Asianet News TeluguAsianet News Telugu

శుక్రమౌఢ్యమి ప్రారంభం

శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము. మౌఢ్యమిని "మూఢమి" గా వాడుకభాషలో పిలుస్తారు. ఈ మూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు.

shukra Moudyami started
Author
Hyderabad, First Published May 28, 2020, 3:20 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

shukra Moudyami started
29 మే 2020 నుండి శుక్రమూఢమి ప్రారంభమై 9 జూన్ 2020 వరకు శుక్రమూఢమి త్యాగం జరుగును. అసలు మౌఢ్యమి అంటే ఏమిటి?
ఏ గ్రహమైనా నిర్దిష్టమైన కోణంలో సూర్యునకు సమీపంలో వస్తే శక్తిహీనమవుతుంది. ఇది అన్ని గ్రహాలకు ఉంటుంది. కానీ జ్యోతిష శాస్త్రంలో మాత్రము శుభ గ్రహాలైన గురువు, శుక్రునకు శక్తి హీనత మాత్రమే దోషంగా పరిగనిస్తుంది. చంద్రునికి శక్తిహీనతే ప్రతి మాసంలో వచ్చే అమావాస్య, గురుగ్రహ శక్తిహీనతను గురు మౌడ్యమి గానూ, శుక్ర గ్రహ శక్తిహీనతను శుక్రమౌఢ్యమిగానూ పరిగణిస్తారు. దీనినే వ్యవహారిక భాషలో మూడమి అని అంటారు. మౌడ్యమి శుభకార్యాలకు పనికిరాదు. 

శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము. మౌఢ్యమిని "మూఢమి" గా వాడుకభాషలో పిలుస్తారు. ఈ మూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు. మూఢమి అంటే చీకటి అని అర్ధం. మూఢమి అనేది అన్ని గ్రహాలకు ఉన్న గురు, శుక్ర మౌఢ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది. శుక్రమౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం ఆటుపోటులలో మార్పులు వస్తాయి.

శుక్ర గ్రహ పాలిత ద్వీపాలకు ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. శుక్రుడు సంసార జీవితానికి శృంగార జీవితానికి కారకుడు. జాతకములో శుక్రుడు బల హీనముగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు. ఇలాంటి వారు వ్యక్తిగత జాతక ఆధారంగా రేమిడి ఫాలో అవ్వాలి.

మౌఢ్యమిలో చేయకూడని కార్యక్రమములు:-

పెళ్ళిచూపులు, వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, యజ్ఞాలు చేయుట, మంత్రానుష్టానం, విగ్రహా ప్రతిష్టలు, వ్రతాలు, నూతన వధువు ప్రవేశం, నూతన వాహనము కొనుట, బావులు, బోరింగులు, చెరువులు తవ్వటం, పుట్టువెంట్రుకలకు, వేదా"విధ్యా"ఆరంభం , చెవులు కుట్టించుట, నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయరాదు.

మౌఢ్యమిలో చేయదగిన పనులు :-

జాతకర్మ , జాతకం రాయించుకోవడం , నవగ్రహ శాంతులు , జప , హోమాది శాంతులు , గండ నక్షత్ర శాంతులు ఉత్సవాలు , సీమంతం , నామకరణం , అన్నప్రాసనాది కార్యక్రమాలు గురుమౌఢ్యమి వచ్చినా , శుక్రమౌఢ్యమి వచ్చినా చేయవచ్చును. గర్భిణి స్త్రీలు , బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో మూఢాలలో ప్రయాణం చేయాల్సివస్తే శుభ తిధులలో అశ్వని , రేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios