నేడే సూర్య గ్రహణం... చేయాల్సినవీ, చేయకూడనివి ఇవే...!

ఈ రోజు వచ్చిన సూర్యగ్రహణం ఈ సంవత్సరానికి చివరిది కావడం గమనార్హం. మొట్టమొదటి గ్రహణం.. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన సంభవించింది.

Solar eclipse today: All you need to know about rare celestial event

నేడు సూర్యగ్రహణం. దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజల ఈరోజు అంటే అక్టోబర్ 25వ తేదీన  పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడగలరు. గత దశాబ్దకాలంలో భారతదేశంలో పాక్షిక సూర్యగ్రహణం కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా... మరో 10 సంవత్సరాల వరకు ఇలాంటి సూర్య గ్రహణం మళ్లీ కనిపించదు.

పాక్షిక సూర్యగ్రహణం అంటే ఏమిటి?
సూర్యుడు, చంద్రుడు, భూమి సరిగ్గా సమలేఖనం కానప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే... పాక్షిక సూర్య గ్రహణంలో సూర్యచంద్రులు ఒకే కక్ష్యలో ఉండరు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటాడు. అప్పుడు ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్య గ్రహణం అని అంటారు.  పాక్షిక సూర్యగ్రహణంలో  మూడు దశలు ఉన్నాయి, వీటిలో ప్రారంభం, గరిష్ట స్థాయికి చేరుకోవడం, ముగింపు ఉంటాయి...


ఈ రోజు వచ్చిన సూర్యగ్రహణం ఈ సంవత్సరానికి చివరిది కావడం గమనార్హం. మొట్టమొదటి గ్రహణం.. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన సంభవించింది. భారతదేశం నుండి కనిపించే తదుపరి అతిపెద్ద సూర్యగ్రహణం మే 21, 2031న వార్షిక గ్రహణం అవుతుంది. మళ్లీ అప్పుడు గ్రహణాన్ని వీక్షించవచ్చు.  మళ్లీ మూడు సంవత్సరాల తరువాత, మార్చి 20, 2034న, తదుపరి సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశం నుండి కనిపిస్తుంది. కాశ్మీర్  ఉత్తర భాగం నుండి ఇది కనిపించే అవకాశం ఉంది.

గ్రహణ సమయంలో చేయాల్సినవీ, చేయకూడనివి...

గ్రహణాన్ని చూసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణం కంటితో కనిపించినప్పటికీ, సూర్యకిరణాలు కంటికి చాలా హానికరం చేస్తాయని తెలుసుకోవాలి.

గ్రహణాన్ని వీక్షించడానికి సురక్షితమైన మార్గం ఎక్లిప్స్ గ్లాసెస్ వంటి ప్రత్యేక ప్రయోజన సోలార్ ఫిల్టర్‌లను ఉపయోగించడం చాలా అవసరం. ఈ గ్లాసెస్ బ్లాక్ పాలిమర్ లేదా అల్యూమినైజ్డ్ మైలార్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు. కాబట్టి.. అవి మీ కళ్ళు దెబ్బతినకుండా కాపాడతాయి.

గ్రహణం సమయంలో రోడ్డుపై వెళ్లే వాహనచోదకులు.. కచ్చితంగా హెల్మెట్ ధరించడం తప్పనిసరి.

ఇదిలా ఉండగా.. గ్రహణం కారణంగా నేడు దేవాలయాన్నీ మూతపడ్డాయి. కేవలం దేవాలయాలు మాత్రమే కాదు.. పాఠశాలలకు కూడా సెలవు ప్రకటిటంచారు. సూర్యగ్రహణం కారణంగా ఒడిశా ప్రభుత్వం ఈరోజు సెలవు దినంగా ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, కోర్టులు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మూసివేయడం విశేషం.

సూర్యగ్రహణం కారణంగా తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దాదాపు 12 గంటల పాటు మూసి ఉంచారు. ఉదయం 8:11 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios