తులసి మొక్కకు పసుపు కొమ్మును కడితే ఏమౌతుందో తెలుసా?
తులసిమొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే ప్రతిరోజూ తులసిమాతకు పూజ చేస్తుంటారు చాలా మంది. అయితే మనం ఏ పూజ చేసినా స్వచ్ఛతను, పరిశుభ్రతను పాటించాలి.
జ్యోతిషశాస్త్రంలో తులసిమొక్కకు సంబంధించిన ఎన్నో పరిహారాల గురించి వివరించబడ్డాయి. ఇవి మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. తులసి మాతను కూడా దైవంతో సమానంగా భావిస్తారు. పవిత్రంగా కొలుస్తారు. అందుకే ప్రతి శుక్రవారం లేదా ప్రతిరోజూ తులసిమొక్కకు పూజ చేస్తారు. అయితే పసుపు లేదా పసుపు కొమ్ముకు కూడా జ్యోతిషశాస్త్రంలో ముఖ్యమైన స్థానం ఇచ్చారు. ఎందుకంటే పసుపు కొమ్ము ఎన్నో సమస్యలను, లోపాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. అలాంటప్పుడు తులసిమొక్కకు పసుపు కొమ్మును కడితే ఏమోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
తులసిమొక్కను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కను పెట్టడం వల్ల ఆనందం-శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం ఉంది. అంతేకాదు తులసి మొక్కకు పూజ చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని కూడా నమ్ముతారు. నియమాలు పాటిస్తూ ఇంట్లో తులసిమాతకు పూజ చేస్తే పుణ్యఫలాలు దక్కుతాయంటారు జ్యోతిష్యులు. అంతేకాదు తులసిమాతతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందుతారు.
ఏ పూజకైనా స్వచ్ఛత, పరిశుభ్రత చాలా చాలా అవసరం. అలాగే తులసి పూజలో కూడా స్వచ్ఛత పట్ల శ్రద్ధ వహించాలంటారు జ్యోతిష్యులు. అయితే చాలా మంది తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లను చేస్తుంటారు. దీనివల్ల తులసి మొక్క అపవిత్రమౌతుంది. అలాగే శుభ ఫలితాలు కాస్త అశుభంగా మారి మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
తులసిపూజలో మీరు తప్పులు చేస్తే ఇంట్లో పెద్ద వాస్తు లోపాలు వస్తాయి. అందుకే తులసిమొక్క స్వచ్ఛతను తిరిగి పొందడానికి పసుపు ఒక్కటే నివారణ అంటున్నారు కొంతమంది జ్యోతిష్యులు. తులసి మొక్కక్కకు పసుపు కొమ్మును కట్టడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే తులసిమొక్కపై పసుపును కూడా చల్లొచ్చు.
ఇందుకోసం ప్రతి శుక్రవారం తులసిపై పసుపు చల్లండి. లేదా పసుపుకొమ్మును కట్టండి. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రతి శుక్రవారం పసుపు కొమ్మును మార్చాలి. 10 శుక్రవారాలు ఇలా చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత చివరి పసుపుకొమ్మును 11 వ శుక్రవారం కట్టి.. మిగిలిన 10 పసుపు కొమ్మును నీటిలో ముంచండి. ఇది తులసి మొక్కను శుద్ధి చేస్తుంది.
తులసి మొక్కకు పూజ చేసేటప్పుడు, నీటిని సమర్పించేటప్పుడు, తులసిని సంరక్షించేటప్పుడు లేదా మరేదైనా కారణం వల్ల తులసి అపవిత్రంగా మారితే స్వచ్ఛత తిరిగి పసుపు కొమ్ము తెస్తుంది. అలాగే తులసికి సంబంధించిన ఏదైనా లోపం తొలగిపోతుంది. అలాగే మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
- best direction for tulsi
- lakshmi
- medical use of tulasi plant
- never keep tulsi plant in this direction
- tulasi plant importance
- tulasi plant use
- tulasi pooja procedure
- tulasi pooja specialty
- tulsi puja
- tulsi vivah significance in telugu
- tying turmeric in tulsi
- tying turmeric in tulsi benefits
- tying turmeric in tulsi singificance
- vastu tips for tulsi
- why to tie turmeric in tulsi