Asianet News TeluguAsianet News Telugu

శివునికి ఏ అభిషేకం చేస్తే.. ఎలాంటి ఫలితం దక్కుతుంది?

శివరాత్రి రోజున శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముందుగా పసుపు పొడితో శివునికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజనపొడితో అభిషేకం చేయిస్తే దైవానుగ్రహం లభిస్తుంది.

Various Lord Shiva Lingam Abhishekam and its benefits
Author
Hyderabad, First Published Feb 20, 2020, 12:46 PM IST

పిలిస్తే పలికే దైవం శివుడు. భోలాశంకరుడికి అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతున్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారట. అదీ అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివునికి అభిషేకం చేయించడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును. 

శివరాత్రి రోజున శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముందుగా పసుపు పొడితో శివునికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజనపొడితో అభిషేకం చేయిస్తే దైవానుగ్రహం లభిస్తుంది.

గ్రహదోషాలు తొలగిపోతాయి. బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివునికి అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నేతిలో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయిపండ్ల రసంతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్యాలు మాయమవుతాయి. 

Also Read పండగల్లో కెల్లా ప్రశస్తమైనది.. మహాశివరాత్రి..

చెరకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివాభిషేకం చేస్తే శత్రుభయం వుండదు. యమభయం వుండదు. కొబ్బరి నీటితో శివాభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవం, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయపొడితో శివాభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయం అవుతాయి. పన్నీరుతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివాభిషేకం చేయడం ద్వారా కీర్తిప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.

అలాగే అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలుండవు. సకల సంతోషాలు సిద్ధిస్తాయి. తేనెతో ఈశ్వరునికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన గాత్రం సొంతం అవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెబుతారు. బిల్వ పత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులను శివపూజకు తప్పకుండా సమర్పించాలి. ప్రతి ప్రదోషానికి బిల్వపత్రాలను శివాలయానికి చేరవేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు సూచిస్తారు.

Various Lord Shiva Lingam Abhishekam and its benefits

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios