రంజాన్ 2023: హెల్దీ కీర్ ఎలా తయారు చేయాలి..?

ముస్లిం సోదరులు చేసే కీర్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ కీర్ లేకుండా... ఈద్ పండగ పూర్తవ్వదు.. ఈ కీర్ ని  మరింత స్పెషల్ గా ఎలా తయారు చేయాలో ఓసారి చూద్దాం..

Ramadan 2023 How to make  Healthy Kheer

రంజాన్ పండగ దగ్గరపడుతోంది. ఈ పండగను ముస్లిం సోదరులు చాలా ఘనంగా జరుపుకుంటారు.ఈ పండగ సందర్భంగా  ముస్లిం సోదరులంతా కచ్చితంగా తమ ఇంట్లో వివిధ రకాల మిఠాయిలు చేసుకుంటారు. అయితే.. అందులో.. కీర్ మాత్రం స్పెషల్ అనే చెప్పాలి. మన ఇంట్లోనూ సేమియా పాయం చేసుకుంటాం. కానీ... ముస్లిం సోదరులు చేసే కీర్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ కీర్ లేకుండా... ఈద్ పండగ పూర్తవ్వదు.. ఈ కీర్ ని  మరింత స్పెషల్ గా ఎలా తయారు చేయాలో ఓసారి చూద్దాం..

ఈ కీర్ తయారీకి ముందుగా కావాల్సిన పదార్థాలేంటో ఓసారి చూద్దాం..

1.ఒకటిటన్నర లీటరు పాలు, ఒక కప్పు తురుమిన డేట్స్, అరటీస్పూన్ యాలకుల పొడి, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 4 టేబుల్ స్పూన్ల మలాయి, అర కప్పు వేయించిన సేమియా, పావు కప్పు పిస్తా పప్పు, పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు బాదం పప్పు, 3 టేబుల్ స్పూన్ల కిస్ మిస్ లు, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, 3-4 రేకుల కుంకుమ పువ్వు.

తయారీ విధానం...
ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి.. అందులో  సేమియా వేసి ఎర్రగా వేగే వరకు వేయించాలి. తర్వాత సేమియా వేరే ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

సేమ్ ప్యాన్ లో మిగిలిన నెయ్యి వేసి.. అందులో జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా పప్పు, కిస్ మిస్ లు  అన్నింటినీ బాగా వేయించాలి. తర్వాత... వాటిని మరో గిన్నెలో తీసుకోవాలి.

తర్వాత డేట్స్ తీసుకొని అందులోని గింజలను తొలగించాలి. తర్వాత వాటిని ఒక కప్పు వేడి నీటిలో నానపెట్టి.. తర్వాత మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి.

తర్వాత గిన్నె తీసుుకొని అందులో పాలు పోయాలి. ఆ పాలు సగం అయ్యేవరకు మరగనివ్వాలి. అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి.  ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేయాలి. ఆ తర్వాత  అందులోనే రోజ్ వాటర్, డేట్స్ పేస్ట్, ఫ్రెష్ క్రీమ్ ( మలాయ్) వేసి బాగా కలపాలి.

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో వేయించిన పప్పులు అన్నింటినీ వేయాలి. అంతే.. వేడి వేడిగా.. కీర్ రెడీ.. దీనిని మీరు ఇప్పుడు కమ్మగా ఆస్వాదించుకోవచ్చు. అతిథులకు కూడా వడ్డించుకోవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios