Ramadan 2022: రంజాన్ మాసంలోనే ఎందుకు ఉపవాసం చేస్తారో తెలుసా..
Ramadan 2022: ఈ రంజాన్ మాసంలోనే ముస్లింలకు పవిత్రమైన ఖురాన్ గ్రంథం స్వర్గం నుంచి భూమికి చేరుకుందని వారు నమ్ముతారు. ఈ గ్రంథం ప్రపంచ మానవులందరికీ మార్గదర్శకం చూపిస్తుంది. అందుకే ముస్లింలందరూ ఆ అల్లాహ్ కు కృతజ్ఞతగా ఉపవాసం చేస్తారు.
Ramadan 2022: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ రంజాన్ పండుగ ఎంతో విశిష్టమైంది.. మరెంతో పవిత్రమైంది. ఈ ప్రతి ఏడాది ఈ రంజాన్ మాసంలో ముస్లింలు 30 రోజుల పాటు నిష్టగా ఉపవాసం చేస్తుంటారు. చందమామ కనిపించడంతోనే ఈ రంజాన్ లేదా రమదాన్ మొదలవుతుంది.
ముఖ్యంగా ఈ పవిత్రమైన మాసంలో చనిపోయిన వారు నేరుగా స్వర్గానికే వెళతారని వీరు నమ్ముతారు. ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో నరక ద్వారాలు మూసి ఉంటాయని వీరు విశ్వసిస్తారు. అంతేకాదు ఈ నెల రోజుల పాటు రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు. అలాగే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ .. ఇప్తార్ విందులను కూడా ఏర్పాటు చేస్తుంటారు.
ఇలా చేస్తే.. వారి కష్టాలన్నీ తొలగిపోతాయని వీరి నమ్మకం. ముఖ్యంగా ఈ మాసంలో ముస్లింలంతా పేదలకు తమకు చేతనైనా దానధర్మాలను చేస్తుంటారు. అంతేకాదు ఈ మాసమంతా కోపానికి లోను కారు. చాలా శాంతంగా ఉంటారు. దయతో మసులుకుంటారు. సానుభూతి కనబరుస్తంటారు. మరి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం పదండి..
ముస్లింలకు ఎంతో పవిత్రమైన ఈ మాసంలో.. వీరు తప్పకుండా ఉపవాస దీక్షను చేపట్టాలి. ఖురాన్ ను అందించినందుకు గానూ, ప్రవక్తగా మహమ్మద్ ను నియమించినందుకు గాను ముస్లింలంతా ఆ అల్లాహ్ కు కృతజ్ఞతను తెలిపేందుకే నిష్టగా ఉపవాస దీక్షను చేపడతారట.
ఈ ఉపవాస దీక్ష కేవలం ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే కాదు.. జ్ఞానేంద్రియాలను కంట్రోల్ చేయడం కూడా . ఉపవాస దీక్షలో ఉన్నవారు అబద్దాలు చెప్పకూడదు. చెడు మాటలను అనకూడదు.. వినకూడదు. అలాగే అశ్లీలాలను చూడకూదు. మనల్ని సన్మార్గంలో నడిపించే ఉద్దేశమే ఈ ఉపవాస దీక్ష ముఖ్య ఉద్దేశం. నెల రోజుల పాటు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఈ నెల రోజుల పాటు ఇలా ఉంటే మిగతా 11 నెలలు ఈ సన్మార్గంలో ఖచ్చితంగా నడుస్తారని నమ్మకం.
ఈ రంజాన్ నెలలో సూర్యోదయం నుంచి ఉపవాస దీక్ష మొదలయ్యి సూర్యాస్తమయానికి ముగుస్తుంది. ఈ మధ్యకాలంలో వారు నీళ్లను తప్ప ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోరు. ఇలా ఉండటం వల్ల ఆకలి విలువ తెలుస్తుంది. ఈ ప్రపంచలో ఆకలితో అలమటించే పేదోళ్ల బాధలు తెలుస్తాయి. దీనివల్ల వారికి మనం పేదోళ్లకు సేవ చేయాలన్న ఆలోచన పుట్టుకొస్తుందట.