Asianet News TeluguAsianet News Telugu

21 నవంబర్ 2021 నుండి సింధు నదీ పుష్కరాలు ప్రారంభం

ఆ నీరు ప్రవాహ రూపం దాలిస్తే దాన్ని నదిగా పిలుస్తాం. తూర్పు దిశగా ప్రవహిస్తూ నేరుగా సముద్రుడిలో కలిస్తే నదిగాను అలాగే పశ్చిమ దిశగా ప్రయాణించి సాగారాన్ని చేరుకొంటే దాన్ని నదం అంటారు. 

Sindhu River pushkaralu Started
Author
Hyderabad, First Published Nov 22, 2021, 10:35 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

                శ్రీ యాయుతం త్రిదేహ తాప పాప రాశి నాశకం
                మునీంద్ర సిద్ధ సాధ్య దేవదాన వైరభిష్టుతం
                తతే అస్తి యజ్ఞ పర్వతస్య ముక్తిదం సుఖాకరం
                నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం సశాంకరం

పై శ్లోకాన్ని చదవటం వలన పుష్కరుని యొక్క సర్వ దేవతల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని పురాణాలు చెప్తున్నాయి. 21 నవంబర్ 2021 నుండి 2 డిసెంబర్ 2021 వరకు సింధు నదీ పుష్కరాలు ప్రారంభం. నీరు సకల జీవకోటికి ప్రాణాధారం. మానవాళి ఉనికి, నాగరికత నీటిపైనే ఆధారపడింది. మన ప్రాచీన భారతీయ సనాతన ధర్మం జలానికి అమితమైన ప్రాధాన్యం ఇచ్చింది. దాహం తీర్చడమే కాదు, ఆచమనం మొదలు తర్పణం వరకు మనిషికి నీటితోనే పని. చివరకు తులసి తీర్థం గొంతు దిగాలన్నా నీటిచుక్కే సాయపడుతుంది. అందుకే పంచభూతాల్లో జలానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.

ఆ నీరు ప్రవాహ రూపం దాలిస్తే దాన్ని నదిగా పిలుస్తాం. తూర్పు దిశగా ప్రవహిస్తూ నేరుగా సముద్రుడిలో కలిస్తే నదిగాను అలాగే పశ్చిమ దిశగా ప్రయాణించి సాగారాన్ని చేరుకొంటే దాన్ని నదం అంటారు. నదీనదాలంటే మన దేశంలో కేవలం నీటి ప్రవాహాలు కావు - అవి దేవతా స్వరూపాలు.  శివుడు జలాభిషేక ప్రియుడు, మహావిష్ణువు భక్తితో తనకు ఒక్కనీటి బొట్టును సమర్పించినా చాలునంటాడు. మహా విష్ణువు నీటిలోనే నివాసం ఉంటాడు. నారం అంటే నీరు, నీరులో నివసిస్తాడు కాబట్టే ఆయనకు నారాయణుడు అనే పేరు వచ్చింది.

మన ప్రాచీన ఋషులు కూడా నదీతీరాల్లో నివసించేవారు. ఋషుల పుణ్యక్రతువుల కారణంగా నదీజలాలకు అపారమైన ఆధ్యాత్మిక జీవశక్తి చేకూరుతుందని మానవుల శారీరక మాలిన్యాలతో పాటు కర్మలకు చెందిన కాలుష్యాలను సైతం కడిగివేసే సామర్థ్యం సమకూరుతుందని పెద్దలు చెబుతారు. ఆ విశ్వాసం కారణంగానే మన దేశంలో పుణ్య నదీపుష్కరాలకు జనం కోట్ల సంఖ్యలో హాజరవుతారు. పుష్కరుడంటే వరుణుడు. ఆయనను తీర్థరాజుగా పిలుస్తారు, తీర్థమంటే పుణ్యస్థలం. 

పుణ్య పురుషులకు ఆశ్రయం కల్పించిన స్థలం 'తీర్థం' అవుతుందని మహాకవి కాళిదాసు కుమార సంభవమ్‌లో విశదీకరించాడు. పూర్వకాలంలో పుణ్యపురుషులు, ఋషులు నదీతీరాల్లో విడిది చేసేవారు. లోకహితం కోరి యజ్ఞాలు, హోమాలు నిర్వహించేవారు. తిరిగి తమ లోకాలకు తరలే ముందు  వారు దీక్షారూప తపస్సులను నదీజలాల్లో విడిచివెళతారని పురాణ వచనం. అందువల్ల నదులకు ఎనలేని పవిత్రత చేకూరుతుందని పెద్దలు చెబుతారు. అంతేకాదు ఆయా హోమ హవిస్సులను స్వీకరించడానికి వివిధ దేవతలు తీర్థాలకు వేంచేస్తారు. వారికి ఆతిథ్యం ఇచ్చే నిమిత్తం పుష్కరుడు వస్తాడు. 

పుష్కరాలు వస్తే దేవతలకే కాదు, నదులకూ గొప్ప పండుగే. ఒక్కో నదిలో ఏడాది చొప్పున 12 పుణ్యనదుల్లో పుష్కరుడు నివాసం ఉంటాడు కాబట్టి ప్రతి నదికీ 12 ఏళ్లకోసారి మనకు పుష్కరాలు వస్తాయి. ఈ ఏడాది సింధునదికి పుష్కర సంవత్సరం. దేవ గురువు బృహస్పతి కుంభరాశిలో సంచరించే సమయంలో సింధునదికి పుష్కరాలు వస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్ ఆరో తేదీన దేవ గురువు బృహస్పతి కుంభరాశిలో ప్రవేశించి రెండు నెలల వరకు ఉంటున్నాడు, ఆ తర్వాత మకరరాశిలోకి వెళ్తున్నాడు. తిరిగి ఈ ఏడాది నవంబర్ 21 న మరోసారి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు, అప్పుడు కూడా సింధునదికి పుష్కరవేడుకలు జరుపుకోవాలని కొంతమంది పంచాంగకర్తలు చెబుతున్నారు. తేదీలపై వివాదాలు ఏలా ఉన్న సింధునది పుష్కరాల్లో సమస్త భారత ప్రజానీకం పాల్గొనాలి. పుష్కర ఏడాదిలో ఆ నదీ జాలాలకు అపారమైన ఆధ్యాత్మిక జీవశక్తి చేకూరుతుంది. 

పుష్కర స్నాన శ్లోకం:-

''పిప్పలాద్సముత్పన్నే కృచ్చే లోక భయంకరి 
మృత్తికాంతే మయా దత్తా మహారార్థం ప్రకల్పయ"

ఈ మంత్రము చదువుకొని మట్టిని నదిలోకి వేసి మూడు సార్లు బ్రొటనవేలితో నీళ్ళు తీసుకొని తలపై చల్లుకోవాలి (గోవిందా అని మూడు సార్లు దేవుణ్ణి తల్చుకొని చల్లుకోవాలి). తరువాత గోదావరికి నమస్కరించి, ఆచమనం చేసి, (ఆచమనం అంటే –కుడిచేతిలోకి నీళ్ళు తీసుకొని దేవుడి పేరు చెప్పి త్రాగాలి). తదుపరి ఇలా మనం సంకల్పం చెప్పుకోవాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios