వినాయక చవితికి ఏకవింశతి పత్ర పూజ - వాటి విశేషాలు

వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. ఆ ఏకవింశతి పత్రాలు ఆయుర్వేద పరంగా మనిషికి ఎంత ఉపయోగకరంగా ఉపయోగపడుతున్నాయో గమనిద్దాం. 
 

Significance of Lord Vinayaka Chavithi

వినాయక చవితి భారతీయులకు అతిముఖ్య పండుగలలో ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసము శుక్ల చతుర్థి శుభ సమయంలో హస్త నక్షత్రమున రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. ఆ ఏకవింశతి పత్రాలు ఆయుర్వేద పరంగా మనిషికి ఎంత ఉపయోగకరంగా ఉపయోగపడుతున్నాయో గమనిద్దాం. 


1. మాచీ పత్రం / మాచ పత్రి

2. దూర్వా పత్రం / గరిక

3. అపామార్గ పత్రం / ఉత్తరేణి

4. బృహతీ పత్రం / ములక

5. దత్తూర పత్రం / ఉమ్మెత్త

6. తులసీ పత్రం / తులసి

7. బిల్వ పత్రం / మారేడు

8. బదరీ పత్రం / రేగు

9. చూత పత్రం / మామిడి

10. కరవీర పత్రం / గన్నేరు

11. మరువక పత్రం / ధవనం, మరువం

12. శమీ పత్రం / జమ్మి

13. విష్ణుక్రాంత పత్రం/

14. సింధువార పత్రం / వావిలి

15. అశ్వత్థ పత్రం / రావి

16. దాడిమీ పత్రం / దానిమ్మ

17. జాజి పత్రం / జాజిమల్లి

18. అర్జున పత్రం / మద్ది

19.దేవదారు పత్రం

20. గండలీ పత్రం / లతాదూర్వా

21. అర్క పత్రం / జిల్లేడు.


ఏకవింశతి పత్రాల వాటి విశేషాలు:-

* మాచీపత్రం :-  దీన్ని దవనం అని కూడా అంటారు. ఇది కుష్ఠు సంబంధ వ్యాధులను, బొల్లివంటి చర్మవ్యాధులను, నరాల సంబంధవ్యాధులను తగ్గిస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఈ పత్రాలున్న పరిసరాల్లో ఎటువంటి సూక్ష్మక్రిములు దరిచేరవు.

* బృహతీపత్రం :-  దీని వాకుడాకు అంటారు. ఇది ఆయాసాన్ని, దగ్గును, మలబద్దకము, అతివిరేచనాలను తగ్గిస్తుంది. బాలింతలకు ఈచెట్టు ఒక వరం. ఇది అనేక దివ్యౌషధాల తయారీకి ఉపయోగపడుతుంది.

* బిల్వపత్రం :-  దీన్ని మారేడు అంటారు. ఇది నీటిని శుద్ధి చేస్తుంది. కీళ్ల సంబంధవ్యాధులను, విరేచనాలను తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను వృద్ధిచేస్తుంది. శరీర దుర్వాసనను తగ్గిస్తుంది. అనేక ఔషధాల తయారీలో ఉపయోగపడుతుంది. సూక్ష్మక్రిమి సంహారిణిగా బాగా ఉపయోగపడుతుంది.

* దూర్వారయుగ్మం :- దీన్ని గరిక అంటారు. ఇది దేహంలో రక్తాన్ని శుద్ధిచేస్తుంది. అధికరక్తస్రావాన్ని, రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలోని హానికర సూక్ష్మక్రిములను నశింపజేస్తుంది. అజీర్ణవ్యాధిని, అధిక ఆమ్లస్రావాన్ని తగ్గిస్తుంది. సకలచర్మరోగాలను, సోరియాసిస్ లాంటి వ్యాధులను తగ్గిస్తుంది. దుస్స్వప్నాలను నివారిస్తుంది.

* దత్తుర పత్రం (ఉమ్మెత్త):- ఊపిరితిత్తులను వ్యాకోచింప చేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది.

* బదరి పత్రం (రేగు ఆకు):-  చర్మ వ్యాధులకు మంచి విరుగుడు.

* తుర్యా పత్రం(తులసి):- శరీరంలో ఉష్ణాన్ని నియంత్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. ఆ గాలికి జలుబు,దగ్గు వంటివి దరి చేరవు.

* అపామార్గ పత్రం(ఉత్తరేణి): - దగ్గు ,ఉబ్బసంకి బాగా పని చేస్తుంది.

* చూత పత్రం(మామిడి ఆకు):- నోటి దుర్వాసన,చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపసమనం ఇస్తుంది.

* జాజి పత్రం(జాజి ఆకు):- చర్మ రోగాలు,స్త్రీ సంభంద వ్యాధులకు మంచిది.

* గండకి పత్రం(అడవి మొల్ల యుధిక):- అతిమూత్ర సమస్యనుంచి ఉపసమనం ఇస్తుంది.

* అశ్వత పత్రం(రావి ఆకు):- చాల ఓషధగుణాలు ఉన్నాయి.

* అర్జున పత్రం(మద్ది ఆకు):- రక్త స్తంభనం,గుండె ఆరోగ్యానికి ఇది చాల సహాయకారి.

* అర్క పత్రం(జిల్లేడు ఆకు) :- నరాల బలహీనత ఉన్నవరికిది దివ్య ఒషధం.చర్మ వ్యాధులను నివారిస్తుంది.

* విష్ణు క్రాంతం(పొద్దు తిరుగుడు ఆకు):- దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చెబుతున్న దేమిటంటే ఇది మంచి స్కిన్ కేర్ మందుగా పనిచేస్తుంది.

* దాడిమ పత్రం(దానిమ్మ ఆకు):- వాంతులు,విరేచనాలు,అరికడుతుంది.శరీరంలో ఉన్నా హానికారక క్రిములను నాశనం చేస్తుంది.

* దేవదారు(దేవదారు ఆకు):- శరీర వేడిని తగ్గిస్తుంది.

* మరువాకం(మరువం ఆకు):- మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

* సింధువార పత్రం(వావిలాకు):- కీల్లనోప్పులకు మంచి మందు.

* శమీ పత్రం(జమ్మి చెట్టు):- నోటి వ్యాధులను తగ్గిస్తుంది.

* కరవీర పత్రం(గన్నేరు ఆకు):- గడ్డలు, పుండ్లు తగ్గటానికి దీని వేరు,బెరడు వాడతారు. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios