Asianet News TeluguAsianet News Telugu

గోచారరిత్య శని వక్రగతిలో ఉంటే ఏం చేయాలి

ధనుస్సురాశి, మకరరాశి, కుంభరాశులపై ఏలిననాటి శని ప్రభావం పడుతుంది. పంచాంగం ప్రకారం శని దేవుడు మొత్తం 141 రోజుల పాటు తిరోగమించనున్నాడు. ఈ సమయంలో ఏలిననాటి శని, ఏడాదిన్నర శని ప్రభావం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

What to do if the visible Saturn is curved
Author
Hyderabad, First Published May 27, 2021, 3:24 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గోచారరిత్య శని వక్రగతిలో ఉంటే ఆలాంటి సమయంలో శనిదేవున్ని ప్రసన్నం చేసుకోవాలి, ఈ పరిహారాలు తప్పనిసరి.. మే 23 ఆదివారం రోజు మధ్యాహ్నం 2:04 నిమిషాలకు మకరరాశిలో శని దేవుడు వక్రగతి ప్రారంభించాడు. ఈ రాశిలో శని అక్టోబరు 11 వరకు సంచరించనున్నాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని దేవుడిని న్యాయాధినేతగా గా పరిగణిస్తారు. శని వక్రగతి చెందడంతో కొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. 

శని తిరోగమించడం వల్ల శని బలహీనపడతాడు. పూర్తి ఫలితాలను అందిచడు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు అధిపతిగా శనిని భావిస్తారు. శని శుభ స్థితిలో ఉండగా ఆనందం, శాంతితో శ్రేయస్సు లభిస్తుంది. శని దుర్మార్గపు పరిస్థితిలో ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిని పరిష్కారంగా కొన్ని పరిహారాలు తప్పకుండా పాటించాలి.

​ధనుస్సురాశి, మకరరాశి, కుంభరాశులపై ఏలిననాటి శని ప్రభావం పడుతుంది. పంచాంగం ప్రకారం శని దేవుడు మొత్తం 141 రోజుల పాటు తిరోగమించనున్నాడు. ఈ సమయంలో ఏలిననాటి శని, ఏడాదిన్నర శని ప్రభావం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏలిననాటి శని ప్రభావం ధనస్సు, మకరం, కుంభ రాశుల వారిపై ఎక్కువగా ఉంటుంది. ఏడాదిన్నర శని ప్రభావం వచ్చేసి మిథున, తులారాశి వారిపై ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో సంబంధింత రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. తగిన పరిష్కారాలు కనుగొనాలి.

శనిదేవుడిని సంతోషపెట్టాలంటే నువ్వుల నూనె, ఆవానూనె, నువ్వులు, మినములు, నలుపు రంగు దుస్తులు, ధాన్యం, ఔషధ మందులు మొదలైనవి పేదవారికి దానం చేయాలి. మీకు దగ్గరలో ఉండే శనిదేవుడి ఆలయానికి వెళ్లి అక్కడ ఆవనూనెతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం ద్వారా శని దేవుడు సానుకూల ఫలితాలు ఇస్తాడు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో విజయం సాధించేలా సహాయం చేస్తాడు.

శని దేవుని ఆగ్రహం నుండి బయటపడడానికి మంగళ, శనివారాల్లో హనుమంతుడిని ఆరాధించాలి. విష్ణు సహస్ర నామాలు, హనుమాన్ చాలీసా, సుందరకాండను పారాయణం చేయాలి. హనుమంతుని భక్తులను శని ఎలాంటి ఇబ్బందులకు కలగజేయడు. శని దేవున్ని శాంతిని పరచడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా అధిగమించవచ్చును.

శనివారం రోజు ఇనుము లేదా రబ్బరు సంబంధిత వస్తువులను కొనుగోలు చేయకూడదు. శనివారం రోజు ఉపవాసం ఉండడం వలన ఏలిననాటి శని ప్రభావాలను దూరం చేసుకోవచ్చును. శనివారం రోజు నల్లకుక్కలకు లేదా కాకులకు ఆహారం తినిపించండి. ఇలా చేయడం ద్వారా శని దేవుడు సంతోషిస్తాడు.

​శనిదేవుని శుభ ఫలితాలను పొందడానికి జాతక చక్రం ఆధారంగా నీలం రత్నాన్ని ధరించవచ్చును. వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశి వారు నీలం రత్నాలను ధరించవచ్చును. ఈ రత్నం ధరించేముందు జ్యోతిష్కుల సలహా తీసుకోవాలి. కాబట్టి శని సానుకూల ఫలితాలను పొందాలంటే వీటిని తప్పకుండా పాటించాలి.

​శని దేవుని మంత్రాలు :-

ఓం ప్రాం ప్రీం ప్రౌం సం శనైశ్చరాయ నమ: 
   
    కోణస్త పింగళ బభ్రు:   

    కృష్ణో రౌద్రాంతకో యమ:   

    సౌరి శనైశ్చరో మంద: 

    పిప్పలాదేవ సంస్తుత:  

      నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం 
    ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం 

శని బీజ మంత్రం, తాంత్రిక మంత్రాలను ప్రతి రోజు పటఠించడం వల్ల శని సానుకూల ఫలితాలను పొందుతాడు. పేదవారికి, పశుపక్ష్యాదులకు ఎదో ఒక దానం చేస్తూ ఉండాలి, వారి ఆకలి తీర్చాలి ఇలా చేస్తే శని పరిస్థితి ప్రతికూల ప్రభావాలను ఏలిననాటి శని, అష్టమ, ఆర్దాష్టమ శని ప్రభావాలు తొలుగుతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios