ఆంజనేయుడిని ఇలా పూజిస్తే.. మీ సమస్యలన్నీ దూరమౌతాయి..!
హనుమంతుడిని, కుజ గ్రహాన్ని మంగళవారం నాడు ఆరాధించడం ద్వారా వారి అనుగ్రహం పొందే అవకాశం ఉంది. అయితే... పూజ ఎలా చేయాలో ఓసారి చూద్దాం..
సంకటమోచన హనుమంతుడిని కలియుగ రాజు అంటారు. హిందూమతంలో, ప్రతి దేవుడినీ, దేవతను పూజించడం కోసం ఒక నిర్దిష్ట రోజు ఉంటుంది. అదేవిధంగా, ఈ మంగళవారం హనుమంతుడిని పూజించడానికి అనుకూలమైన రోజు. ఎవరైతే హనుమంతుడిని మనస్పూర్తిగా పూజిస్తారో వారి మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి అని నమ్మకం.
హనుమంతుడిని ఎప్పుడైనా పూజించవచ్చు, ఆయన అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. హిందూ మతంలో, ఆంజనేయుడిని శివుని అవతారంగా పరిగణిస్తారు. మంగళవారం నాడు అష్టసిద్ధి, నవనిధిని ప్రసాదించే హనుమంతుడితో పాటు మంగళ పుత్రుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. హిందూ గ్రంధాల ప్రకారం, మంగళవారం, శనివారాలను బజరంగబలి రోజులుగా పరిగణిస్తారు. హనుమంతుడిని, కుజ గ్రహాన్ని మంగళవారం నాడు ఆరాధించడం ద్వారా వారి అనుగ్రహం పొందే అవకాశం ఉంది. అయితే... పూజ ఎలా చేయాలో ఓసారి చూద్దాం..
మంగళవారం పూజ
హనుమంతుడికి కాషాయ రంగు సింధూరం అంటే చాలా ఇష్టం. అతని ఆశీర్వాదం కోసం, ఆలయానికి వెళ్లి, హనుమాన్ జీకి కషాయ రంగు సింధూరాన్ని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శ్రీరామ భక్తుడైన హనుమంతుడు చాలా సంతోషిస్తాడు. సింధూరాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా సర్వ దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది. ప్రాణభయం తొలగిపోతుంది.
ప్రతి ఒక్కరూ తమ సంపద పెరగి తన జీవితంలో డబ్బుకు లోటు ఉండకూడదని కోరుకుంటారు. దాని కోసం ... మర్రిచెట్టు ఆకును తీసుకుని గంగాజలంతో కడిగి మంగళవారం ఉదయం హనుమంతుడికి నైవేద్యంగా పెడితే ఐశ్వర్యం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహంతో పాటు లక్ష్మి అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది.
మంగళవారం ఆంజనేయ పూజలో బ్రహ్మచర్యం పాటించండి. ఈ రోజు మీరు ఎవరినీ బాధపెట్టకూడదు. ఈ రోజున మీరు భక్తి , విశ్వాసంతో హనుమాన్ చాలీసాను ఏడుసార్లు పఠించాలి. ఇలా చేసే ఆంజనేయ స్వామి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. వారి జీవితంలో భయం లేదా దుఃఖం ఉండదు. వారి జీవితంలో ఎక్కువ ఆనందం లభిస్తుంది.
శ్రీరాముని సేవలో మునిగి ఉన్న ఆంజనేయుడిని పూజించడం ద్వారా, ఒక వ్యక్తి తన ఉజ్వల భవిష్యత్తు, కుటుంబానికి పూర్తిగా అంకితమై జీవితంలోని అన్ని రంగాలలో విజయాన్ని, ఆనందాన్ని పొందుతాడు. ప్రతిచోటా పురోగతి లభిస్తుది. మంగళవారం నాడు ఆంజనేయుడిని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి.
సుందరకాండ పఠనం
మంగళవారాల్లో సుందరకాండకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే శ్రీ రామచరిత మానస సుందరకాండ పఠించడం వల్ల హనుమంతుడికే కాకుండా శ్రీరాముడి ఆశీస్సులు కూడా లభిస్తాయని నమ్ముతారు.
హనుమంతుడిని అనేక రూపాల్లో పూజిస్తారు. ప్రస్తుత కాలాన్ని పరిశీలిస్తే, మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యాన భంగిమలో ఉన్న హనుమంతుని ప్రతిమను పూజించాలి. ఇలా చేయడం వల్ల మనిషికి బలం, మానసిక ప్రశాంతత లభిస్తాయి.