Asianet News TeluguAsianet News Telugu

గోచార 'ఏలినాటి, అర్దాష్టమ, అష్టమ' శనిదోషం

అక్రమ సంతానం, సేవకులు, నీచులను సూచిస్తాడు. పురాతన భవనాలు, పురాతన వస్తువులు, పూరావస్తు శాఖ, సొరంగాలు, గుహలు, చలివేంద్రములు, నువ్వుల నూనె, గానుగ, నూనె దుకాణములను సూచించును. 
 

What is Shani Dosha, Shani Dosha and Its Remedies
Author
Hyderabad, First Published May 30, 2020, 12:15 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

What is Shani Dosha, Shani Dosha and Its Remedies

భారతీయ జ్యోతిష శాస్త్రంలో శని ఒక గ్రహం. వర్ణం నలుపు, నీలం సూచిస్తాడు. శని సూర్యుని పుత్రుడు. అధిదేవత యముడు. శని మకర రాశి, కుంభరాశులకు అధిపతి. తులారాశిలో ఉచ్ఛస్థితిని, మేషరాశిలో నీచ స్థితిని పొందుతాడు. పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. మిత్రులు బుధుడు, శుక్రుడు. శత్రువులు రవి, చంద్ర, కుజులు. సముడు గురువు. తత్వం వాయుతత్వం, దిక్కు పడమర, ఋతువు శిశిరం, జాతి శూద్ర, లోహము ఇనుము, ఉక్కు, రత్నములలో నీలం, గ్రహసంఖ్య ఎనిమిది, దిక్బలం సప్తమ స్థానం, గుణము తమోగుణము, ప్రదేశము హిమాలయాలలోని గంగా పరీవాహక ప్రాంతాన్ని సూచిస్తాడు. శరీర అవయవములలో ఎముకలు, క్లోమము, విసర్జకావయములను సూచిస్తాడు.

శని కారకత్వం :- ఆయుః కారకుడు, ఆటంకములు, విరోధం, కష్టం, బాధలు, దుఃఖం, సేవకత్వం, దురాచారము, బంధనం, మూర్ఖత్వం, జూదము, జైలు జీవితం, మద్యపానం, అంగ వైకల్యం, మూర్చ రోగం, అంగవైకల్యం, బ్లాక్ మార్కెట్, అన్యాయార్జన, జీవహింస, అవమానము, రాజదండన, బద్ధకం, క్షుద్రశక్తులు, అప్పులు, మృత్యుదేవతారాధాన, అంద విహీనత, బంధు మిత్ర తిరస్కారం సూచిస్తాడు. వంటవారు, నపుంసకులు, చండాలురు, అక్రమ సంతానం, సేవకులు, నీచులను సూచిస్తాడు. పురాతన భవనాలు, పురాతన వస్తువులు, పూరావస్తు శాఖ, సొరంగాలు, గుహలు, చలివేంద్రములు, నువ్వుల నూనె, గానుగ, నూనె దుకాణములను సూచించును. 

నువ్వులు, ఉల్లి, వేరు శనగ, బంగాళాదుంపలు, రాగులు, జొన్నలు, మినుములు, దున్నపోతు, గాడిద, ఒంటె, కోడి, బొగ్గు, తారు, నల్ల మంగులకు సంబంధించిన సమస్యలు, అజీర్ణం, కిరోసిన్, వెంట్రుకలు, ఎముకలు, దంతములను సూచిస్తాడు. కలప, తోలు పరిశ్రమలను సూచిస్తాడు. ఆలస్యము, దురదృష్టము, సరిహద్దులు, దహన కార్యక్రమాలు, అపవాదులు, పదవీ విరమణ, నిర్మాణం, శాస్త్రీయ దృక్పదం, ఒంటరి తనం సూచిస్తాడు. గనులు, వంతెనలు, చర్మము, ఆనకట్టలు, పిరికి వాళ్ళు, రాళ్ళు, ఆస్తి, ఆపద, మంచు, ఆందోళన, వినయము, అనుమానము, అనుకూలత, వినయము, సెరామిక్స్, మట్టిని సూచిస్తాడు.

శని కలిగించే వ్యాధులు :- శని వాత సంబంధ వ్యాదులను సూచిస్తాడు. కీళ్ళ వాతం, పక్షవాతం, బలహీనత, నొప్పులు, కిడ్ని లివర్ మొదలైన వాటిలో రాళ్ళు ఏర్పడుట, క్షయ, దగ్గు, ఆస్త్మా, న్యుమోనియా, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు, అజీర్ణ వ్యాధులు, పని చేయలేని అశక్తి , డ్రగ్స్ అలవాటు మొదలైన వాటికి కారకుడు.

శని సుర్యునితో కలిస్తే బలహీనమైన దృష్టి, జీవితమంతా కష్టాలు, ప్రభుత్వం లేకా ప్రభుత్వ అధికారులతో, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన, తండ్రితో, పై అధికారులతో సమస్యలు కలిగిస్తాడు. ఉద్యోగం సంపాదించడం కష్టమౌతుంది, ఒకవేళ సంపాదించిన చెడ్డపేరు, అధిక ఖర్చులు, ముఖ్యంగా మానసిక ప్రశాంతత లేకపోవడం ఉంటుంది.  

శని చంద్రుడితో కలిస్తే మతి భ్రమణం, పిచ్చి, వాతం, గుండె నొప్పి, కండరాల నొప్పి , తలనొప్పి , బద్దకం, నీరసం మొదలైనవి సూచిస్తాడు.

కుజుడితో కలిసిన రక్త సమస్యలు, కండరాల నొప్పి, కండరాల జబ్బులు, పల్లనోప్పి, పళ్ళు కుళ్ళిపోవుట సూచిస్తాడు.

బుధుడితో కలిసిన మాటలు సరిగా రాకుండుంట, నత్తి, నాలుక మొద్దుబారటం, మెదడు మొద్దుబారటం, చెవి, చర్మ సంబధిత వ్యాధులు సూచిస్తాడు. 

గురువుతో చేరిన జీర్ణ వ్యస్థకు సంబంధించిన వ్యాధులు.

శుక్రుడితో కలిసిన గొంతు నొప్పి, టాన్సిల్స్, పైల్స్, విరేచనాలు మొదలైన వ్యాదులను సూచిస్తాడు. సంతానం కలగటంలో ఆలస్యం కలిగిస్తాడు.

రాహువుతో కలిసిన విషప్రయోగం, వైరస్ వ్యాదులను సూచిస్తాడు. కండరములు, కీళ్ళ నొప్పులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి.

కేతువుతో కలిసిన రక్త పోటు వ్యాదులను సూచిస్తాడు. కండరములు, కీళ్ళ నొప్పులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి.


ఏల్నాటి శనిదోషం, అర్ధాష్టమ శనిదోషం అని, అష్టమ శనిదోషం అని శనిదోషాలు మూడు రకాలుగా ఉంటాయి.

ఏలినాటి శనిదోషం:- ఈ ఏల్నాటి శనిదోషం ఏడున్నర సంవత్సరములు ఉంటుంది. ఈ శనిదోషం చంద్రాత్తు ఏర్పడుతుంది. మనఃకారకుడైన చంద్రుడి మీద శని సంచారం వల్ల శనిదోషం ఏర్పడగలదు. చంద్రుడికి వ్యయస్థానము నందు అనగా రాశికి వ్యయ స్థానము నందు సంచరించడం.

వ్యయస్థాన సంచారం వల్ల ఊహించని ఖర్చులు అధికమవ్వడం, అశాంతి, సుఖం లేకపోవడం, ఆందోళన వంటివి ఉండగలవు.

జన్మస్థానం లేక రాశి మీద శని సంచారం వల్ల ఆరోగ్యములో అధికమైన సమస్యలు తలెత్తడం, పరస్పర అవగాహనాలోపం, మనిషి క్షీణించడం, చికాకులు వంటివి ఉండగలవు.

ద్వితీయ స్థానంలో ధన, కుటుంబ, వాక్ స్థానము నందు శని సంచారం వల్ల విరోధులు పెరగటం, అపజయం, తొందరపడి సంభాషించడం, ఆర్థిక ఒడిదుడుకులు, వ్యాపారంలో నష్టం, ఉద్యోగంలో పనిభారం పెరగడం, పెద్దలకు వీడ్కోలు పలకడం వంటివి ఉండగలవు.

అర్ధాష్టమ శనిదోషం:- అర్ధష్టమ శనిదోషం అనగా రాశి నుంచి 4వ స్థానము నందు శని సంచారం జరగడం. ఈ శని సంచారం వల్ల ప్రమాదాలు జరుగడం, విద్యార్థులకు జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపం, పెద్దల గురించి ఆందోళన, ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు వంటివి ఉండగలవు.

అష్టమ శనిదోషం:- అష్టమ శనిదోషం అనగా రాశి నుంచి 8వ స్థానము నందు శని సంచారాన్ని అష్టమ శనిదోషం అంటారు. ఈ అష్టమ శనదోషం వల్ల ఆయుఃప్రమాణం తగ్గడం, ఆరోగ్యములో చికాకులు అధికమవ్వడం, ఆందోళనలు వంటివి ఉండగలవు.

ఈ శని దోషం ప్రభావం చేత దేవతలు సైతం ఇబ్బందులకు నోనయ్యారు:-

1. హిరణ్యకశిపుడు మహా బలశాలి. శ్రీమన్నారాయణుడు కూడా హిరణ్యకశిపుడి బారిన పడినవాడే. అంత బలీయమైన ఈ రాక్షసుడు శనిదోషం వల్ల బలవత్తరమైన మరణం పొందాడు.

2. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా 14 సంవత్సరములు శనిదోషం వల్ల అరణ్యవాసం చేశాడు. వానరులతో స్నేహం చేయడం, వారి సాయం పొందడం, ఈ దోష నివారణానంతరం రావణాశురునిపై జయం పొందాడు.

3. నలమహారాజు శనిదోషం వల్ల రూపం మారిపోయి ఏడున్నర సంవత్సరములు వంటవానిగా జీవితం సాగించాడు.

4. ద్వాపర యుగంలో పాండవులు ఈ శనిదోషం వల్ల 14 సంవత్సరములు అజ్ఞాతవాసం చేసి అడవుల వెంట తిరిగి నా నా ఇబ్బందులు పడ్డారు.

5. ఈశ్వరుడు కూడా శని దోషం వల్ల చెట్టు తొఱ్ఱలో దాక్కున్నాడు.

వీరి అందరి అనుభవాలను గ్రహించి మనం శని దోషాలకు శాంతి చేసి శనిని పూజించి ఆరాధించినట్లయితే సర్వదా శుభం కలుగుతుంది. శని సూర్య భగవానుడి కుమారుడు. యముడికి అన్నగారు అవుతారు. వర్తమానం ఈ శని ఉత్తర వాయవ్య భాగంలో సంచరించడం వల్ల ఆ వైపు తిరిగి శనిని పూజించి ఆరాధించినట్లయితే దోషాలు తొలగిపోతాయి.

శని గ్రహ దోష పరిహార మార్గాలు:- 

* రావిచెట్టుకు ప్రదక్షిణలు , తలిదండ్రులను, గురువులను గౌరవించాలి, పూజించాలి. పేదవారికి, అవిటివారికి దానధర్మాలు చేయాలి. 

* కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

* పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను, తినడానికి గ్రాసాన్ని ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

* శుభాల కోరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను, నీళ్ళను వాటికి అందివ్వండి ఆలాగే ప్రతి రోజు 
విష్ణు సహస్ర నామలు చదవడం, లేదా వినడం వలన మీకు ఎంతో మేలు కలుగుతుంది, 

* పేదలకు కడుపు నిండ వారు సంత్రుప్తి పడేలాగా కమ్మని రుచికరమైన భోజనాలు పెట్టించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

* కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

* నీలం:- శని వల్ల ‘నీలం' ధరిస్తే ఇబ్బందులు అధిగమించవచ్చు అనుకోవటం సరి కాదు. పూర్తి జాతకం చూపించుకున్నాక అవసరమైతే తప్పక ధరించాలి. 

* వాకింగ్  :- ఉదయం నడక సాగించాలి, శని శ్రమ కారకుడు కావున సోమరితనాన్ని విడనాడి ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేయాలి. సాద్యమైనంతవరకు వాహనాలను వాడకుండా నడక ద్వారా పనులు చేసుకుంటే మంచిది. 

* నువ్వుల నూనె:- శనివారం రోజు శరీరం మొత్తానికి నువ్వులనూనె వ్రాసుకొని కొంత సమయం తరువాత వేడి నీటితో స్నానంచేయాలి. 

* తడికాళ్ళతో నిద్రించరాదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా పూజ గది, బెడ్రూం, పరిశుభ్రంగా ఉండాలి. సుఖవంతమైన నిద్ర కోసం బెడ్రూంలో నీలం బల్బు బెడ్ లైట్ వేసుకోవాలి. 

* చీమలకు ఆహారం :- శ్రమ జీవులు అయిన చీమలకు చెక్కెర వేయాలి. ఆవుకి బెల్లంతో కలిపిన నువ్వులను తినిపించాలి. నల్ల కుక్కలకి కాకులకి ఆహారం వెయ్యాలి. 

* మెడిటేషన్:-  ప్రతిరోజు కొంత సమయం మంత్రోపాసన చేయాలి. మెడిటేషన్ చేస్తూ గాలి పీల్చటం, వదలటం చేస్తే వాయు కారకుడు అయిన శని తృప్తి పడతాడు. ముసలివాళ్ళకి, మానసిక వికలాంగులకి, పశు పక్ష్యాదులకి సహాయం చేయాలి. సేవకులను అకారణంగా దూషించకూడదు. 

* కాళికాదేవి లేదా శివున్ని పూజించాలి. శని స్తోత్రం, శని చాలీసా, శని అష్టాత్తర, సహస్రనామ స్తోత్రం పారాయణ చాలా మేలు. అమావాస్య రోజున కాళీ స్తోత్రం చదువుకోవాలి. శివలింగాన్ని, కాళికాదేవిని పూజించాలి. పేదలకు భోజనం పెట్టడం చేయాలి.

 
తరుణోపాయ మంత్రం :-

ఓం ప్రాం ప్రీం ప్రౌం సం శనైశ్చరాయ నమ: 
   
    కోణస్త పింగళ బభ్రు:   

    కృష్ణో రౌద్రాంతకో యమ:   

    సౌరి శనైశ్చరో మంద: 

    పిప్పలాదేవ సంస్తుత:  

     నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం 
    ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం 

ఆపదలు తొలగుటకు మంత్రం :-

    అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః | 
    శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||
    అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |
    విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||


 

Follow Us:
Download App:
  • android
  • ios