Asianet News TeluguAsianet News Telugu

Shri Krishna Janmashtami: కృష్ణాష్టమి పూజకు కావాల్సిన సామాగ్రి ఇదే..!

మహా విష్ణువు తొమ్మిదో అవతారంగా కృష్ణుడిని చెబుతుంటారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద పండుగలలో ఒకటి.దేవునికి నివాళులు అర్పించేందుకు ఈరోజు భక్తులు పూజలు చేస్తారు.

Significance and Puja Samagri of Shri Krishna Janmashtami
Author
hyderabad, First Published Aug 16, 2022, 2:46 PM IST

మరో రెండు రోజుల్లో కృష్ణాష్టమి వచ్చేస్తోంది. ఈ కృష్ణాష్టమినే గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి... ప్రతి సంవత్సరం అష్టమి తిథి, భాద్రపద కృష్ణ పక్షం లో వస్తుంది. ఈ పండగ శ్రీ కృష్ణుడి జన్మదినాన్ని సూచిస్తుంది. మహా విష్ణువు తొమ్మిదో అవతారంగా కృష్ణుడిని చెబుతుంటారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద పండుగలలో ఒకటి.దేవునికి నివాళులు అర్పించేందుకు ఈరోజు భక్తులు పూజలు చేస్తారు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే,కృష్ణాష్టమి రోజున బాల కృష్ణుడిని ఇంటికి స్వాగతించి పూజలు చేస్తారు. ఇంట్లో ఎవరైనా చిన్నారులు ఉంటే.. వారిని చిన్ని కృష్ణుడిలా అలంకరించి మురిసిపోతారు. ఆ చిన్ని కృష్ణుడితో బుడి బుడి అడుగులు వేయిస్తారు.

 
శ్రీ కృష్ణ జన్మాష్టమి పూజ కు అసవరమైన సామాగ్రి ఏంటో ఓసారి చూద్దాం..

చిన్న కృష్ణ విగ్రహం
బాల కృష్ణ కోసం ఒక ఊయల 
ఒక చిన్న వేణువు
శిశువు కోసం ఒక దుస్తులు , ఆభరణాలు.
 అలంకరణ కోసం పూలు, నైవేద్యాలు
తులసి ఆకులు
చందనం
కుంకుమ
అక్షింతలు
నైవేద్యానికి తెల్లటి వెన్న.
కలశం
గంగాజలం లేదా సాధారణ నీరు
నూనె దీపం (ఇత్తడి/వెండి లేదా మట్టి)
దీపం వెలిగించడానికి నువ్వులు లేదా ఆవాల నూనె లేదా నెయ్యి, దూది వత్తులు
ధూపం కర్రలు (అగర్బత్తి)
ధూప్
ఆపిల్, అరటిపండు, తీపి నిమ్మ, పియర్, జామ  ఏదైనా ఇతర పండ్లు

దక్షిణ (కరెన్సీ నోట్లు మరియు నాణేలు)
 కొబ్బరి కాయ
హారతి చేయడానికి కర్పూరం 
అన్ని సామగ్రిని నిర్వహించడానికి ప్లేట్లు లేదా ట్రేలు
తోరన్ లేదా డోర్ హ్యాంగింగ్స్ కోసం మామిడి ఆకులు
పంచామృతం (యాపిల్/అరటిపండు, తేనె, మిశ్రి, ఖర్జూరం మరియు నెయ్యి)

వీటన్నింటినీ ఉపయోగించి.. శ్రీకృష్ణుడిని పూజించి... ఆ తర్వాత ఊయలలో బాలకృష్ణుడి విగ్రహాన్ని ఉంచి.. ఊయల ఊపుతారు.

జన్మాష్టమి ప్రాముఖ్యత..
శ్రీ కృష్ణుడు, విష్ణువు  తొమ్మిదవ అవతారం. కంసుని నిరంకుశత్వాన్ని అంతం చేయడానికి, తరువాత కురుక్షేత్ర మహా యుద్ధంలో కీలక పాత్ర పోషించడానికి జన్మించాడు. భగవద్గీత, జీవిత పాఠాలతో నిండిన గ్రంథాన్ని మానవాళికి అందించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios