వీధి "పోటు" శూలలు విధిని మారుస్తుందా
స్థల శుద్ధి లేనప్పుడు గృహ నిర్మాణం పనికిరాదు. స్థలం ఎన్నుకోవడంలో నేర్పు వుంటే గృహ నిర్మాణంలో అనుకూలంగా వుంటుంది. స్థలానికి సమకోణంలో వీధి దూసుకుపోతే వీధి శూల వున్నట్లు అర్థం. అంటే వేరే వీధి వచ్చి గృహ గర్భంలో తగిలితే "గర్భశూల" అంటారు
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
మనం నివసించే గృహానికి ఎదురుగా నిలువైన వీధి ఉంటే ఆ ఇంటికి వీధి పోటు ఉన్నట్లు గ్రహించాలి. సాధారణంగా ఇంటికి ఎదురుగా ఉన్నవీధి మన ఇంటివరకు వచ్చి ఆగిపోవడమో లేక అటు ఇటుగాని ఏదైనా ఒకవైపుగాని విస్తరించడమో జరుగుతుంది. అన్ని వీధి పోట్ల ఫలితాలు ఒకే మాదిరిగా ఉండవు. కొన్ని చెడుఫలితాలు తీవ్ర స్థాయిలో చూపిస్తాయి. అసలు ఏ వీధి పోటు లేకుండా జాగ్రత్త పడటం ఉత్తమం. కొందరి అభిప్రాయ ప్రకారం కొన్ని వీధి పోట్లు అనుకూల ఫలితాలు చూపిస్తాయి అని అభిప్రాయపడుతుంటారు. అసలు మనం నివసించే ఇంటికి ఏ వీధి పోటు లేకుండా జాగ్రత్త పడి గృహ నిర్మాణం జరుపుకుంటే మంచిది.
స్థల శుద్ధి లేనప్పుడు గృహ నిర్మాణం పనికిరాదు. స్థలం ఎన్నుకోవడంలో నేర్పు వుంటే గృహ నిర్మాణంలో అనుకూలంగా వుంటుంది. స్థలానికి సమకోణంలో వీధి దూసుకుపోతే వీధి శూల వున్నట్లు అర్థం. అంటే వేరే వీధి వచ్చి గృహ గర్భంలో తగిలితే "గర్భశూల" అంటారు. వీధి స్థలంలోని ఇంటి నుండి దూసుకుని వెళితే "వీధిశూల" అని గుర్తించాలి.
వీధిపోట్లు కొన్ని దిశల వారిగా ఫలితాలు :-
* తూర్పు వీధిపోటు వల్ల రాజ 'ప్రభుత్వ' భయం కలుగుతుంది.
* తూర్పు ఆగ్నేయ వీధిపోటు :- ఈ వీధిపోటు వలన ఈ ఇంట్లో నివసించే వారి ఇళ్లును, ఒళ్ళును గుల్ల చేస్తుంది. ఈ వీధిపోటు వలన కష్టములు కల్గుతాయి.
* పశ్చిమ నైరుతి వీధిపోటు వలన ఆ ఇంట్లో నివసించే పురుషుల మీద చెడు ప్రభావం చూపుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. జరగవలసిన శుభకార్యాలు జరగనివ్వదు. ఉద్యోగంలో ప్రమోషన్లు రానివ్వదు. రావలసిన డబ్బు చేతికి రాదు. ఎంత నీతిగా బతికినా ఎంతటి టాలెంట్ ఉన్న సమాజంలో మంచి పేరు గుర్తింపు రానివ్వదు. నోటిదాకా వచ్చిన ఆహరం సమయానికి గ్రద్ద తన్నుకు పోయినట్లు అనుభూతి కలుగుతుంది. క్రమంగా నిస్త్రాణ స్థితికి లోనవుతూ ఉంటారు.
* నైరుతి వీధిపోటు మరియు ఉత్తర వాయవ్య వీధిపోట్లు మనిషిని పూర్తిగా నిస్పృహకు లోను చేస్తాయి. ఏ కొత్త పనిని ప్రారంభిచాలన్న మానసిక భయానికి లోనగునట్లు ప్రభావాన్ని చూపిస్తుంది. చేతికందిన డబ్బు అనుకున్న పనికి కాక అనవసమైన ఆకస్మికమైన వాటికి ఖర్చులు చేయిస్తాయి. తలపెట్టిన కార్యానికి ప్రారంభంలో అందరి మద్దత్తు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అసలు సమయానికి అందరూ మాయం అవుతారు, తప్పుకుంటారు. ఎండమావుల లాంటి ఫలితాలు కనబడుతాయి.
* ఉత్తర వాయవ్యంలో వీధిపోటు :- గృహానికి ఉత్తర వాయవ్యంలో వీధిపోటు ఉండడం వలన ఆ ఇంట్లో నివసించే స్త్రీలు దుష్ప్రభావానికి లోనవుతారు. ముఖ్యంగా ఆ ఇంట్లో ఉండే యువతుల మీద దీని ప్రభావం కాస్త ఎక్కువ ఉంటుంది. విద్యార్ధులకు చదువుపై శ్రద్ధ ఉండనివ్వదు. పెళ్లి సంబంధాలు త్వరగా కుదరకపోవడం జరుగుతుంది. వివాహ విషయాలలో అనేక అంతరాయాలు, జీవితం మీద ఓ విధమైన తేలిక భావాన్ని వ్యక్తపరుస్తూ ... వయస్సుకు మించిన వేదాంత దోరనితో మాట్లాడుతుంటారు.
* ఆగ్నేయం వీధిపోటు అయితే అగ్ని భయం, చోర భయం కూడా కలుగుతాయి.
* దక్షిణం వీధిపోటు అయితే రోగాలు, చావులు.
* పాము పుట్ట వున్న స్థలం కొని పుట్ట త్రవ్వి తీసివేసుకోవచ్చులే అని అనుకోకూడదు. అలా చేస్తే తర తరాలుగా నాగభయం "శాపం" పీడిస్తుంది. నాగ దోషం కారణంగా సంతాన నష్టం, పిల్లల అకాల మరణం వంటివి సంభవించే అవకాశం ఏర్పడవచ్చును.
* దక్షిణ నైరుతి వీధిపోటు :- ఆ గృహంలో నివసించే స్త్రీల మీద ముఖ్యంగా యజమానురాలి పైన చెడు ఫలితాన్ని చూపిస్తుంది. భార్య భర్తల మధ్య సరైన సఖ్యత లేకపోవడం జరుగుతుంది. స్త్రీ అనారోగ్యం పాలు కావడం, అవమానాల పాలవడం, గౌరవ ప్రదమైన స్థానం పొందలేకపోవడం, తరచూ మధనపడటం అనుకున్న విధంగా ఇంటిని తీర్చిదిద్డలేక అభాసుపాలు అవడం జరుగుతుంది.
హాయిగా మన ఇంట్లో ప్రశాంతగా జీవించాలి అంటే అనుభవజులైన వాస్తు శాస్త్ర పండితుని సలహా మేరకు గృహ నిర్మాణం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఏ దిక్కు, విధిక్కులలో వీధిపోటు లేకుండా జాగ్రత్త పడాలి. కొన్ని దిక్కులలో విధిక్కులలో వీధిపోటు కలిగిన ఇల్లు గనక పూర్వం నుండే ఉంటే లేదా తప్పని సరి కొనవలసి వస్తే అందుకు తప్పనిసరి సరైన వాస్తు సలహా తీసుకుని.. దాన్ని పాటించి వెంటనే పరిహార ప్రక్రియ చేపట్టాలి.
వాస్తవానికి ఏ ఇంట్లో అయితే పంచ లోహాలతో శాస్త్రోక్తక విధి విధానాలతో మత్స్యయంత్రాన్ని పూజ జరిపించి ఇంటికి నాలుగు వైపులలో నవరత్నాలతో పాటు మత్స్యయంత్రాన్ని ప్రాణ ప్రతిష్ట జరిపించి నిక్షిప్తం చేసిన ఇంటికి అన్ని రకాల దోషాలను హరించి అదుపు చేస్తాయి. పంచలోహంతో చేయించిన మత్స్యయంత్రం కాస్త ఖర్చుతో కూడుకుని ఉంటుంది, కానీ అది ఇచ్చే శుభ ఫలితాలు మనకు తెలియకుండానే ఎన్నో ఉంటాయి.
ఈ మత్స్యయంత్రాన్ని నూతన గృహ ఆరంభ సమయంలో మరియు ఇంతకు పూర్వమే కట్టిన ఇళ్ళకు అపార్టుమెంటులకు, వ్యాపార స్థలాలకు, ప్యాక్టరీలకు పెట్టుకోవచ్చును. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది యంత్ర స్థాపన చేసే విధానంలో తేడా వస్తే ఫలితాలు ఇవ్వవు. సరైన పొజిషన్ లో స్థాపితం చేస్తేనే మంచి ఫలితాలను పొందుతారు.
రాగి యంత్రాలు అంతగా ఫలితాలు ఇవ్వలేవు. ఇతర మెటల్స్ తో చేసిన యంత్రాలు అస్సలు శుభాలను కలిగించవు. మత్స్యయంత్రం అంటే పూజ గదిలోనో లేదా ఈశాన్య మూలలో ఒకపాత్రలో నీళ్ళుపోసి అందులో ఉంచిన వాటికి ఫలితాలు ఇవ్వవు. కేవలం భూమిలో గాని ఇంటి గోడలో నిక్షిప్తం చేసిన వాటికే శుభ ఫలితాలు ఇస్తాయి.
స్వంత నిర్ణయాలతోనో లేక శాస్త్రం మీద పరిపూర్ణమైన అవగాహన లేని వ్యక్తుల మాటలతోనో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని అనవసరంగా ప్రశాంతతను కోల్పోకూడదు. వాస్తు ప్రకారం మనం నివసించే ఇల్లు ఎలా ఉండాలి అనే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఇంటి నిర్మాణం కొరకు లక్షలు, కోట్లు డబ్బులను ఖర్చుపెట్టి ఇంటిని నిర్మించు కుంటారు కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు "స్వయంకృతాపరాధం" వలన మనస్సుకు ప్రశాంతత లేకా నానా అవస్థలు పడుతుంటారు. ఇంత కష్టపడి కట్టుకున్న ఇంట్లో ప్రశాంత అనేది ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండేలాగా జాగ్రత్త పడుతూ.. విజ్ఞత కలిగిన నిర్ణయాన్ని తీసుకోండి.