ఉగ్రవారాహీ 'కాశీ' వారహిదేవి

ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈ అమ్మవారి పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. 

story of lord  varahi devi

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

story of lord  varahi devi

కాశీ ఉగ్రవారాహీఅమ్మవారి దేవాలయం, వారణాసి భూగృహంలో ఉగ్రవారాహీ విచిత్ర దేవాలయం భూగృహంలో ఉన్న వారాహిదేవి విగ్రం చాలా పెద్దది. ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికీ ఆ భూ గృహంలో ప్రవేశం లేదు. ఉదయం 8  గంటలలోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించినా కిందకి మాత్రం వెళ్ళనీయరు. పై భాగంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూడగలం. కేవలం అమ్మవారి ముఖం, పాదాలు మాత్రమే చూడగలం.

'రాత్రివేళల్లో పూజలందుకునే వారాహిదేవత' మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరుపాలే సప్తమాతృకాలు. 1 బ్రాహ్మి, 2 మహేశ్వరీ , 3 కౌమారి, 4 వైష్ణవి, 5 వారాహి, 6 ఇంద్రాణి, 7 చాముండి. వీరు దుష్టశిక్షణ కోసం భక్తుల కాపలాగా ఉండి రక్షిస్తారు.  వారాహిదేవి సప్తమాతృకలలో ఒకరు. 'వరాహుని స్త్రీతత్వం'  పూర్వం హిరాణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి, భులోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది. 

ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈ అమ్మవారి పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు ఉంటుంది. ఈ తల్లి వరహా ముఖంతో ,ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖం, పాశము, హలము, వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహానాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు.      

కాశీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళారా? వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. కాశీ వెళ్ళిన వారు తప్పక దర్శించుకోవలసిన ముఖ్య దేవాలయం. ఈ ఆలయం వేళలు ఉదయం 4:30 నుండి 8:30 వరకు మాత్రమే. కేవలం నాలుగు గంటలు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. తరువాత మూసేస్తారు. 

ఎందుకని అనేగా మీ సందేహం! అమ్మవారు ఆ వారణాసి గ్రామదేవత. చీకటి పడింది మొదలు ఉదయం 3:30 వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది. అందువలన అమ్మవారి ఆలయంలో 4 గంటల పాటు పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించు కోవడానికి ఏర్పాటు చేసిన రెండు కన్నాలలో నుండి దర్శనం చేసుకోవాలి. ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖ భాగం మాత్రమే కనిపిస్తుంది, రెండవ కన్నంలో నుండి చూస్తే పాదాలు దర్శనం అవుతాయి. అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతి ఇచ్చేసి సెల్లార్ లో నుండి బయటికి వచ్చేస్తాడు. ఆ తరువాత ఆ కన్నాలలో నుండి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు. 

మొన్నీమధ్య జరిగిన ఓ సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి. క్రొత్తగా పెళ్ళైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారు. పూజారి ఎప్పటిలాగే కన్నంలో నుండి చూడమని చెబితే వినలేదు. పైపెచ్చు మూర్ఖపు వాదనకి దిగారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుందా! భక్తులని చూడనివ్వదా! అంటే కాదు నాయనా! శాంత కళ, ఉగ్ర కళ అని రెండు ఉంటాయి. శాంత కళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ఉగ్ర కళ అంటే దుష్ట సంహరార్థం ఎత్తిన అవతారం. ఆ కళని సామాన్యులు తట్టుకోలేరు.

నేను వెళితేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను. మనం సూర్యుడిని ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేము. ఉదయం ఉన్నది ఆ సూర్యుడే. మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే కదా అని చూస్తాను అంటే సాధ్యమేనా! కళ్ళు టపాసుల్లా పేల్లిపోతాయ్, దృష్టి పోతుంది. అలాంటిది దుష్ట శిక్షనార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు, చూడకూడదు. అని ఎంతో శ్రద్దగా చేప్పినా  వినకుండా చూడనివ్వకపొతే కోర్ట్ కి వెళ్లి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటాం. అని మొండి పట్టుపట్టారు. 
దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది ప్రవర్తన అని సెల్లార్ లో ఉన్న అమ్మవారి వద్దకి ఆ కొత్త జంటని తీసుకెళ్ళాడు. క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చే లోపు ఇద్దరు కిందపడి మరణించారు.

మాహా శక్తి కలిగిన వారాహి అమ్మవారు కాశీ క్షేత్రంలో కొలువై ఉన్నందున అందుకే ఆ అమ్మ గ్రామ దేవత కరుణా వీక్షణాలతో వారణాసిలో ఇంతవరకు ఒక కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శత్రుభయం ఉండదు, జ్ఞాన సిద్ధి కలుగుతుంది. యోగులకు కుండలినీ శక్తి జాగృతం అవుతుంది. అమ్మవారి అష్టోత్తరం పఠించడం వలన సకలజయాలు సిద్ధిస్తాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios