మొదలైన పెళ్లి భాజా.. ముహూర్తాలు ఇవే..
లాక్ డౌన్ తర్వాత కాస్త సడలింపులు వచ్చాయి. దీంతో.. చాలా మంది ఈ కార్తీక మాసంలో పెళ్లిళ్లు జరిపించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా నెలల పాటు.. దేశంలో పెళ్లిళ్లపై ఆంక్షలు విధించారు. కొద్ది మంది మాత్రమే పెళ్లికి హాజరు కావాలంటూ కండిషన్స్ పెట్టారు. దీంతో చాలా మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. కాగా.. లాక్ డౌన్ తర్వాత కాస్త సడలింపులు వచ్చాయి. దీంతో.. చాలా మంది ఈ కార్తీక మాసంలో పెళ్లిళ్లు జరిపించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.
కార్తీక మాసంలోని మంచి ముహూర్తాలతో పెళ్లిళ్లు మొదలయ్యాయి. ఈ సంవత్సరం డిసెంబరు 14 వరకు కార్తీక మాసం ఉంది. ఇందులో నవంబరులో 20, 21, 22, 25, 26, 27, 28, 30 తేదీల్లోని ముహూర్తాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా నిర్వహించనున్నారు. డిసెంబరులో 2, 4, 6, 9, 10, 11 తేద్లీనూ వివాహాలు జరగనున్నాయి.
2021లో జనవరి 6 వరకు ముహూర్తాలు ఉన్నాయి. జనవరి 13 నుంచి పుష్యమాసంలో గురుమూఢం ఉంటుంది. ఫ్రిబవరి 12 నుంచి మాఘమాసం మొదలై మూఢం కొనసాగుతుందని పంతుళ్లు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 13న ఉగాదితో ఫ్లవ నామ సంవత్సరం మొదలై మూఢం కొనసాగుతుంది. మంచి ముహూర్తాలు కావాలంటే ఆరు నెలలపాటు ఆగాల్సిన పరిస్థితి. దీంతో ఈ రెండు నెలల్లోనే పెళ్లిళ్లు చేయడానికి ఇష్టపడుతున్నారు.