Asianet News TeluguAsianet News Telugu

భోగి పండగకు చిన్న పిల్లలకు భోగిపండ్లలో రేగి పండ్లు ఎందుకు పోస్తారు తెలుసా..?

ఈ పండ్లు తల పైన నుండి పడటం వల్ల తల మెదడులోని నరాలకు రేగి పండ్ల నుండి వచ్చే వాయువు వల్ల ఆక్టివ్ అవుతారు. శీతాకాలంలో వచ్చే జబ్బులు వల్ల పిల్లలు మెతక బడిపోతారు ఈ రేగి పళ్లలో అరా ఎక్కువగా ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యం లభిస్తుంది

speciality of Bogi Festival
Author
Hyderabad, First Published Jan 13, 2021, 7:24 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

speciality of Bogi Festival

భోగి పండగ రోజున  గోచార గ్రహస్థీతిలో ఉన్న అన్ని చెడు కర్మలు తొలగాలి భోగి మంటవేస్తారు. ఆ బోగి నుండి దీపం తెచ్చి ఇంట్లో దేవుడి ముందు పెడతారు, ఇది ఒక సాంప్రదాయం దాంతో పాటు ఆ రోజు సాయంత్రం ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు భోగి పండ్లు పోస్తారు, పిల్లలకు ఐదు సంవత్సరాలు లోపు ఉండే బాల అరిష్టాలు, దిష్టి  తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకొని ఈ రేగి పండ్లు పోస్తారు. ఆ వయస్సులో పిల్లలకు బ్రహ్మ రంధ్రం పలుచగా ఉంటుంది రేఖి అరా కూడా పలచగా ఉంటుంది. ఈ రేగి పండ్లుకి రోగ నిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటాయి. అవి పోసిన సమయంలో రేగి పండ్లు నుండి వచ్చే వాయువు పిల్లల తల పైన బ్రహ్మ రంధ్రానికి శక్తిని ఇస్తుంది, మేధస్సుకి శక్తి వస్తుంది.

ఈ పండ్లు తల పైన నుండి పడటం వల్ల తల మెదడులోని నరాలకు రేగి పండ్ల నుండి వచ్చే వాయువు వల్ల ఆక్టివ్ అవుతారు. శీతాకాలంలో వచ్చే జబ్బులు వల్ల పిల్లలు మెతక బడిపోతారు ఈ రేగి పళ్లలో అరా ఎక్కువగా ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యం లభిస్తుంది ఇది ఒక శాస్త్రీయ సంప్రదాయం అలాగే చుట్టూ ఉండే అరా బలపడుతుంది. ఎటువంటి పరిస్థితులు అయినా ఎదురుకునే శక్తి పిల్లలకు రావాలి అనే ఉద్దేశంతో ఈ రేగి పండ్లనే పోస్తారు, అలాగే పిల్లలకు ఉన్న దిష్టి ప్రభావం తగ్గుతుంది, చుట్టు పక్కల వారు కూడా వచ్చి వారు కూడా రేగి పండ్లు పోయడం వలన పిల్లలకు అందరి ఆశీర్వాదం కలుగుతుంది.

రేగుపళ్లలో ‘సి’ విటమిన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించేందుకు, ఉదర సంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగుపళ్లు ఉపయోగపడతాయి. అందుకే రేగు పళ్లని ఎండపెట్టి వాటితో వడియాలను, రేగుతాండ్రనూ చేసుకుని తినే అలవాటు ఇప్పటికీ తెలుగుప్రాంతాలలో ఉంది. ఇంకో కారణం భోగి ముగిసాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకరరాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు.

రేగి పండ్లును బదరీఫలం అంటారు. సాక్షాత్తూ ఆ నరనారాయణులు ఈ బదరీ వృక్షం ( రేగుచెట్టు ) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారనీ ఆ ఫలాలని తింటూ తమ తపస్సుని కొనసాగించారనీ ప్రతీతి. వారు తపస్సు చేసే సమయంలో దేవతలు వారి తలపైన రేగి పండ్లు కురిపించారు అంటారు, అందుకే ఆ ప్రదేశానికి బదరీక్షేత్రం అన్నపేరు వచ్చిందని చెబుతారు. భారతీయ వాతావరణానికి తగినట్లుగానే రేగు చెట్టు ఎలాంటి ఒడుదొడుకులనైనా ఎదుర్కొని పెరుగుతుంది. -15 డిగ్రీల నుంచి విపరీతమైన 50 డిగ్రీల వరకూ ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని నిలబడుతుంది.

మన దేశంలోనే కాకుండా తూర్పు దేశాలన్నింటిలోనూ రేగుని తమ సంప్రదాయ వైద్యంలో వాడతారు. జలుబు దగ్గర నుండి సంతానలేమి వరకూ రేగుని అన్నిరకాల రుగ్మతలకీ దివ్యౌషధంగా భావిస్తారు. రేగుపళ్లు ఉన్నచోట క్రిమి కీటకాలు దరిచేరవని ఒక నమ్మకం. ఈ పండ్ల నుంచి వచ్చే వాసన మనసు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపిస్తుంది. భూటాన్‌లో అయితే కేవలం ఇంటిని సువాసనభరితంగా ఉంచేందుకు ఈ పళ్లను మరిగిస్తారు.

రేగిపండ్లు, బంతిపూల రెక్కలు ( వీటికి వాయువులో ఉండే క్రిములను నాశనము చేసే గుణం ఉంది )  చిల్లర కూడా కలిపి పిల్లల తలపైన నుండి దోసిలితో పోయాలి. చివరిగా దిష్టి తీయాలి అలా పోసేటప్పుడు ఇంటి దేవుణ్ణి స్మరించాలి చివరిగా కర్పూరంతో పిల్లలకు దిష్టి తీయాలి. పిల్లలు లేని వారు కొత్త దంపతులు చిన్ని కృష్ణునికి బోగిపళ్ళు పోసి పూజ చేసి తమకు పిల్లల్ని ప్రసాదించమని కోరుకోవాలి, పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటే ఆ ఇంట్లో సరదాగా భక్తిగా కూడా కృషుడికి భోగి పళ్ళు పోసి వేడుకగా భజన చేయవచ్చును. 12 సంవత్సరాల వయస్సు వరకు బాలారిష్ట దోషాలు వెంటాడుతాయి కాబట్టి ఈ ఈడు లోపు పిల్లలకు భోగిపళ్ళు పోయవచ్చును.


 

Follow Us:
Download App:
  • android
  • ios