Asianet News TeluguAsianet News Telugu

దేవుడికి పూజ... ఈ నియమాలు పాటించడం తప్పనిసరి..!

ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించును. రుద్రాక్షలు ధరించే వారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు.
 

Worship is scientific
Author
Hyderabad, First Published May 11, 2021, 12:03 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151 

పూజా ప్రక్రియలో నిషిద్ధకర్మలు:- గృహంలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నాపెద్దగా ఉండరాదు. మంత్ర పుష్పం, సుప్రభాతం కుర్చుని చదవరాదు. ఈశ్వరుడుకి పవళింపు సేవ నిలబడి చేయరాదు. నుదుట బొట్టు, విభూతి లేదా కనీసం బొట్టు అయిన లేకుండా పూజ చేయకూడదు. ఈశ్వరుడికి, గురువుకి ఒక చేతితో నమస్కారం చేయరాదు అలా చేస్తే పై జన్మలో చేతులు లేకుండా జన్మించటం, చేతులు పోవటం కానీ జరుగుతాయి. 

దేవునికి ( ఈశ్వరునికి )  వీపు చూపరాదు, ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డికానీ, హారతి కర్పూరం కానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తులో వుండాలి, అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి. ఎడమ చేయి పూజా విధులలో నిషేధం. ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు. 
    
ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించును. రుద్రాక్షలు ధరించే వారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు.

స్త్రీలకి నిషిద్ధకర్మలు :- స్త్రీలు తులసీ దళాలు తుంచ రాదు. పురుషులు మాత్రమే తుంచ వలెను. పౌర్ణమి, అమావాస్య నాడు, రవి సంక్రమణ, తైలాభ్యంగనస్నానం చేసిననూ త్రి సంధ్యల కాలంలో, మైల రోజులలో, రాత్రి ధరించి ఉన్న దుస్తులతోను, స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించకుండా, తులసిని తుంచిననూ మహాపాపం. 

స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగరాదు. ఇలా స్త్రీలు చేస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అశుభం. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. స్త్రీలు జుట్టు విరబోసుకుని భర్తకి కనపడరాదు. అలా కనపడితే భర్తకి గండం. బయటకి వెళుతున్నపుడు స్త్రీ జుట్టు విరబోసుకుని కనపడితే వెనక్కి ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుని కొంచం సేపు కుర్చుని వెళ్ళాలి. స్త్రీలు చెవి దిద్దులు లేకుండా భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం, శ్రేయస్సు కాదు. 

పురుషులకి నిషిద్ధకర్మలు :- పూర్తిగా శిరో ముండనం చేసుకోకూడదు కనీసం శిఖ ఉంచుకోవాలి. అలా చేసుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పూర్తిగా శిరో ముండనం చేసుకుంటే వైదిక క్రియలకి పనికిరాదు. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమా, సంక్రాంతి, వ్యతిపాతము, విష్టి, ఇత్యాదుల యందు, వ్రత దినముల యందు, శ్రాద్ధ దినముల యందు, మంగళ, శనివారముల యందు క్షురకర్మ పనికిరాదు.

పై తెలిపిన శాస్త్రీయ పద్ధతులు భక్తీ శ్రద్ధలతో ఆచరించిన వారికి శుభఫలితాలు ఉంటాయి. ఆరోగ్య సిరి సంపదలు కలుగుతాయి. ఆనాదిగా కాలంగా మన పూర్వీకుల నుండి వస్తున్న శాస్త్రీయ పద్ధతులు పెడచెవిన పెట్టె వారిని, ఆధునిక పోకడతో పోయేవారికి వారి విజ్ఞతకే వదిలి వేయాలి. నమ్మిన వారికి నారాయణుడు ఉన్నాడు , నమ్మని ఆచరించని వారికి నారాయణుడే ఉన్నాడు జై శ్రీమన్నారాయణ.   
 

Follow Us:
Download App:
  • android
  • ios