వాస్తవాలు మనకు తెలియక విన్నట్టే విని అలా అశ్రద్ద చేస్తూ కాలం గడిపెస్తున్నాం. ఒక సారి ఈ క్రింది విషయాలు గమనిస్తే మనం దేవాలం వెల్లివస్తే ఎంతటి ప్రయోజనాన్ని పొందుతామో ఓక సారి గమనిద్దాం.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
హిందూ సనాతన సాంప్రదాయంలో ఎంతో సాంకేతికత విజ్ఞానం దాగిఉంది. అందుకే మన పెద్దలు అంటుంటారు తరచూ గుడికి వెళ్ళిరండి అని. వాస్తవాలు మనకు తెలియక విన్నట్టే విని అలా అశ్రద్ద చేస్తూ కాలం గడిపెస్తున్నాం. ఒక సారి ఈ క్రింది విషయాలు గమనిస్తే మనం దేవాలం వెల్లివస్తే ఎంతటి ప్రయోజనాన్ని పొందుతామో ఓక సారి గమనిద్దాం.
1. మూలవిరాట్ : భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.
2. ప్రదక్షిణ : మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.
3. ఆభరణాలతో దర్శనం : ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని...
4. కొబ్బరి కాయ : ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం...
5. మంత్రాలు : ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి.
6. గర్భగుడి : గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.
7. అభిషేకం : విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.
8. హారతి : పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.
9. తీర్థం : ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు.
10. మడి : తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది. అందుకే మడి ఆచారం అని పెద్దలు నిర్ణయించారు. వాస్తవాలు ఇవే మనం సరిగా తెలుసుకోగలిగితే సనాతన భారతీయ ఆలయ నిర్మాణ వ్యవస్థలోని అత్యద్భుతమైన వైజ్ఞానిక సాంకేతిక పరిజ్ఞాన రహస్యాలు అవగతమవుతాయి. మానసిక, శారీరక సౌఖ్యం పాడడానికి రోజు దైవదర్శనం కొరకై దేవాలయాలు దర్శించండి.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 6, 2021, 10:31 AM IST