Asianet News TeluguAsianet News Telugu

దిక్కులకు పాలకులు, అధిపతులు ఎవరు..? వారి బలాలేంటి?

వాస్తు పరంగా ప్రధాన ద్వారం నిర్మించుకోవడానికి పై సూచించిన దిక్పాలకులను దృష్టిలో పెట్టుకుని ఇంటి ప్రధాన గుమ్మాన్ని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా దిక్కులకు గల సహజ బలం ఎలా ఉంటుందో క్రింది ఇవ్వబడిన దానిని గమనించండి. 
 

What are the directions and their heads
Author
Hyderabad, First Published Jul 29, 2021, 3:06 PM IST

దిక్కులు - దిక్పాలకులు - అధిపతులు 
తూర్పు - ఇంద్రుడు      - రవి ( సూర్యుడు)
పడమర - వరుణుడు    - శని 
దక్షిణం - యముడు     - కుజుడు 
ఉత్తరం - కుభేరుడు     - బుధుడు 
ఈశాన్యం -ఈశ్వరుడు  - గురువు 
వాయవ్యం - వాయుదేవుడు  - చంద్రుడు 
నైరుతి - నిరృతి అనే రాక్షసుడు - రాహు, కేతు 
ఆగ్నేయం - అగ్నిదేవుడు - శుక్రుడు 

వాస్తు పరంగా ప్రధాన ద్వారం నిర్మించుకోవడానికి పై సూచించిన దిక్పాలకులను దృష్టిలో పెట్టుకుని ఇంటి ప్రధాన గుమ్మాన్ని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా దిక్కులకు గల సహజ బలం ఎలా ఉంటుందో క్రింది ఇవ్వబడిన దానిని గమనించండి. 

ఉత్తరం :-  ఐశ్వర్య, భోగ భాగ్య కారకుడు. సకల సంపత్కరుడు. ధనాధిపతి కుబేరుడు.

ఈశాన్యం:- ఈశాన్య దిక్పతి. మృత్యుంజయుడు. సకల శుభకారకుడు. వంశోద్ధీపకుడు - శివుడు.

తూర్పు :- క్షత్రియ సంభవుడు. దర్పం కీర్తి కారకుడు. రాజస గుణాధిక్యత కలవాడు. ఇంద్రుడు.

వాయవ్యం :- అస్తిరత్వం ఎక్కువ. చంచలబుద్ధి. స్థాన భ్రష్ఠత్వం కలిగించే గుణం కలవాడు వాయుదేవుడు.

పశ్చిమం:- పాశంతో బంధించి, పురుషులకు తక్కువ సామర్థ్యాన్ని ఇచ్చేవాడు. వరుణుడు.

ఆగ్నేయం :- దురహంకారి. సర్వదగ్ధ సమర్థుడు. ధన లేమి కారకుడు రోగ కారకుడు - అగ్నిదేవుడు.

దక్షిణం:- మృత్యు కారకుడు. వినాశకుడు. దరిద్ర కారకుడు. సమపర్తి. ధనహీనుడు యముడు.

నైరుతి: నర వాహనుడు. రాక్షసుడు. పీడాకారకుడు. రక్తపాన మత్తుడు. హింసాకారకుడు నైర్పతి. 

గమనిక :- పై ఎనిమిది దిక్కులలో మొదటి మూడు దిక్పాలకులు శుభ కారకులు. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios