Asianet News TeluguAsianet News Telugu

కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత: ఈరోజు ఏం చేయాలి..?

కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించిన పురంజయుడు అనే రాజు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకొని, విష్ణు పూజతో మోక్షాన్ని పొందిన కథనం ప్రచారంలో ఉంది.

Significance of Karthika pournami 2023 ram
Author
First Published Nov 24, 2023, 11:00 AM IST


కార్తీకమాసంలో ముఖ్యమైన పర్వదినం కార్తీకపౌర్ణమి ఈ రోజు శ్రీహరి మత్స్యరూపంలో అవతరించాడని ప్రతీతి. కార్తీక పౌర్ణమినాడు సాయంకాలం ప్రదోషవేళలో దీపాలను వెలిగించి దీపదర్శనం చేసుకోవాలి. జ్వాలాతోరణ దర్శనంతో ఈ భూమిపై ఉండే సర్వ ప్రాణుల పాపాలు పరిహరించబడి సద్గతి లభిస్తుందని పురాణ వచనం. కార్తీక జ్వాలాతోరణం చేసినందు వలన జాతిభేదం లేకుండా, మానవులకు, కీటకాదులకు, పకక్షులకు, దోమలకు, జలచరాలైన చేపలకు, వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని ఐతిహ్యం. కార్తీక పౌర్ణమి రోజున వేదవ్యాస పూజ కూడా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపోత్సవం. సర్వపాపపరిహారం. కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించిన పురంజయుడు అనే రాజు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకొని, విష్ణు పూజతో మోక్షాన్ని పొందిన కథనం ప్రచారంలో ఉంది.

కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోత్సర్జనం చేయుట, సాలగ్రామను దానం చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట, విం ఎన్నో పుణ్యకార్యాల వలన వెనుకి జన్మయందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు.

కార్తీక మాసం నెలరోజులు దీపాలు వెలిగించలేని వాళ్ళు ఆ ఒక్క రోజు 365 లేదా వెయ్యి వత్తులతో దీపాలు వెలిగిస్తారు. స్వయంపాకం పితృప్రీత్యర్థం దానం చేస్తారు.

కార్తీకంలో ఆధ్యాత్మిక, ఆరోగ్యపరమైన ఉపయోగాలు : కార్తీకమాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైనది. మహిమాన్వితమైనది. నెలరోజుల పాటు తులసీకోట లేదా దేవాలయంలో దీపారాధన చేయడం ద్వారా అంతర్గత శక్తి పెరుగుతుంది. జ్ఞానం వికసిస్తుంది.

కార్తీకంలో శరదృతువు పవిత్రజలం హంసోదకంగా పిలవబడుతుంది. మానసిక, శారీరక, రుగ్మతల్ని తొలగించి ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం కార్తీకంలో ప్రముఖ స్థానం పొందింది.

పైత్య ప్రకోపాల్ని తగ్గించేందుకే ఈ హంసోదక స్నానం. ఇది అమృత తుల్యంగా మానవాళికి ఉపయుక్తంగా ఉంది. అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైన్టిది. శరదృతువులోని పవిత్ర జలాన్ని హంసోదకం అంటాం.

తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావనీ

సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా

సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు గంగాదేవి అన్ని ప్రదేశాలలో ద్రవరూపంలో ఉంటుంది. తులా మాసంలో గోవు పాదమంత జల ప్రదేశంలో కూడా శ్రీ మహావిష్ణువు ఉంాడనేది పురాణవచనం. సూర్యుడు తులారాశియందు సంచారం చేసే కార్తీకమాసంలో నిత్యం ప్రాతఃకాలం నదీస్నానం చేసేవారికి మహాపాతకాలు సైతం హరించబడతాయని ప్రతీతి. కొండలు, కోనలు, అడవుల గుండా నదులు ప్రవహిస్తూ ఉండటం వల్ల ఆయుర్వేద గుణాలు ఉన్న నదీటియందు స్నానం ఆచరించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. నదిలో అనిర్వచనీయమైన విద్యుత్‌ ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది.

శరీరాన్ని సమస్థితిలో ఉంచే నిరాహారం మరోయోగం. కొందరు ఉపవాసాన్ని రోజు మొత్తంలో ఒసారి ఫలాహారాన్ని స్వీకరించి ఏకభుక్తంగా నిర్వహిస్తారు. మరికొందరు నక్తం చేస్తుంటారు. అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం. ఇలా కార్తీక సోమవారాలు, కార్తీక శనివారాలు, ఏకాథులు, కార్తీక పౌర్ణమి విం రోజుల్లో ఉపవాస దీక్ష శరీరానికి మేలు చేస్తుంది.

వన భోజనాలు - అంతరార్థం : పత్రహరితంతోనే మానవాళి మనుగడ ముడిపడి ఉందని చెప్పడానికి వృక్షోరక్షతి రక్షితః అన్న నానుడి ప్రచారం చేసేందుకు పిలుపునివ్వడం కార్తీక వనభోజనాల అంతస్సూత్రం. భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉసిరికి ఉన్న ప్రాధాన్యత అంత, ఇంత కాదు. పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేసేందుకు అసలు సిసలైన రాచమార్గాలు. పవిత్రమైన ఔషధీగుణాలతో కూడిన వృక్షాల క్రింద భోజనం చేయడం ద్వారా, ఆ వృక్షగాలిని పీల్చడం ద్వారా సూక్ష్మీకృతమైన ఆ వృక్ష శక్తి మానవునికి ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. సామూహికంగా భోజనాలు చేయడం వల్ల పదిమందిలో మెలిగే పద్ధతులు తెలుస్తాయి. ఎలా తినాలో, ఎలా తినకూడదో చెప్పక్కర్లేకుండా తెలుస్తుంది. భోజనకాలే హరినామ స్మరణ చేస్తారు. దీనివల్ల మనం స్వీకరించే పదార్థాలు అన్ని ఆ భగవంతుని అనుగ్రహం అని మరోమారు గుర్తు చేసినట్లు అవుతుంది.

కార్తీక మాసంలో ఉసిరికిచెట్టు క్రింద సాలగ్రామ పూజ చేసి, వన భోజనాలు చేసినట్లైతే ఇహపర సౌఖ్యాలు లభిస్తాయని పురాణ వచనం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios