Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా ఉండాలంటే

ఎవరి అభిరుచి వారిదే అయినా రంగుల వాడకంలో వాస్తు నియమాలు పాటిస్తే మంచిది. ఏయే గదికి ఏ రంగు వేస్తే బావుంటుందో తెలుసుకుని ఆ రంగులను గదులకు వేస్తే మంచిది.

To prevent any negative energy from entering the house
Author
Hyderabad, First Published Dec 8, 2021, 3:57 PM IST

 

ఇల్లన్న తర్వాత దేవుడి గది, వంట గది, డైనింగ్‌ హాల్‌, పడక గది, డ్రాయింగ్‌ రూమ్‌, స్టడీ రూమ్‌ ఇలా ఎన్నో ఉంటాయి. ఇవి చిన్నవి కావచ్చు.. లేదంటే పెద్దవిగా కూడా ఉండవచ్చు. అయితే ప్రతి గదికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రత్యేకత రంగుల ద్వారా ఫర్నీచర్‌ ద్వారా ఆయా గదులలో ఉండే ఇతర వస్తువుల ద్వారా కనబడుతూ ఉంటుంది.

ఎవరి అభిరుచి వారిదే అయినా రంగుల వాడకంలో వాస్తు నియమాలు పాటిస్తే మంచిది. ఏయే గదికి ఏ రంగు వేస్తే బావుంటుందో తెలుసుకుని ఆ రంగులను గదులకు వేస్తే మంచిది.

ఏ రంగు వాడాలి :- వాస్తు ప్రకారం పడక గదులకు లేత రంగు మంచిది.

* గోడలకు లేత గులాబీ, నీలం, ఆకుపచ్చ, బూడిద రంగులు ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. బుద్ధి వికసిస్తుంది. 

* పసుపు, తెలుపు మార్బుల్‌ స్టోన్స్‌ను ఫ్లోర్‌కి వాడితే వాస్తుకు అనుగుణంగా ఉంటుంది. ప్రశాంతంగా నిశ్శబ్ద వాతావరణం ఉండేలా ఇవి చూస్తాయి. దంపతుల మధ్య ఎటు వంటి సమస్యలురావు. చక్కగా నిద్రపడుతుంది.

పడకగదిలో నెమలి పింఛమెందుకు:- మాధవుడికి నెమలి పించం అంటే ఎంతో ఇష్టమనే సంగతి అందరికి తెలిసిందే. ఆయన ఎప్పుడు పించాన్ని తలపై ధరించే ఉంటాడు. నెమలి ఫించానికి ఎంతో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. ఇంట్లో నెమలి పించాన్ని ఉంచడాన్ని ఎంతో శుభకరంగా పరిగణిస్తారు. దీని వల్ల ఇంట్లో ఆనందం, సంపద, మనశ్శాంతి పెరుగుతాయని చెబుతారు.

* నెమలి పించం ఉండటం వల్ల ఇంట్లో ఉండే దోషాలు దూరమవుతాయి. ఈ నెమలి పించాన్ని ఇంటి ఉత్తరం లేదా తూర్పులో దిశలో ఏదైనా మూలలో ఉంచండి. బయట నుంచి వచ్చే వ్యక్తి చూసేలా పెట్టండి.

​* ఇంట్లో పూజా మందిరంలో నెమలి పించాన్ని తప్పకుండా ఉంచాలి. ప్రతి రోజు భగవంతుడిని ఆరాధించిన తర్వాత నెమలి పించంతో గాలి విసరండి. దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. చేపట్టిన పనలు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. కాబట్టి నెమలి పించాన్ని పూజగదిలో తప్పకుండా ఉంచండి.

* వాస్తుప్రకారం ఇంట్లో గాని వ్యాపార స్థలాలో గాని ప్రధాన ముఖ ద్వారం ద్వారా ఇంట్లో ప్రతికూల, సానుకూల శక్తి ప్రవేశిస్తుందని చెబుతారు. భోజపత్రంపై యంత్రం వ్రాయబడిన గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పాదుకలు గల ఫోటోకు రెండువైపులా నెమలి పించాన్ని ప్రధాన ద్వారం పైన ఏర్పాటు చేసుకోవడం వలన ఇంటిలోపల ఎలాంటి ప్రతికూల శక్తి ప్రవేశించదు. దృష్టి లోపాల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా జీవితంలో ప్రతికూలతను అధిగమించి సానుకూల శక్తిని పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది.

​* మీరు చాలా కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా లేదా ఎంత పని చేసినా డబ్బు రాకపోయినా అప్పుడు మీరు ఈ పరిహారం పాటించాలి. వ్యాపార సంస్థలలో తప్పకుండా భోజపత్రంపై యంత్రం వ్రాయబడిన గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పాదుకలు గల ఫోటోకు ప్రతి నిత్యం ఎర్రని లేదా పసుపు రంగు గల పూలతో పూజించి దూపమ్ వేస్తూ ఉండడం ద్వారా రోజు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. డబ్బు కొరతనేది రాకుండా చూస్తుంది. ​ప్రతికూల శక్తి దూరమవుతుంది.

​* పిల్లలు చదువుకునే గదిలో నెమలి పించాన్ని అమర్చాలి. నెమలి పించం శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన వస్తువుగా పరిగణిస్తారు. పిల్లలను బాలకృష్ణుడిగా భావిస్తారు. అందువల్ల కూర్చొని చదువుకునే ప్రదేశంలో నెమలి పించాన్ని తప్పకుండా పెట్టండి. ఇలా చేయడం ద్వారా పిల్లల ఏకాగ్రత మెరుగుపడుతుంది, వారు త్వరగా పాఠాన్ని నేర్చుకుంటారు. ఎక్కువ కాలం గుర్తు పెట్టుకుంటారు.

* రకరకాలైన పక్షులు జంటలుగా ఉంటే దృశ్యాలు పడకగదిలో ఉంచితే భార్యాభర్తల మధ్య అనురాగం పెంపొందుతుంది.

*  బెడ్‌రూమ్‌లో నెమలి పింఛాన్ని కనబడేటట్లు పెట్టి తెల్లవారు జామున లేవగానే దానిని చూడడం వల్ల రాహుగహ్ర దోషాల నుంచి నివారణ కలుగుతుంది. 

* నెమలి పింఛంతో తయారైన చిత్ర పటాలను పడకగదిలో ఉంచడం ద్వారా శుభ ఫలితాలుంటాయి.

* పడకగదిలో కంటికి ఎదురుగా వికృతమైన పటాలు, చిలకకొయ్యలు, స్తంభాలు ఇతర అవరోధాలు లేకుండా జాగ్రత్తగా వహించాలీ.

* శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన నెమలి ఫించం పడక గదిలో ఏర్పాటు చేసుకోవడం వలన దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.  

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios