Sri Rama Navami 2022: శ్రీ రామ నవమి రోజు ఈ ఒక్క మాటను తప్పక స్మరిస్తే.. మీరు ధనవంతులుగా మారిపోవడం ఖాయమట..
Sri Rama Navami 2022: శ్రీరామ నవమి నాడు అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన శ్లోకం అయినటువంటి.. శ్రీరామ రామ రామేతి, రామే రామే మనోరమే; సహస్ర నామ తతుల్యం, రామ నామ వరాననే అనే పదాన్ని మనసులో మూడు సార్లు స్మరిస్తే.. కఠిక దరిద్రుడైనా ధనవంతుడిగా మారిపోతాడని పండితులు చెబుతున్నారు.
Sri Rama Navami 2022: ఈ ఏడాది శ్రీరామ నవమి ఏప్రిల్ 10 వ తారీఖున వచ్చింది. శ్రీరాముడు జన్మించిన ఈ పవిత్రమైన రోజున భక్తులు ఆ శ్రీరామంద్రుడిని నిష్టగా పూజిస్తే సకలపాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
అయితే శ్రీరామ నవమి నాడు మనం చేసినా పాపాలన్నీ తొలగిపోవాలన్నా.. కఠిక దరిద్రుడు కూడా ధనవంతుడిగా మారిపోవాలన్నా.. ఎంతో పవిత్రమైన, శక్తివంతమైన ఈ మాటను మన మనసులో మూడుసార్లు అనుకుంటే చాలట. ఆ శ్లోకం ఏంటంటే..
శ్రీ రామ రామ రామేతి,
రమే రామే మనోరమే;
సహస్ర నామ తతుల్యం,
రామ నామ వరాననే
ఈ శ్లోకాన్ని శ్రీరామ నవమి నాడు మనసులో మూడు స్మరిస్తే.. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ విషయం పురాణాల్లో కూడా చెప్పబడింది.
పురాణాల ప్రకారం.. ఒకానొక నాడు గజేంద్రుడు కొలనులో స్నానం చేస్తుండగా.. ఒక ముసలి వచ్చి గజేంద్రుని పట్టుకుంది. అది ఎంతకీ వదలకపోవడంతో.. గజేంద్రుడు దానిబారి నుంచి రక్షింపమని విష్ణువుని శరణు వేడుతాడు.
ఆ సమయంలో విష్ణువు తన భార్య అయిన లక్ష్మీదేవి చీర కొంగుతో ఆడుతుంటాడట. అయితే గజేంద్రుని మాటవిని ఆ విష్ణుదేవుడు లక్ష్మీదేవితో సహా అలాగే భూలోకానికి పయణమవుతాడు. వారి వెంటే సుదర్శన చక్రం, గరుత్మంతుడు కూడా వస్తాయట.
విష్ణువు భూలోకంలో అడుగుపెట్టగానే సుదర్శక చక్రంతో ముసలిని అంతం చేస్తాడట. ఈ కథ సారాంశం మనకు ఏదైనా ఆపద కలిగినప్పుడు ధైర్ఘం కోల్పోకుండా భగవంతుడిపై విశ్వాసం ఉంచాలని తెలియజేస్తుంది. ఆపద సమయంలో నీకు ఎవరూ దిక్కులేకపోతే.. ఆ దేవుడే నీకు దిక్కువుతాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆపద సమయంలో ఆ దేవుడిని స్మరించండి. అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఈ విష్ణు సహస్ర నామాన్ని ప్రతిరోజూ మూడు సార్లు స్మరిస్తే పాపాలన్నీ తొలగిపోతాయట.
ఇకపోతే ఎంతో ప్రత్యేకమైన శ్రీరామ నవమి నాడు తారక మంత్రాన్ని స్మరిస్తే.. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడతారని పురాణాలు పేర్కొంటున్నాయి.
శ్రీ రామ రామ రామేతి,
రమే రామే మనోరమే;
సహస్ర నామ తతుల్యం,
రామ నామ వరాననే. ఈ తారక మంత్రాన్ని శ్రీరామ నవమి నాడు మూడు సార్లు స్మరిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయట. అంతేకాదు పాపాలన్నీ తొలగిపోతాయట. ఈ మంతాన్ని మొదటగా ఆ భోళాశంకరుడు పర్వతీమాతకు చెప్పాడని పండితులు చెబుతున్నారు.