ఎంతో పవిత్రమైనది మాత్రమే పరమాత్ముడికి సమర్పించాలనే ఉద్దేశంతోనే దేవుడికి కొబ్బరికాయను కొడతాం.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
దేవుడికి కొట్టిన కొబ్బరి కాయ కుళ్ళితే ఏం అవుతుంది..?
హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా, పూజలు చేయాలన్నా కొబ్బరి కాయకు ప్రాధన్యత ఇస్తారు.
ఏ చిన్న పూజ కూడా కొబ్బరి కాయ లేకుండా నిర్వహించరు.
గుడికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతారు.
ఎంతో పవిత్రమైనది మాత్రమే పరమాత్ముడికి సమర్పించాలనే ఉద్దేశంతోనే దేవుడికి కొబ్బరికాయను కొడతాం.
చాలా మంది కొబ్బరికాయ కుళ్లిపోయిందని బాధపడుతుంటారు.
దీని వల్ల తమకు కీడు జరుగుతుందని భమపడుతుంటారు. అశుభంగా నమ్ముతారు.
అయితే నిజానికి పురాణాల్లోను ఎక్కడా కూడా కొబ్బరికాయ కుళ్ళితే అశుభం అని రాయలేదు.
సాధారణంగా కొన్ని కొబ్బరి కాయలు కుళ్లిపోయి ఉంటాయి. ఆ విషయం మనకు తెలియదు కాబట్టి దేవుడి దగ్గర కొడతాం.
వాస్తవానికి దేవుడికి కొబ్బరి కాయ, పుష్పం, ఫలం వీటిలో ఏదో ఒకటి సమర్పిస్తే స్వీకరిస్తానని భగవంతుడు చెప్పాడు. అది ఎలా ఉన్నా పర్వాలేదు. భక్తితో సమర్పించడమే ముఖ్యమని శ్రీ కృష్ణడు భవద్గీగతలో చెప్పాడు.
అందుకే కొబ్బరి కాయ కొట్టినప్పుడు కుళ్లిపోయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. కావాలని కుళ్ళినకాయ తెచ్చి కొట్టలేదుకదా! భగవంతని మీద ప్రేమ ముఖ్యం!
కొబ్బరి కాయలో పువ్వు వస్తే అదృష్టం అని కొబ్బరికాయ కుళ్ళితే దురదృష్టమన్నది కేవలం అపోహలు మాత్రమే. ఇలాంటివి ఏమీ మనసులో పెట్టుకోకుండా భక్తి శ్రద్ధలతో భగవంతుడిని కొలిస్తే ఎలాంటి చింతలు దరిచేరకుండా అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 22, 2020, 12:15 PM IST