ఏ వారంలో ఏ పని చేయాలి..?
రాజ్యాభిషేకం, పదవీ ప్రమాణ స్వీకారం, వాద్య విద్యారంభం, రాజసేవ మొదలైన స్థిర కృత్యాలకు మంచిది.
వారాలు -వారాధిపతి - కార్యాలు:-
1) ఆదివారం - రవి బలంగా ఉంటే - రాజదర్శనం.
2) సోమవారం - చంద్రుడు బలంగా ఉంటే - సకల కార్యాలకు.
3) మంగళవారం - కుజుడు బలంగా ఉంటే - యుద్ధానికి.
4) బుధవారం - బుధుడు బలంగా ఉంటే - విద్యారంభానికి.
5) గురువారం - గురుడు బలంగా ఉంటే - వివాహానికి.
6) శుక్రవారం - శుక్రుడు బలంగా ఉంటే - ప్రయాణానికి.
7) శనివారం - శని బలంగా ఉంటే - యజ్ఞదీక్షకు మంచిది.
సంజ్ఞకు తగు కృత్యాలు:-
1) ఆదివారం:- స్థిర సంజ్ఞ కలది. రాజ్యాభిషేకం, పదవీ ప్రమాణ స్వీకారం, వాద్య విద్యారంభం, రాజసేవ మొదలైన స్థిర కృత్యాలకు మంచిది.
2) సోమవారం:- చర సంజ్ఞ కలది. ఆభరణాలు చేయించడం, ధరించడం. అవసరమైన అప్పుచేయడం (త్వరగా తీరుతుంది), సంగీత నృత్యారంభం, పశుక్రయ విక్రయాలు మొదలైన చర కృత్యాలకు మంచిది.
3) మంగళవారం:- ఉగ్రమైనది. శత్రువులను జయించడం, శిక్షలను విధించడం మొదలైన ఉగ్రకృత్యాలకు మంచిది. దీనికే జయవారం అని మరోపేరు. అప్పు తీర్చుటకు మంచిది. మంగళవారం తీరిస్తే త్వరగా అప్పులు తీరుతాయి.
4) బుధవారం:- మిశ్రసంజ్ఞ కలది. సాహిత్యం, సంగీతం, కళలు, లేఖనాలు ( ఉత్తరాలు వ్రాయడం, చిత్రలేఖనారంభం), ధాన్యసంగ్రహణం (వస్తువులు కొనడం )మొదలైన వానికి మంచిది. బుధవారం అప్పులు ఇవ్వరాదు. తీర్చరాదు.
5) గురువారం:- క్షిప్ర సంజ్ఞ లేక లఘు సంజ్ఞ కలది. యజ్ఞాది కృత్యాలు, దేవతాపూజ, ప్రతిష్ట, గ్రహారాధన, విద్యాభ్యాసం, నూతన వస్త్రధారణం, ఔషధ సేవ, అలంకార ధారణ మొదలైనవానికి మంచిది.
6) శుక్రవారం:- మృదుసంజ్ఞ కలది. నూతన వస్త్రాభరణ, వ్యాపార, వ్యవసాయం మొ.లగు వాటికి మంచిది.
7) శనివారం:- దారుణ సంజ్ఞ కలది. దీనికి స్థిరవారమని కూడా పేరున్నది. క్రూరకృత్యాలకు ఉపయోగపడుతున్నది. నిషేక నామకరణాదులకు మంచిదే. గృహప్రవేశం వంటి స్థిర కృత్యాలకు కూడా ఉపయోగించవచ్చును.
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151