారత పురుష బాక్సర్ నరేందర్ బెర్వాల్.. 

మొత్తంగా బుధవారం 2 స్వర్ణాలు, రెండు రజతాలు, 5 కాంస్య పతకాలు సాధించింది భారత్. మొత్తంగా 15 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్య పతకాలు గెలిచిన భారత్, 69 పతకాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. స్క్వాష్ పురుషుల వ్యక్తిగత విభాగంలో సౌరవ్ గోషల్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో నలుగురు భారత ప్లేయర్లు సెమీ ఫైనల్ చేరారు. దీంతో భారత్‌ ఖాతాలో మరిన్ని పతకాలు చేరబోతున్నాయి.. 

భారత స్టార్ బాక్సర్ లోవ్‌లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్‌కి చేరింది. భారత కబడ్డీ మహిళల జట్టు, సౌత్ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో 56-23 తేడాతో ఘన విజయం అందుకుంది. రేపు థాయిలాండ్‌తో మ్యాచ్ ఆడనుంది భారత మహిళా కబడ్డీ జట్టు..

ఆర్చరీ విభాగంలో భారత అథ్లెట్లు అభిషేక్ వర్మ, ఓజాస్ గోటెల్ ఇద్దరూ ఫైనల్‌కి చేరారు. ఫైనల్‌లో ఈ ఇద్దరూ పోటీపడబోతున్నారు. దీంతో మరో రెండు మెడల్స్ ఖాయం అయిపోయాయి. అక్టోబర్ 7న వీరిద్దరి మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios