Asianet News TeluguAsianet News Telugu

హెయిర్ కట్ ఎప్పుడు చేయించుకోవాలి..?

ఇది శాస్త్రాన్ని నమ్మిన వారికి మాత్రమే పూర్వ పద్ధతులను తెలియ జేయడం జరుగినది. ఇందులో చాలా పద్దతులు ఉన్నాయి. ఉదయం 12 గంటల లోపు చేయించుకున్న శుభం కలుగుతుంది. 

When to get a haircut? as per astrology
Author
Hyderabad, First Published May 13, 2021, 3:17 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

When to get a haircut? as per astrology

సర్వ సాధారణంగా ప్రస్తుత కాలంలో మనకు సమయం దొరికినప్పుడు మాత్రమే కటింగ్ చేసుకుంటూ ఉన్నాం, కానీ క్షురకర్మలకు శాస్త్ర రిత్య కొన్ని సూచనలు ఉన్నాయి వారంలో ఏ రోజు మనం కటింగ్ చేయించు కుంటే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో శాస్త్ర పరంగా గమనిద్దాం. ఇది శాస్త్రాన్ని నమ్మిన వారికి మాత్రమే పూర్వ పద్ధతులను తెలియ జేయడం జరుగినది. ఇందులో చాలా పద్దతులు ఉన్నాయి. ఉదయం 12 గంటల లోపు చేయించుకున్న శుభం కలుగుతుంది. రాత్రి సమయంలో కటింగ్ చేసుకోకూడదు. తండ్రి కొడుకులు, అన్నదమ్ములు  ఒకే రోజు చేసుకో కూడదు. అనే నియమం ఉంది వాటిని వారల వారిగా ఫలితాలు ఏమిటో గమనిద్దాం. 

-:వారము:-                             -:ఫలితము:-

ఆదివారము             -           ఒక మాసము ఆయువు తగ్గిపోతుంది. తత్ ఫలితంగా శరీరం అధిక వేడి పొందుతుంది.

సోమవారముము      -            ఏడు మాసములు ఆయువు వృద్ధి చెందును , సౌఖ్యం కలుగ జేస్తుంది. పుత్రులు కోరుకునే గృహస్థులు,                              ఒకే ఒక పుత్రుడు గలవారు క్షవరము చేయించుకోనగూడదు.

మంగళవారముము   -            ఏనిమిది మాసములు ఆయువు తగ్గిపోతుంది. తత్ ఫలితంగా దు:ఖం కలుగజేస్తుంది.

బుధవారముము       -           ఐదు మాసములు ఆయువు వృద్ధి చెందును. పుష్టిని కలుగ జేస్తుంది.

గురువారముము       -           పది మాసములు ఆయువు వృద్ధి చెందును. లక్ష్మిని కోరుకునేవారు గురువారమునాడు క్షవరము                              చేయించుకోనగూడదు. తత్ ఫలితంగా ధన నాశనం కలుగజేయును. 

శుక్రవారముము        -          పదకొండు మాసములు ఆయువు వృద్ధి చెందును. తత్ ఫలితంగా శక్తి తగ్గును అక్కా , చెల్లెళ్ళు కలవారు                                                చేయించుకోరాదు.

శనివారముము          -        ఏడు మాసములు ఆయుక్షీణమ్ కలిగించును. తత్ ఫలితంగా రోగ వృద్ధిని కలుగజేయును. 

                  క్షురకర్మకు అనుకూలమైన తిధులు :- విదియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి, తిధులు శుభం .

ప్రతికూలమైన తిధులు    :-     ఆదివారం , శనివారం , మంగళవారంనాడు క్షురకర్మ చేయించుకున్న మంచిదికాదు.

అనుకూలమైన నక్షత్రాలు  :-     హస్త  , చిత్త , స్వాతి , పునర్వసు, పుష్యమీ, మృగశిర , ధనిష్ఠ , శతభిషం, అశ్విని , రేవతి, నక్షత్రాలలో శుభం .
 
ప్రతికూలమైన నక్షత్రాలు    :-     మఖ , కృత్తిక , ఉత్తర, అనురాధ, ఈ నక్షత్రాలలో చేసుకోవద్దు.

Follow Us:
Download App:
  • android
  • ios