Asianet News TeluguAsianet News Telugu

ఆ సమయంలో తులసి ఆకులు తుంచితే.. మహా పాపం..!

తులసి మొక్కను నాటినా, నీరు పోసినా, తాకినా, పోషించినా మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.తులసి మొక్కతో హరిహరులను పూజిస్తే పునర్జన్మ ఉండదని చెబుతారు. 
 

these sacred rules before plucking Tulsi leaves
Author
Hyderabad, First Published Mar 11, 2020, 12:50 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151.

these sacred rules before plucking Tulsi leaves
తులసి మొక్క ఉన్న ఇంటిని తీర్థస్థలమని, తులసి కోట ఉన్న ప్రదేశం గంగాతీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.రోజూ నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం, ప్రదక్షిణలు చేయడం వల్ల సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూ మండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని ఓ నమ్మకం.తులసి మొక్కను నాటినా, నీరు పోసినా, తాకినా, పోషించినా మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.తులసి మొక్కతో హరిహరులను పూజిస్తే పునర్జన్మ ఉండదని చెబుతుంటారు.. 

సనాతన సంప్రదాయాల ప్రకారం ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తులసి ఆకులను తుంచరాదు.
తులసి ఆకులను తూర్పు, ఉత్తర ముఖంగా నిల్చుని మాత్రమే కోయాలి.
ద్వాదశి అమావాస్య, పున్నమి తిథులలో తులసి ఆకులను తుంచరాదు.
రాత్రి వేళల్లోనూ, స్నానం చేయకుండా గానీ, పాదరక్షలతో గానీ తులసి మొక్కను ముట్టుకోరాదు.
తులసి ఆకులను ఒంటిగా తుంచరాదు. మూడు ఆకుల దళంతో కలిపే తుంచాలి.

తులసి ఆకులూ కొమ్మలు, వేర్లు అనేక రకాలుగా ఉపయోగ పడతాయి?

తులసీ స్మరణేరైవ సర్వపాపం వినశ్యతి తులసీ స్పర్శనేరైవ సశ్యంతి వ్యాదయో నృణామ్”

తులసీ స్మరణ మాత్రము చేతనే సర్వపాపములు నశించును. తులసిమాలని స్పర్శించినంత మాత్రము చేతనే సర్వవ్యాధులు నశించును.

తులసి మొక్క ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటినీ వైద్య రంగంలో ఉపయోగిస్తారు.

తులసి ఆకుల రసాన్ని జ్వరం, వాంతులు, విరేచనాలు, అతిసార, రక్తస్రావం తదితర వ్యాధులను తగ్గించడంలో వాడతారు.

తులసి ఆకురసం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

తులసి ఆకులను నిమ్మ రసంతో కలిపి చర్మ సంబంధిత వ్యాధుల నిర్మూలనలో ఉపయోగిస్తారు.

గొంతు గరగరను తగ్గించడంలోనూ, కఫాన్ని తొలగించి గొంతును శుభ్రం చేయడంలోనూ తులసి రసాన్ని ఎక్కువగా వాడతారు.

పాము కరిచిన వ్యక్తి చేత తులసి ఆకులను తినిపించి, తులసి ఆకులు, వేర్లు, మిరియాలు కలిపి నూరి తినిపిస్తే విషం త్వరగా ఎక్కదని ఆయుర్వేద వైద్యులు చెబుతారు.

తేలు కుడివైపు కుడితే ఎడమవైపు, ఎడమ వైపు కుడితే కుడి వైపు చెవిలో తులసి రసం వేస్తే విషం ఎక్కదంటారు.

తులసితో దోమలు దూరం:-

తులసీ దళాలను నీటిలో వేస్తే నీటిలో ఉన్న సూక్ష్మక్రిములు నాశనమ వుతాయి. జలుబు, దగ్గు ఉన్నప్పుడు రెండు పెద్ద స్పూన్‌ పరిమా ణంలో తులసి రసాన్ని తీసుకుని తగినంతగా తేనె చేర్చి 2,3 సార్లు తాగితే తగ్గుతుంది. తులసి ఆకులను నమలవచ్చు. ఇంటిచుట్టూ తులసి మొక్కల ఉంటే దోమల బాధ ఉండదు.

తులసి జ్వరానికి దివ్యౌషధం కూడా పనిచేస్తుంది. 

గొంతునొప్పి, స్వరం సరిగా పలుకని సమయంలో కొంచెం నీళ్లలో తులసి ఆకులను వేసి ఉడికించి ఆ నీటితో పుక్కిలిపట్టాలి. నీళ్లు వెచ్చగా ఉన్నప్పుడే చేయాలి. పైత్యం, అలర్జీ లేదా ఏదైనా పురుగు కొరికినప్పుడు తులసి రసాన్ని రాయాలి. రెండు స్పూన్ల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగించాలి. తులసి ఆకులలో చెమటపట్టించే గుణం ఉంది. అందుకే అన్నిరకాల జ్వరాలలోను తులసి రసాన్ని తేనెతో కలిసి నాలుగు గంటలకు ఒకసారి ఇస్తారు.


చర్మవ్యాధులకు పోగొట్టడానికి ఉపయోగిస్తారు .
లివర్‌ సమస్య ఉన్నటువంటి వారికి తులసి ఆకుల కషాయం చాలా మంచిది. 

మూత్రవిసర్జనలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెరతోపాటు తీసుకోవాలి. తులసి విత్తనాలను ఒక గంటపాటు నీటిలో నానబెట్టి బాగా పిసికి, వడగట్టి తాగాలి. 

గజ్జి మొదలైన చర్మవ్యాధులలో దురద ఎక్కువగా ఉంటే తులసి ఆకుల రసాన్ని రాసి తులసి కషాయాన్ని తాగించాలి.. 

కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి.

గొంతులో కఫం మటుమాయం అవడానికి దయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, లేదా ఆ రసంలో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది. 

తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి. జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని ( కషాయం ) తాగితే ఫలితం ఉంటుంది.

తులసి కషాయం తాగితే కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కను రెప్పల మీద రాసి చూడండి (కంట్లో పడకుండా జాగ్రత్త వహించండి). తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. 

తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది. తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి. తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతు నొప్పి, బొంగురు పోయిన గొంతు సాఫీగా ఉంటుంది.

తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది., తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు. నిద్రలేమితో బాధపడే వారికి తులసి గొప్ప ఔషధం. 

అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్ర పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.

సౌందర్యసాధనకు ఎంతో ఉపయోగం గా ఉంటుంది ఆడవాళ్లు లక్షలు, వేలు ఖర్చుపెట్టి బ్యూటీషియన్ల వద్దకు వెళతారు. అక్కడ ట్రీట్‌మెంట్‌ కోసం డబ్బులు మంచినీళ్లులా ఖర్చుపెడతారు. తులసి ఆకులను పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకుంటే కొన్నాళ్లకు చర్మంలోని స్వేదగ్రంధులలో జీవం తొణికిసలాడి...మీ చర్మం నిగనిగలాడటం ఖాయం.

తులసి మొక్కను ఈశాన్యాన గాని తూర్పు పక్కన గాని నాటాలి . అటు వైపు సూర్యుడి వెలుగు ఎక్కువ ఉండాలి.
తులసి దైవ సంభూతమైన మొక్కగా హిందువులు భావిస్తారు. విష్ణువుకు ప్రీతి పాత్రమైనది ఇది.మన ఆరోగ్యానికి ఓ మంచి ఔషధంగా పనిచేసే తులసిని మీ ఇంట్లో ఈ రోజే నాటండి. చక్కని ఆరోగ్యం సొంతం చేసుకోండి.

Follow Us:
Download App:
  • android
  • ios