ఇంటి ముందు గుమ్మడి కాయ ఎందుకు కట్టాలి?

నరదృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెబుతుంటారు. మీ ఇంటికి  కాని వ్యాపార సంస్థలలో కాని  దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్ట౦డి. ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే  ఒక బూడిద గుమ్మడికాయ, నరదృష్టి నివారణకు గోమాత సహిత నవ యంత్ర యుక్త ఐశ్వర్య కాళీ ఫోటో ఇంటి లోపల గుమ్మం పైన అమర్చుకోండి. 

What is the significance of tying an ash pumpkin outside new house

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

What is the significance of tying an ash pumpkin outside new house
కాయగురలలో సంవత్సర కాలం పాటు పాడవకుండా నిలువ ఉండేది గుమ్మడి కాయ ఒక్కటే. అంత కెపాసిటి కలిగిన భూడిద గుమ్మడి కాయ మనం దృష్టి దోష నివారణ కొరకు గుమ్మం పై కడుతే కట్టిన కొన్ని రోజులకే పాడై పోతూ ఉంటాయి. ఇలా తరచూ పాడై పోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో మొదటిది నరదృష్టి ఎక్కువగా ఉంది అని అర్ధం. ఇంకొకటి ఆ ఇంటిపై నకారాత్మక శక్తి ఎక్కువగా ఉన్నది అని కుడా భావించ వచ్చు.  

నరదృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెబుతుంటారు. మీ ఇంటికి  కాని వ్యాపార సంస్థలలో కాని  దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్ట౦డి. ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే  ఒక బూడిద గుమ్మడికాయ, నరదృష్టి నివారణకు గోమాత సహిత నవ యంత్ర యుక్త ఐశ్వర్య కాళీ ఫోటో ఇంటి లోపల గుమ్మం పైన అమర్చుకోండి. గుమ్మడి కాయను శాస్త్రోక్తంగా కూష్మాండ పూజ అనుభవజ్ఞులైన పండితులచే చేయించుకుని ఇంటి ప్రధాన ద్వారం పైన ఉట్టిలో వేలాడదీయండి.

ప్రతీ రోజు రెండు అగరబత్తీలు వెలిగించి గుమ్మడికాయకు, ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రమునకు ధూపం చూపించండి. ప్రతీ రోజు ఇంట్లో పూజ చేసుకున్నపుడు రెండు అగరబత్తిలను వెలిగించి గుమ్మడి కాయదగ్గర పెట్టండి. ఇంటి ముందు గుమ్మడికాయ ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రము ఉండటం వలన ఇంట్లోకి వచ్చేటువంటి నకారాత్మక శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని రాకుండా ఇంటిని కాపాడుతుంది.

మన ఇంటికి చూపించేటువంటి నరదృష్టి చెడు ప్రభావాన్ని అది లాక్కుంటుంది. మీరు ఎక్కువగా బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుళ్ళి పోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరద్రుష్టి, నరపీడ ఉందని గుర్తుంచుకోండి. మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని గమనించాలి.

వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని పూజ చేయించుకుని కొత్తగా మల్లి  కట్టాలి. ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి. గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాప, నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు నిరోధించే శక్తి  ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి.

గుమ్మడికాయ ఒకటి మాత్రమే కాకుండా దానికి ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రాన్ని జోడించినప్పుడే ఆశక్తి మరింత రెట్టింపు అయి పూర్తి స్థాయి ఫలితాలు మీకు అందిస్తుంది. మన ఇంటికి కాని వ్యాపార సంస్థలకు కాని కట్టిన గుమ్మడికాయ పాడవకున్న ఎప్పుడేప్పుడు తోలగించి కొత్తది కట్టాలా.. అని చాలా మందికి సందేహం వస్తూ ఉంటుంది. శాస్త్ర సూచన ప్రకారం మన ఇంటికి గాని వ్యాపార సంస్థలలో కాని పూజించి కట్టిన గుమ్మడికాయను ఒక సంవత్సరం దాటితే తప్పక తీసివేయాలి.

ఇంకా మధ్యలో గ్రహణములు వచ్చిన, ఇంట్లో పురుడు మైల వచ్చిన, మృతౌ సంబంధించి సూతకం వచ్చిన, ఇంట్లో అమ్మయిలు పుష్పవతి అయిన ఇలాంటి ఏ సూతకం అయినా వస్తే ఆ పూజచేసి కట్టిన గుమ్మడికాయ శక్తిని కోల్పోతుంది కాబట్టి సూతకం అయిపోగానే కొత్తది కట్టుకోవాలి. పాడైపోయినప్పుడల్లా కొత్తది కట్టాలి. మనమే ఇంట్లో కాస్త పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి కడితే సరిపోదు. వాటికి విధి విధానంగా శాస్త్రోక్తంగా పూజ జరిపించి శు భ మూహూర్థ౦లో కడితే  శుభం కలుగుతుంది. శాస్త్ర విషయాలు మనకు క్షుణ్ణంగా తెలియనపుడు అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు రేమిడి ఫాలో అవుతే ఉపశమనం లభిస్తుంది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios