ఉత్తరాషాడ కార్తె ప్రారంభం
పంచాంగంను అనుసరించి చేసే వ్యవసాయంను వ్యవసాయ పంచాంగం అంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో స్థానిక పంచాంగంను అనుసరించి వ్యవసాయం చేస్తుంటారు.
11 జనవరి 2022 నుండి ఉత్తరాషాడ కార్తె పండుగ మొదలవుతుంది. ఈ పండుగ వ్యవసాయదారులకు ఉద్దేశించినది. పంచాంగంను అనుసరించి చేసే వ్యవసాయంను వ్యవసాయ పంచాంగం అంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో స్థానిక పంచాంగంను అనుసరించి వ్యవసాయం చేస్తుంటారు.
పంచాంగ ఫలితం:- ఈ ఉత్తరాషాడ కార్తె ప్రారంభం దినం మంగళవారం మధ్యాహ్నం 1:56 నిమిషాలకు అశ్విని నక్షత్రంలో ప్రారంభం అవుతుంది. వాహనం ఖరం ( గాడిద ), ఫలితం మధ్య వృష్టి.
పంచాంగంను అనుసరించి వేసే పంటల వలన పంట సులభంగా బతకడమే కాకుండా అధిక దిగుబడులు రావడానికి అవకాశాలున్నాయి. జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేసారు. సూర్యోదయమప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేసుకున్నారు.
ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. సంవత్సరానికి 27 కార్తెలు. తెలుగు ప్రజానీకం చంద్ర మానాన్ని పాటిస్తుంటే తమిళులు సౌర మానాన్ని పాటిస్తున్నారు. తెలుగు రైతులు తరతరాలుగా తమ అనుభవాలలోనుంచి సంపాదించుకున్న వ్యవసాయ వాతావరణ విజ్ఞానాన్ని 'కార్తెలు' వాటిపై సామెతల రూపంలో ప్రచారం చేశారు. ఆయా కార్తెలు నెలలు రాశులు వారీగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ అర్ధమయ్యేలా సామెతల రూపం లో పొందు పరిచారు.
ఉత్తరాషాడ కార్తె :- ఈ కార్తె లలో రైతులు చేసే వ్యవసాయ పనులు చూద్దాం.
వరి : దాళ్వా వరి నాట్లు , నాటిన వరికి కలుపు తీయుట , సస్యరక్షణ.
జొన్న : సంకర జొన్నకు నేలను తయారు చేయుట , విత్తనం వేయుట.
సజ్జ : వేసవి పంటకు నేల తయారి - విత్తనం వేయుట.
ప్రత్తి : మాగాణి ప్రత్తికి నేలను తయారు చేయుట.
మొక్కజొన్న : ఎరువులు వేయుట , అంతరకృషి.
పసుపు : మే నెలలో ఆర్మూర్ , కొరుట్ల , మెట్టుపల్లి మరియు యితర ప్రాంతాలలో నాటిన కస్తూరి రకం పసుపు త్రవ్వుట , విత్తనం నిల్వ చేసుకొనుట.
వేరుశనగ : డిశంబరులో విత్తిన వేరుశనగకు అంతరకృషి , తెలంగాణా ప్రాంతంలో నీటి వసతి క్రింద విత్తుట.
ఆముదం : విత్తుట
చెరకు : తెలంగాణా జిల్లాల్లో నాటిన పైరుకు , కార్శి తోటల్లో ఎరువులు వేయుట , సస్యరక్షణ , కోస్తా రాయలసీమల్లో క్రొత్త తోటలను నాటుట.
పప్పు దినుసులు : వరి పొలాలందు (మాగాణిలో) నవంబరులో వేసిన మినుము , పెసర కోతలు.
కూరగాయలు : బఠాణికాయ ఏరుట , ధనియాలు కోతలు
పండ్లు : మామిడిపై తేనె మంచు పురుగు నివారణ చర్యలు , అరటి , ద్రాక్ష నాట్లకు గుంతలు త్రవ్వుట , ఉసిరి కాయలు అమ్ముట , నిల్వచేయుట.
పువ్వులు : గులాబి , మల్లెల కత్తిరింపులు , ఎరువులు వేయుట , చేమంతి పూల కోతలు.
ధాన్య నిల్వలు : విత్తనాలు నిల్వ చేసుకొనుటలో జాగ్రత్తలు తీసుకొనుట, నిల్వ ఉంచిన ధాన్యానికి పురుగు పట్టకుండా శాస్త్రీయ పద్ధతులను పాటించుట.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151