పుష్యమీ కార్తె
పుష్యమి నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
భారతీయ జ్యోతిష సాంప్రదాయ ప్రకారం ఒక్కోక్క కార్తెలో ప్రకృతిలోని మార్పు, దాని వలన జరిగే ప్రత్యేకాంశలను సవివరంగా వివరించింది. ఈ కార్తెల ఆధారంగా వ్యవసాయ దారులు, జానపదులు ( గ్రామీన ప్రాంతం వారు) ఎక్కువగా వీటిపై ఆధారపడి చేయువృత్తులు, వ్యవసాయ సాగు. ఈ కాలగణనతో కార్తెల అధారంగా వారి పంటల నిర్ణయం, సాగు చేసుకుంటారు. సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించిన నాటి నుండి మృగశిర కార్తె ఏర్పడుతుంది. ఈ కార్తె నుండి వర్షాలు పడతాయని మనవారి భావన. ఇదే సమయంలో మన ప్రాంతంలోకి నైఋతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి.
పంచాగ ప్రకారం:- పుష్యమి నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్య జీవనోపయోగిగా వ్యవసాయ పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి.
కార్తె ప్రారంభం :- చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్రం సమీపంలో ఉంటే... ఆ కార్తెకు ఆ పేరు పెడతారు... అశ్వినితో ప్రారంభమై రేవతితో ముగిసే వరకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల పేర్లతో కార్తెలు ఉన్నాయి. ప్రస్తుతం పుష్యమీ నక్షత్రానికి చేరువలో చంద్రుడు ఉండటం వల్ల దీనికి పుష్యమీ కార్తె అనే పేరు వచ్చింది.
పుష్యమీ కార్తె ఫలములు:- ఆషాఢ బహుళ పక్షమి అమావాస్య తేదీ 20 జూలై 2020 సోమవారం రోజున ఉదయం 10 :52 నిమిషాలకు రవి నిరయన పుష్యమీ కార్తె ప్రవేశము. ప్రవేశ సమయమునకు పునర్వసు నక్షత్రం, కన్య లగ్నం, వాయు మండలం , నిర్జలరాశి ,పుం - పుం యోగం, గజవాహనము, రవ్వాది గ్రహములు జల , రస, సౌమ్య , రస, వాయు, రస, నాడీచారము మొదలగు శుభాశుభ యోగములచే
తేదీ 20, 21 దేశాభేధమున వర్షయోగం, 22 స్వల్ప వర్షం, 23, 24 పొడి వాతావరణం ఉండే అవకాశాలు, 25, 26 మేఘ గర్జనలు, సల్ప తుషార వృష్టి , 27 వాతావరణంలో మార్పు, 28, 29 తీర ప్రాంతములలో వాయు చలనములు, తుఫాన్, వాయు గుండం ఏర్పడే అవకాశాలున్నాయి, 30, 31 వాయువుతో కూడిన తేలికపాటి వర్షాలు, 1, 2 ఖండ వర్షయోగం, సరాసరిగా ఈ కార్తెలో వృష్టిభంగయోగములు ఉన్ననూ స్వల్పఖండతుషారవృష్టి కలుగును. ఈ కార్తె వర్ష ఫలితములు బ్రహ్మశ్రీ చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారిచే గుణింపబడిన పంచాంగా ఆధారంగా ఫలితాలను తెలియజేయడమైనది.