సారాంశం

శివయ్యకు అడవి పువ్వులంటే అమితమైన ప్రేమ. అసలు శివయ్యను పూజించాలంటే ఎలాంటి పూలు ఉపయోగించాలో ఓసారి చూద్దాం...
 


పరమశివుడు భక్తుల దేవుడు. హృదయపూర్వకంగా పూజిస్తే... మహాదేవుడు కోరుకున్నవన్నీ ఇచ్చేస్తాడని చెబుతూ ఉంటారు. అయితే.... దైవాన్ని చేరుకోవడానికి కొన్ని పద్దతులు ఉంటయి. మన దగ్గర ఉన్న ఉత్తమమైన వాటిని మనం అతనికి అందించాలి.
సాధారణంగా దేవతలందరికీ సమర్పించే పూలు శివునికి సమర్పించకూడదట. శివయ్యకు అడవి పువ్వులంటే అమితమైన ప్రేమ. అసలు శివయ్యను పూజించాలంటే ఎలాంటి పూలు ఉపయోగించాలో ఓసారి చూద్దాం...

శమీ పువ్వు, 
ఈ పువ్వును సాధారణంగా ఏ దేవుడికి సమర్పించరు. కానీ, శివుడికి ఆ పువ్వు అంటే అమితమైన ప్రేమ. అందుకే.. శివుని ఆరాధనలో శమీ పుష్పాన్ని ఉపయోగించాలట.

ధాతురా
ధాతుర శివునికి ఇష్టమైన పుష్పం. అమృత మథనం నుండి వెలువడిన విషాన్ని శివుడు తాగగానే శివుని వక్షస్థలం నుండి ఈ పుష్పం కనిపించింది. అందుకే అహం, శత్రుత్వం, అసూయ ,ద్వేషం అనే విషాన్ని వదిలించుకోవడానికి శివపూజ సమయంలో ధాతురాన్ని శివునికి సమర్పిస్తారు. ఈ పూలతో శివుడిని పూజిస్తే చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందట.

బిల్వపత్రం..
హిందూ ఆరాధన సంప్రదాయంలో దేవుడికి పూలు మాత్రమే కాకుండా ఆకులను కూడా సమర్పిస్తారు. అదేవిధంగా బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తారు.  బిల్వపత్ర సమర్పణ లేకుండా శివుని పూజ ఫలించదని అంటారు.


మందార పువ్వు
ఈ పుష్పంతో పూజిస్తే కైలాసంలో నివసించే వరం కలుగుతుంది.

కరవీర పువ్వు
గులాబీ కుటుంబానికి చెందిన కరవీర పువ్వు బ్యాక్టీరియాను చంపి వ్యాధులను దూరం చేస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారు ఈ పువ్వును శివునికి సమర్పించి భక్తితో పూజిస్తే తప్పకుండా నయమవుతుంది.

జాస్మిన్ 
శివునికి మల్లెపూలను నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో ఐశ్వర్యం, సంపదలు నింపుతాయి. ఇలా చేస్తే మీ ఇల్లు ధాన్యంతో నిండిపోతుంది.

రోజ్ ఫ్లవర్
శివుడిని గులాబీ పూలతో పూజిస్తే అది పది గుర్రాల బలితో సమానమని చెబుతారు.


శివుడిని తామరపూలతో పూజిస్తే..
ఇతరులను విమర్శించడం, అవమానించడం వల్ల కలిగే పాపాలు తొలగిపోతాయి.

నల్ల కలువ
శివుడిని నల్ల కలువ పూలతో పూజించడం వల్ల ఐదు మహా పాపాలు తొలగిపోతాయి.