Asianet News TeluguAsianet News Telugu

మహిళలు శుక్రవారం తల స్నానం చేయవచ్చా..?

త‌ల‌స్నానం అంటే న‌లుగు పెట్టుకోవ‌డం, త‌ల‌కు శాంపులు పెట్టుకోవ‌డం, దీనిని త‌లంటు అని కూడా అంటారు. రోజు త‌ల‌స్నానం చేసే వారికి మాత్రం ఇది వ‌ర్తించ‌దు. వారానికి ఒక్క‌సారి లేదా రెండు సార్లు త‌ల‌స్నానం చేసేవారికి మాత్రం శుక్రవారం తలస్నానం మంచిదికాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. 

What is the purpose of a spiritual bath?
Author
Hyderabad, First Published Apr 11, 2020, 9:53 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

What is the purpose of a spiritual bath?

శుక్రవారం వ‌స్తే చాలు ఆడ‌వాళ్ళు త‌ల‌స్నానం చేసేస్తుంటారు. అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పు పడుతున్నాయి. 
త‌ల‌స్నానం అంటే న‌లుగు పెట్టుకోవ‌డం, త‌ల‌కు శాంపులు పెట్టుకోవ‌డం, దీనిని త‌లంటు అని కూడా అంటారు. రోజు త‌ల‌స్నానం చేసే వారికి మాత్రం ఇది వ‌ర్తించ‌దు. వారానికి ఒక్క‌సారి లేదా రెండు సార్లు త‌ల‌స్నానం చేసేవారికి మాత్రం శుక్రవారం తలస్నానం మంచిదికాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. 

ముఖ్యంగా మంగ‌ళ‌వారం, శుక్ర‌వారం ఆడ‌వాళ్ళు త‌ల‌స్నానం చేయ‌రాదు. ఒక వేళ శుక్ర‌వారం త‌ల‌స్నానం చేస్తే సౌఖ్యాల‌న్నీ దూర‌మ‌వుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. అదే శ‌నివారం త‌ల‌స్నానం చేస్తే ఐశ్వ‌ర్యం ల‌భిస్తుంది అంటున్నారు. ఇంకా..తలస్నానం గురించి శాస్త్రాలు చెబుతున్నాయి....                          

వారము - తలస్నాన ఫలితము.

ఆదివారము - 
సంతాపము , కలత, అందముపోవుట 

సోమవారము - 
కాంతి తగ్గును , భయము , కలవరము 

మంగళవారము - 
ఆయుక్షిణము  , విరోధము , భర్తకి కీడు .

బుధవారము - 
శుభము , లాభము , బుద్ది , జాడ్యము. మరియు భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రూ ఐక‌మ‌త్యంగా ఉంటారు.                  

గురు వారము -
ఆశాంతి , ధనవ్యయము , కీడు 

శుక్రవారము - 
శరీర పీడ , అశాంతి ( ఆడవారు చేయొచ్చు ) 

శనివారము - 
ఆయుర్ వృద్ది , కుటుంబ సౌఖ్యము  , లాభము. శ‌నివారం త‌ల‌స్నానం చేస్తే చాలా మంచిది.

తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు ఎన్నడూ తమ యొక్క జుట్టుని విరబోసుకోకూడదు. ఎందుకంటే.. సమస్త భూత ప్రేతాది దుష్టశక్తులు వెంట్రుకల గుండా ప్రవేశిస్తాయట. అందుకే తలస్నానానంతరం చివర ముడి వేసుకోకుండా ఉండకూడదట.

స్త్రీ విరబోసుకొన్న జుట్టుతో ఇంట్లో తిరుగుతూ ఉంటే అనేక దుష్ట గ్రహాలు ఆవహించి ఆడవాళ్లలో చెడు, దుష్ట లక్షణాలను ప్రేరేపిస్తాయట. అందుచేతనే జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీని చూసిన పెద్దలు అలా తిరగకు మంచిది కాదు అని తిడతారు .

తలస్నానానంతరం జడని అల్లుకొని లేదా జుట్టు కొసలను ముడివేసుకొని పూజ / దైవదర్శనం చేయాలి. విరబోసుకొన్న జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్ళడంకానీ, శుభకార్యాలలో పాల్గొనడం గాని చేయకూడదు అది అశుభం. అలా చేస్తే లక్ష్మిదేవి అక్క అయిన జ్యేష్ట దేవిని ( దరిద్ర దేవత )ను ఆహ్వానించినట్లే. ఆధునిక పోకడలో ఇప్పటి కాలంలో జడ వేసుకునే వారు కరువయ్యారు. సనాతన సాంప్రదాయాలను మరుస్తున్నారు...దీని ఫలితం వెంటనే చూపక పోయిన తర్వాత తప్పక చూపిస్తుంది సర్వే జనా సుఖినోభవంతు.
 

Follow Us:
Download App:
  • android
  • ios